For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాతో యుద్ధం మొదలైంది... మనం ఓడిపోతున్నాం: ఎక్కడో తెలుసా?

|

అవును. మీరు చదివింది నిజమే కానీ ఈ యుద్ధం రెండు దేశాల మధ్య ప్రత్యక్షంగా జరుగుతున్నది కాదు. పరోక్షంగా చైనా కంపెనీలు ఇండియా లో తమ దండయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. అవి ఎంటరైన ఏ సెగ్మెంట్ లోనూ ఇండియన్ కంపెనీలు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. పూర్తిగా పోటీ నుంచి తప్పుకోవటం లేదా నామ మాత్రంగా మిగిలిపోవటమో జరుగుతోంది. భారత్ కు ఎప్పుడూ పాకిస్తాన్ తో మాత్రమే ప్రమాదం పొంచి ఉందని, ఆ దేశంతో ఎప్పుడైనా యుద్ధం రావొచ్చని బోర్డర్ లో మన సైనికులు ఎల్లవేళలా కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తుంటారు.

కానీ చైనా కంపెనీల ప్రత్యక్ష పోరులో మాత్రం మనకు మనమే మన కోటలను వాటికి అప్పజెప్పుతున్నాం. స్మార్ట్ ఫోన్లతో మొదలుకొని సోషల్ మీడియా వరకు, మొబైల్ పేమెంట్ల తో ప్రారంభమై ఆటోమొబైల్ వరకు ఒక్కో రంగంలో మన కంపెనీల అస్త్రాలను చేధించుకుంటూ చైనా కంపెనీలు వాణిజ్య రణరంగంలో దూకుసుపోతున్నాయి. ఈ పరిణామం పరోక్షంగా భారత మార్కెట్ ను బంగారు పళ్లెంలో పెట్టి చైనాకు అందిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇండియా 71 ఏళ్ళ గణతంత్ర సర్వ సత్తాక, సార్వభౌమ ఉత్సవాలు (రిపబ్లిక్ డే) జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం మీకోసం.

ఈపీఎఫ్ తగ్గించనున్న ప్రభుత్వం... దీంతో మీ శాలరీ ఎంత పెరుగుతుందో తెలుసా?

4 ఫోన్లలో 3 చైనావే...

4 ఫోన్లలో 3 చైనావే...

భవిష్యత్లో యుద్ధాలు కేవలం ప్రత్యక్షంగా మాత్రమే జరగవు. ఎక్కువగా పరోక్ష యుద్ధాలే ఉంటాయి. ఒక వ్యక్తిని గాని, ఒక దేశాన్ని గాని 8 రకాలుగా ముట్టడి చేస్తే ఇక ఆ వ్యక్తి లేదా ఆ దేశం అంతమైనట్లే. ప్రస్తుతం ఇండియా కూడా ఇలాంటి ప్రమాదంలోకి జారుకుంటోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనా మనల్ని ఎంతలా ముట్టడి చేస్తోందో ఇండియా లో స్మార్ట్ ఫోన్ల సేల్స్ చెబుతున్నాయి.

భారత్ లో విక్రయమవుతున్న ప్రతి 4 స్మార్ట్ ఫోన్ల లో 3 ఫోన్లు చైనా కంపెనీలకు చెందినవే. చైనాకు చెందిన బీబీకే గ్రూప్ (ఒప్పో, వివో, వన్ ప్లస్, రియల్ మీ ఫోన్ల ఓనర్) ఇండియాలో 37% మార్కెట్ వాటా తో ముందు వరుసలో ఉండగా, మరో చైనీస్ దిగ్గజం షొమి (రెడ్ మీ, పోకో బ్రాండ్స్ ఓనర్) మరో 28% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. మొత్తంగా ఇండియన్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చైనా కంపెనీల వాటా 72% ఉంటుందని హాంగ్ కాంగ్ కు చెందిన కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా ఏజెన్సీ ఐ ఏ ఎన్ ఎస్ ఒక కథనంలో పేర్కొంది. మిగిలిన వాటా ఎలాగు సామ్ సాంగ్, ఆపిల్ కంపెనీల చేతిలో ఉంది. చైనీస్ కంపెనీల దెబ్బకు మన దేశీయ సంస్థలు మైక్రోమాక్స్, కార్బన్, లావా, సెల్కన్ వంటివి పూర్వ వైభవాన్ని కోల్పోయాయి. మళ్ళీ కోలుకుని మార్కెట్ వాటాను దక్కించుకోగలవని చెప్పటం కష్టమే.

మొబైల్ పేమెంట్స్ లో ....

మొబైల్ పేమెంట్స్ లో ....

