For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

80% పైగా తగ్గిన కార్లు, బైక్ సేల్స్: ఏప్రిల్ 'జీరో' కంటే కాస్త బెటర్

|

ఏప్రిల్ నెలలో జీరో సేల్స్ నమోదు చేసిన ఆటో కంపెనీలు మే నెలలో కాస్త కోలుకున్నాయి. అయినప్పటికీ వాహనాల సేల్స్ అంతకుముందుతో పోలిస్తే భారీగానే పడిపోయాయి. కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్‌లో వాహనాలు విక్రయించలేదు. మే నెలలో ఆంక్షల సడలింపుల నేపథ్యంలో కొంత మేరకు సేల్ అయ్యాయి. 2019 మే నెల కంటే వాహనాల సేల్స్ భారీగానే తగ్గాయి.

మాల్స్‌కు గుడ్‌బై: గళ్లీలోని కిరాణా దుకాణమే ముద్దు, ఆ బ్రాండ్స్‌నే కొంటాంమాల్స్‌కు గుడ్‌బై: గళ్లీలోని కిరాణా దుకాణమే ముద్దు, ఆ బ్రాండ్స్‌నే కొంటాం

88 శాతం పడిపోయిన మారుతీ సుజుకీ సేల్స్

88 శాతం పడిపోయిన మారుతీ సుజుకీ సేల్స్

కారు మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ దేశీయంగా 13,865 యూనిట్స్‌ను విక్రయించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే 88 శాతం తగ్గుదల నమోదయింది. మొత్తం వాహనాలు 2019 మే నెలలో 1,34,641 విక్రయిస్తే ఈ ఏడాది 86 శాతం తగ్గి, 18,539 యూనిట్లు విక్రయించింది. ఎగుమతులు 48.82 శాతం క్షీణించి 4,651 వాహనాలకు పరిమితమయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో క్రమంగా సేల్స్ పుంజుకుంటాయని భావిస్తున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది.

ఏ సంస్థ సేల్స్ ఎంత పడిపోయాయంటే

ఏ సంస్థ సేల్స్ ఎంత పడిపోయాయంటే

2019 మే నెలలో మారుతీ సుజుకీ సేల్స్ దేశీయంగా 1,21,018 యూనిట్లు సేల్ చేయగా, ఈసారి 88 శాతం పడిపోయి 13,865కు తగ్గింది.

హ్యుండాయ్ 2019 మే నెలలో 42,502 యూనిట్లు సేల్ చేయగా, ఈ మే నెలలో 84 శాతం తగ్గి 6,883కు పడిపోయింది.

మహింద్రా అండ్ మహీంద్రా గత ఏడాది మే నెలలో 20,608 యూనిట్లు సేల్ చేయగా, ఈసారి 81 శాతం తగ్గి 3,867 యూనిట్లకు పరిమితమైంది.

టయోటా సేల్స్ గత ఏడాది 12,138 విక్రయించగా ఈసారి 86 శాతం తగ్గి 1,639కు పడిపోయింది.

మొత్తంగా గత ఏడాది మే నెలలో ఈ కంపెనీలు 1,96,266 యూనిట్లు విక్రయించగా, ఈసారి 86 శాతం తగ్గి 26,254కు పరిమితమైంది.

టీవీఎస్ టూ వీలర్ సేల్స్

టీవీఎస్ టూ వీలర్ సేల్స్

టీవీఎస్ మోటార్స్ సేల్స్ మే నెలలో 58,906 టూ వీలర్-త్రీ వీలర్ వాహనాలు విక్రయించింది. ఇందులో 56,218 టూ వీలర్స్, 2,688 త్రీ వీలర్స్ ఉన్నాయి. హోసూర్, మైసూరు, నాలాగర్‌లోని ప్లాంట్లలో మే 6వ తేదీన ఆపరేషన్స్ ప్రారంభించింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటోంది.

అశోక్ లేలాండ్ సేల్స్..

అశోక్ లేలాండ్ సేల్స్..

- అశోక్ లేలాండ్ సేల్స్ 89 శాతం తగ్గాయి. 2019 మే నెలలో 13,172 యూనిట్లు సేల్ కాగా, ఈ మే నెలలో కేవలం 1,420 మాత్రమే విక్రయించింది.

- ఏడాది క్రితం 8,635 మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికిల్స్ విక్రయించగా ఇప్పుడు 98 సాతం తగ్గి 151కి పరిమితమైంది.

- గత ఏడాది మే నెలలో లైట్ కమర్షియల్ వెహికిల్స్ 12,778 వాహనాలు విక్రయించగా, ఈ సారి 90 శాతం పడిపోయి 1,277 యూనిట్లు విక్రయించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ 69 శాతం తగ్గుదల

రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ 69 శాతం తగ్గుదల

అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ మే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ 69 శాతం తగ్గాయి. 2019 మే నెలలో 62,371 యూనిట్లు విక్రయించగా, ఈ మేలో 19,113 విక్రయాలు జరిగాయి.

ఇందులో 350 సీసీ (లోపు) మోటార్ సైకిల్స్ ఏడాది క్రితం 55,833 సేల్ చేయగా, ఈసారి 17,543 విక్రయించింది.

350 సీసీ (పైన) మోటార్ సైకిల్స్ గత ఏడాది 6,538 విక్రయించగా ఈసారి 1,570 సేల్ చేసింది.

కంపెనీ ఎగుమతులు 68 శాతం తగ్గి 684కు పడిపోయాయి.

English summary

80% పైగా తగ్గిన కార్లు, బైక్ సేల్స్: ఏప్రిల్ 'జీరో' కంటే కాస్త బెటర్ | Corona crisis: Maruti to Toyota, auto sales collapse in May amid lockdown

After reporting near-zero sales in April, auto companies resumed despatches in May. But the volumes were disappointing with sales of passenger vehicles declining 86 per cent year-on-year for leading players.
Story first published: Tuesday, June 2, 2020, 8:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X