For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

59 యాప్స్ నిషేధంపై WTOకు వెళ్తే... ఈ కారణాలతో చైనా అడ్డంగా బుక్కైనట్లే!

|

చైనా హద్దులు దాటి ఉద్రిక్తతలు పెంచుతుండటంతో భారతప్రభుత్వం ఇటీవల డ్రాగన్ దేశానికి చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించింది. భద్రతాపరమైన చర్యలతో బ్యాన్ చేసి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇలా రద్దు చేయడంపై మొదట ఆందోళన వ్యక్తం చేసిన చైనా.. తాజాగా ఇలా చేయడం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. ఇది ద్వైపాక్షిక సహకారానికి మంచిది కాదని, భారత ప్రయోజనాలకు కూడా హాని అని పేర్కొంది. 59 యాప్స్ నిషేధం అంశంపై చైనా WTOను ప్రస్తావించినప్పటికీ అటువైపు చూడకపోవచ్చునని అంటున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి.

ఇది మంచి పద్ధతి కాదు, WTO రూల్స్‌కు విరుద్ధం: 59 యాప్స్ నిషేధంపై చైనా వార్నింగ్

యాప్స్ బ్యాన్ పైన చైనా ఏమంటోంది

యాప్స్ బ్యాన్ పైన చైనా ఏమంటోంది

చైనీస్ యాప్స్ పైన భారత్ నిర్ణయం సరికాదని, సరసమైన, పారదర్శక విధానాలకు విరుద్దంగా వెళ్తోందని, జాతీయ భద్రతా మినహాయింపులను దుర్వినియోగం చేస్తోందని, ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తోందని చైనీస్ ఎంబసీ అధికార ప్రతినిధి జియో రాంగ్ తన ప్రకటనలో తెలిపారు. WTOను 1995 జనవరి 1న స్థాపించినప్పటి నుండి ఇండియా సభ్య దేశంగా ఉంది. చైనా 2011లో చేరింది. వివిధ కారణాలతో చైనా WTOకు వెళ్లినా ఉపశమనం లభించే అవకాశాలు లేవని అంటున్నారు. భారత్ నిర్ణయాన్ని WTO సమర్థించడానికి మూడు ప్రధాన కారణాలు ఇక్కడ..

ద్వైపాక్షిక ఒప్పందం లేదు

ద్వైపాక్షిక ఒప్పందం లేదు

స్మార్ట్ ఫోన్ యాప్స్‌కు సంబంధించి రెండు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు లేవు. ఇరుదేశాల మధ్య సంతకాలు జరిగినందువల్ల చైనా కంపెనీల యాప్స్ ఇక్కడ ప్రారంభం కాలేదు. ఇండియా ఫ్రీ మార్కెట్ అయినందువల్ల ఆ సంస్థలు ఇక్కడ ప్రారంభించాయి. ఈ యాప్స్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ప్రచారం చేసుకున్నాయి. చైనా నుండి నిధుల వరద పారింది. కొన్నేళ్లలోనే భారత్‌లోకి చైనీస్ యాప్స్ చొచ్చుకు వెళ్లాయి. కానీ ఇరుదేశాల మధ్య ఎలాంటి అవగాహన ఒప్పందం లేకుండానే ఇదంతా జరిగింది. కాబట్టి ఏదో ఒప్పందం జరిగితే దానిని భారత్ ఉల్లంఘించింది అని చైనా WTOలో చెప్పడానికి అవకాశం లేదు.

WTO రూల్స్... అనుకూలం

WTO రూల్స్... అనుకూలం

భారత్ 59 యాప్స్‌ను నిషేధించడానికి భద్రతాపరమైన కారణాలు చూపించింది. దీనికి అమెరికా సహా ప్రపంచ దేశాల నుండి మద్దతు లభించింది. ఒక దేశం తమ సార్వభౌమత్వానికి మరియు జాతీయ భద్రతా ప్రయోజనాలకు ముప్పుగా భావిస్తే ఆ కంపెనీలు లేదా ఆ ఉత్పత్తులపై చర్యలు తీసుకునేందుకు నిబంధనలు అంగీకరిస్తాయి. ఈ యాప్స్‌పై నిషేధం విధించినప్పుడు భారత్ అదే చెప్పింది. అంటే ఇక్కడ నిబంధనలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి.

చైనాకే చిక్కులు

చైనాకే చిక్కులు

చైనా కనుక ఈ యాప్స్ గురించి డబ్ల్యుటీవోకు వెళ్తే డ్రాగన్ దేశానికే చిక్కులు వచ్చే అవకాశముంది. భద్రతాపరమైన కారణాలతో వాటిని భారత్ నిషేధించింది. ఇప్పుడు వాటికి అనుకూలంగా చైనా WTOకు వెళ్తే భారత్ ధీటుగా స్పందించవచ్చు. అన్యాయమైన, చట్టవిరుద్ధమైన వాణిజ్యానికి మద్దతిస్తే చైనాపై కౌంటర్ దాఖలు చేయవచ్చు. పైగా చైనా తమ ఉత్పత్తులను ఇతర దేశాల మీదుగా అంటే మూడో దేశం మీదుగా ఉత్పత్తులు మళ్లించింది. ఉదాహరణకు భారత్ ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న సింగపూర్, హాంగ్‌కాంగ్ దేశాల ద్వారా మళ్లించింది. ఇలా చేయడం వల్ల భారత పరిశ్రమల వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ఇది కూడా భారత్‌కు అనుకూలం.

చైనా మార్కెట్లోకి నిరోధం

చైనా మార్కెట్లోకి నిరోధం

అన్నింటి కంటే ముఖ్యంగా చైనా చాలాకాలంగా తమ మార్కెట్లోకి ఇతర దేశాలు ప్రవేశించకుండా నిరోధించింది. టెక్ దిగ్గజాలను, న్యూస్ వెబ్ సైట్లను కూడా నిరోధించింది. ప్రపంచ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ సహా వివిధ యాప్స్, ఉత్పత్తులు చైనాలో లేవు. వీటిని నిరోధించి.. వీటి నుండి కాపీ కొట్టి సొంతగా తయారు చేసుకుంది. ఇలా వివిధ కారణాలతో చైనానే అడ్డంగా బుక్కయింది. డబ్ల్యుటీవోకు వెళ్లినా చైనాకు అక్కడ ఊరట లభించదని, భారత్ వైపు అన్నీ అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం కూడా అన్నింటిని పరిశీలించి, పక్కా ప్లాన్‌తోనే ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

English summary

Chinese apps ban: Why China is unlikely to get relief at WTO?

China has questioned India's decision to ban Chinese apps threatening to take the matter to the World Trade Organisation (WTO). However, China is unlikely to get relief at WTO.
Company Search
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more