For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం, జనవరి 31 వరకు గడువు పొడిగింపు

|

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను నేరాల కాంపౌండింగ్‌కు కల్పించిన ప్రత్యేక అవకాశాన్ని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (CBDT) ప్రకటించింది. ఇప్పటి వరకు డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్న గడువును జనవరి 31 వరకు పొడిగించింది.

ఆదాయపు పన్ను నేరాల సమ్మేళనం కోసం దరఖాస్తు చేసుకునేందుకు పన్ను చెల్లింపుదారులు సదుపాయాన్ని పొందేందుకు గడువు పొడిగించినట్లు CBDT ఉత్తర్వులు ఇచ్చింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సహా మిగిలిన క్షేత్ర నిర్మాణాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుంది.

మీకు ఈ స్కాలర్‌షిప్ గురించి తెలుసా? 2 రోజులో మిగిలి ఉంది?మీకు ఈ స్కాలర్‌షిప్ గురించి తెలుసా? 2 రోజులో మిగిలి ఉంది?

CBDT extends till Jan 31 deadline for compounding of IT offences

న్యాయబద్దమైన కేసుల్లో పన్ను చెల్లింపుదారుల ఇక్కట్లను తప్పించేందుకు ప్రాసిక్యూషన్ కేసుల పెండింగును తగ్గించేందుకు వన్ టైమ్ (One Time) అవకాశాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ నాటికి గడువు ఇచ్చింది. పన్ను నేరాలు లేదా ఎగవేతకు పాల్పడిన వారు ట్యాక్స్ బకాయిలు, సర్‌ఛార్జీలు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. తద్వారా వారిపై ప్రాసిక్యూషన్ దాఖలు చేయకపోవడాన్ని కాంపౌండింగ్‌గా చెబుతారు.

English summary

పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం, జనవరి 31 వరకు గడువు పొడిగింపు | CBDT extends till Jan 31 deadline for compounding of IT offences

The CBDT has extended till January 31 the last date for taxpayers to avail a "one-time" facility to apply for compounding of income tax offences, an order issued on Friday said. The earlier deadline was December 31, 2019.
Story first published: Sunday, January 5, 2020, 10:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X