For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిజిటల్ కరెన్సీతో సవాళ్ళు ఇవే: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన సవాళ్ళు ఉన్నాయని చెప్పారు. త్వరలో సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ(CBDC)ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇందులోని కీలక సమస్యలను ఆర్బీఐ వివరించింది. సైబర్ భద్రత, డిజిటల్ మోసాలు సవాళ్లుగా నిలుస్తాయని శక్తికాంతదాస్ అన్నారు. వీటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో నకిలీ నేట్లపో ఎలాంటి ఆందోళన వ్యక్తమైందో, డిజిటల్ కరెన్సీ విషయంలోను అదే సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెప్పారు. పటిష్ట భద్రతా వ్యవస్థలతోనే దీనిని అరికట్టవలసిన అవసరం ఉందన్నారు.

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మాట్లాడుతూ రెండు రకాల సీబీడీసీలు ఉంటాయని, ఒకటి హోల్ సేల్ అయితే, మరొకటి రిటైల్ అన్నారు. హోల్ సేల్ పైన ఇప్పటికే చాలా వరకు వర్క్ ఔట్ పూర్తయిందని, రిటైల్‌ను క్లిష్టమైనదిగా అభివర్ణించారు. దీనిని తీసుకు రావడానికి మరింత సమయం పడుతుందని చెప్పారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో సీబీడీసీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

Concern is from the angle of cyber security: Shaktikanta Das on Digital Currency

ఆర్బీఐ సీబీడీసీ ప్రయోజనాలను కూడా లిస్ట్ చేసింది. క్యాష్ పైన తక్కువ ఆధారపడటం, కరెన్సీతో ట్రాన్సాక్షన్స్ తగ్గడం వల్ల అత్యధిక నోట్ల ప్రింటింగ్ తగ్గడం, బ్యాంకులకు సెటిల్మెంట్స్ రిస్క్ తగ్గడం వంటి అంశాలను లిస్ట్ చేసింది. ఆర్బీఐ డిజిటల్ ఫామ్ ద్వారా డిజిటల్ కరెన్సీని విడుదల చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ కరెన్సీ.

English summary

డిజిటల్ కరెన్సీతో సవాళ్ళు ఇవే: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ | Concern is from the angle of cyber security: Shaktikanta Das on Digital Currency

The RBI Governor Shaktikanta Das today highlighted cyber security and digital frauds as two major areas of concern in a central bank digital currency (CBDC) universe.
Story first published: Wednesday, December 8, 2021, 19:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X