స్మార్ట్ ఫోన్లు ఎలాగూ చైనా చేతికి వెళ్లి పోయాయి. ఇక మొబైల్ ఫోన్ల ఆధారంగా సాగే పేమెంట్ల లో కూడా వాటి ఆధిపత్యమే కొనసాగుతోంది. పేటీఎం ... ఈ పేరు ఇప్పుడు దేశంలో తెలియని వారు ఉండరు. అందరూ ఇది మన కంపెనీయే అనుకుంటారు. దీన్ని స్థాపించిన విజయ్ శేఖర్ శర్మ భారతీయుడే కానీ పేటీఎం మాత్రం చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ కంపెనీ అయిపోయింది. ఎందుకంటే పేటీఎం లో మెజారిటీ వాటాదారు అలీబాబా గ్రూప్. ఆన్లైన్ లో గ్రోసరీస్ విక్రయించే బిగ్ బాస్కెట్ లో కూడా పెద్ద ఎత్తున అలీబాబా పెట్టుబడి పెట్టింది. ఇలా సున్నితమైన స్మార్ట్ ఫోన్, మొబైల్ పేమెంట్స్, ఈ కామర్స్ రంగాల్లో చైనా మనకు తెలియకుండానే పాగా వేసింది.

టిక్ టాక్ జోరు...

టిక్ టాక్ జోరు...

ఒక రోజు అన్నం తినకపోయినా ఫరవాలేదు కానీ.... ఓ పూట టిక్ టాక్ లేకుంటే నడవదు. ఇదీ ఇప్పుడు మన ఇండియన్స్ పరిస్థితి. మరి మనం అంతలా అడిక్ట్ అయిన టిక్ టాక్ ఎవరిదో తెలుసా? అది కూడా చైనా కంపెనీయే. చైనా కంపెనీలు తయారు చేసే ప్రతి స్మార్ట్ ఫోన్ లోనూ ఆ దేశానికి చెందిన యూసి బ్రౌసర్ తప్పనిసరిగా ఉంటుంది. అంటే అది గూగుల్ క్రోమ్ లాంటిది అన్నమాట. త్వరలోనే ఇండియాలో 5 జి సేవలను టెస్ట్ చేయబోతున్నారు. ఆ టెక్నాలజీ అందించేది కూడా చైనా కంపెనీ ఐన హువవె కావటం గమనార్హం. స్మార్ట్ ఫోన్లు, మొబైల్ పేమెంట్స్, సోషల్ మీడియా (టిక్ టాక్), ఇంటర్నెట్ బ్రౌసర్ (యూ సి), ఈ కామర్స్ ఇలా అన్ని రంగాల్లో కలిపి సుమారు 100 కోట్ల భారతీయుల సమస్త సమాచారం (డేటా) చైనా కంపెనీలకు ... అంటే చైనా చేతికి చిక్కింది. ఏ దేశానికైనా ఇంతకంటే పెద్ద ఆయుధం (డేటా) ఏముంటుంది. ఇక అది మన తో కయ్యానికి దిగే దేశానికి చిక్కితే, యుద్ధంలో గెలవటం ఎవరకి సులువు మీరే ఆలోచించండి.

తాజాగా ఎలక్ట్రిక్ కార్లు...

తాజాగా ఎలక్ట్రిక్ కార్లు...

ఇన్ని రంగాల్లో పాగా వేసిన చైనా కంపెనీలు భారత మార్కెట్ డైనమిక్స్ బాగా అర్థం చేసుకున్నాయి. ఒక్కో రంగంలో క్రమంగా తమ సత్తాను చాటుతున్నాయి. ఇటీవలే ఇండియాలో ఎంటరైన ఎంజీ మోటార్స్ (ఎస్ ఏ ఐ సి కంపెనీ ) హెక్టర్ ఎస్ యూ వీ ని విడుదల చేసింది. ఇండియాలో ఆటోమొబైల్ రంగం మందగమనంలో ఉన్నా.. హెక్టర్ మాత్రం 6 నెలల్లోనే 20,000 బుకింగ్స్, 16,000 అమ్మకాలను సాధించింది. ఈ కంపెనీ కొత్తగా జెడ్ ఎస్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో పరిచయం చేసింది. రూ 20.88 లక్షల ధర కలిగిన ఈ కారుకు కూడా కేవలం 27 రోజుల్లోనే 2,800 బుకింగ్స్ వచ్చాయి. ఇక పోతే ఎలక్ట్రిక్ బ్యాటరీలు, ఛార్జింగ్ పాయింట్ల ను కూడా చైనా కంపెనీలే ఏర్పాటు చేయబోతున్నాయి. త్వరలో ఢిల్లీలో జరగబోయే ప్రతిష్టాత్మక ఆటో షో లో 20% స్పేస్ చైనా కంపెనీలే బుక్ చేసుకున్నాయంటే ... అవి ఇండియా మార్కెట్లో ఎంతలా పాతుకుపోవాలని టార్గెట్ పెట్టుకున్నాయో అర్థమవుతుంది.

English summary

Chinese decimation of Indian phonemakers is complete

The Great Wall has slowly but strategically spread its roots in the Indian IT/technology and allied sectors in India, and there is no stopping the dragon which has only grown fiercer — threatening industry after industry across the spectrum as India celebrates its 71th Republic Day.
Story first published: Tuesday, January 28, 2020, 7:44 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more