For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా భారీ దెబ్బ: మరో రూ.1.67 లక్షల కోట్లు... మొత్తం రూ.4.21 లక్షల కోట్లకు ఎన్పీఏలు

|

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించిన అనంతరం గత నెల నుండి క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకుంటున్నాయి. అయితే వ్యాపారాలు దెబ్బతిన్నాయి. డిమాండ్-లేమి కారణంగా అప్పుడే కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో కార్పోరేట్ రుణాలు పెరిగే అవకాశముందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (Ind-Ra) పేర్కొంది. టాప్ 500 ప్రయివేటు కంపెనీల రుణభారం పెరిగి, 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎన్పీఏలు ఏకంగా రూ.1.67 లక్షల కోట్లకు పెరగవచ్చునని అంచనా వేసింది.

ఐటీ రంగానికి ఊహించని దెబ్బ: ఈసారి నష్టపోయినా... కంపెనీల ఆశ అదేఐటీ రంగానికి ఊహించని దెబ్బ: ఈసారి నష్టపోయినా... కంపెనీల ఆశ అదే

ఎన్పీఏలు రూ.4.21 లక్షల కోట్లకు పెరిగే ప్రమాదం

ఎన్పీఏలు రూ.4.21 లక్షల కోట్లకు పెరిగే ప్రమాదం

కరోనా కంటే ముందు రూ.2.54 లక్షల కోట్లు అంచనా వేయగా, ఇప్పుడు ఈ మహమ్మారి దెబ్బ వల్ల రూ.1.67 లక్షల కోట్లు అంచనా వేసింది. మొత్తం రూ.4.21 లక్షల కోట్లు నిరర్థక రుణాలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం రుణాల్లో ఇవి 6.63 శాతానికి సమానం. ఇంతకుముందు ఇవి 4 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న రుణాలు 11.57 శాతం ఉండగా, తాజా అంచనాల ప్రకారం 18.27 శాతానికి పెరగనున్నాయి. మొత్తం రుణాల్లో రుణ వ్యయాలు, మొండి బకాయిలపై కేటాయింపులు 3.57 శాతానికి చేరతాయి.

టాప్ 500 కంపెనీలు

టాప్ 500 కంపెనీలు

రుణభారం ఎక్కువగా ఉన్న 500 టాప్ సంస్థల ఆర్థిక పరిస్థితుల్ని విశ్లేషించింది. కంపెనీల ఉత్పాదకత లేని ఆస్తులను మదింపు, ఆ తర్వాత రీఫైనాన్సింగ్ ఇబ్బందులను ఇండియా రేటింగ్స్ గుర్తించింది. కంపెనీలను 5 విభాగాలుగా విభజించింది. వీటి ఆధారంగా రుణం ఏమేర ఇబ్బందుల్లో ఉంటుందో అంచనా వేసింది. రుణ వ్యయాలను కూడా అంచనా వేసింది. రుణ మార్కెట్లు ముప్పుకు దూరంగా ఉంటే, కార్పోరేట్ రుణాల ఒత్తిడి మరింత పెరిగి రూ.1.68 లక్షల కోట్లకు చేరవచ్చునని, దీంతో 2021-22 నాటికి రూ.5.98 లక్షల కోట్లు నిరర్థక ఆస్తులుగా మారే ప్రమాదం ఉందని తెలిపింది.

9.27 శాతానికి సమానం

9.27 శాతానికి సమానం

ఇవి మొత్తం రుణాల్లో 9.27 శాతానికి సమానం. ఇదే జరిగితే రుణ వ్యయాలు కూడా 4.82 శాతానికి పెరగవచ్చునని అంచనా వేసింది. మిగిలిన రుణాల్లో 20.84 శాతం ఒత్తిడి ఎదుర్కొనే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను సవరించలేదు. ఎందుకంటే ఇవి రుణభారం అంచనాల్లో మార్పు తీసుకు రాకపోవచ్చు. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల రికవరికీ జాప్యం అయితే డిమాండ్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయని, ఇవి ఒత్తిడిలోని రుణాల అంచనాలను పెంచవచ్చునని పేర్కొంది.

English summary

కరోనా భారీ దెబ్బ: మరో రూ.1.67 లక్షల కోట్లు... మొత్తం రూ.4.21 లక్షల కోట్లకు ఎన్పీఏలు | Corporate debt to surge by Rs 1.67 trillion in FY22

As businesses struggle to resume operations after gradual relaxation of the nationwide lockdown, corporate debt is likely to increase, adding to the already stressed balance sheet.
Story first published: Tuesday, July 7, 2020, 8:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X