For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Richest country in the world: అమెరికాను వెనక్కి నెట్టిన చైనా

|

ప్రపంచంలో ధనిక దేశం ఏది అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది అమెరికా. గత కొంతకాలంగా డ్రాగన్ దేశం చైనా సంపద వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం ఏది అంటే అమెరికా పేరు వెనక్కి పడిపోయింది.. చైనా ముందుకు వచ్చింది! ఈ మేరకు ప్రముఖ కన్సల్టింగ్ ఫర్మ్ మెకెన్సీ అండ్ కంపెనీ తన తాజా రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపద కలిగిన దేశాల్లో చైనా ముందుకు వచ్చి, మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో చైనా సంపద మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది. ఈ కన్సల్టింగ్ సంస్థ ప్రపంచ ఆదాయంలో అరవై శాతానికి పైగా ప్రాతినిథ్యం వహిస్తున్న పది నేషనల్ బ్యాలెన్స్ షీట్స్‌ను తీసుకున్నది.

అమెరికా, చైనాలో వారి వద్దే ఎక్కువ సంపద

2000 సంవత్సరంలో 156 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ నికర సంపద 2020 నాటికి 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు అధ్యయనం తెలిపింది. ఈ పెరుగుదలలో చైనా వాటానే మూడింట ఒక వంతు ఉంది. చైనా నిర వ్యాల్యూ 2000లో 7 ట్రిలియన్ డాలర్లు కాగా, 2021నాటికి 120 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.

China surpasses US to become richest nation in World

ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలు అమెరికా, చైనా. ఈ రెండు దేశాల్లోను మూడింట రెండొంతుల సంపద కేవలం పది శాతం ధనికుల వద్దే ఉంది. అంతేకాదు, ఈ వాటా మరింత పెరుగుతోంది.
సంపన్న దేశాల కొలమానం కోసం ఫైనాన్షియల్ అసెట్స్ వంటి వాటిని పరిగణలోకి తీసుకోలేదు.

ప్రపంచ సంపదలో ఎక్కువగా రియల్ ఎస్టేట్‌కు సంబంధించినదిగా పేర్కొంది. ఆస్తి రేట్ల పెరుగుదల సరసమైన గృహాలను మరింత కష్టతరం చేస్తోందని, 2008లో అమెరికాలో వలె ఆర్థిక సంక్షోభం ముప్పును పెంచుతోందని నివేదిక పేర్కొంది. చైనా ఎవర్ గ్రాండ్ గ్రూప్ నేపథ్యంలో చైనా కూడా రుణ సమస్యలను ఎదుర్కోవచ్చునని పేర్కొంది.

English summary

Richest country in the world: అమెరికాను వెనక్కి నెట్టిన చైనా | China surpasses US to become richest nation in World

The study stated that net worth worldwide has risen to $514 trillion in 2020 from $156 trillion in 2000. A recent report by the research wing of the consulting firm McKinsey & Co. stated that China has topped the list of richest nations worldwide while global wealth has increased three times over the last two decades.
Story first published: Tuesday, November 16, 2021, 17:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X