Income tax E-Filing: ఈ ఫామ్ ఫైలింగ్ గడువు మరో నెల రోజులు పెంపు

కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా సీబీడీటీ 15సీఏ/15సీబీ ఫామ్స్ ఫైలింగ్ చేసే వారికి ఊరట ఇచ్చింది. ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లో మరింత సడలింపులు చేసింది. మ్యాన్యువల్ ఫైలింగ్ తేదీని పొడిగించింది. కొత్త పోర్టల్‌లో సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాబట్టి ఈ గడువును ఆగస్ట్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు సీబీడీటీ తెలిపింది.

పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఆగస్ట్ 15వ తేదీ వరకు అధీకృత డీలర్లకు ఫామ్ 15సీఏ/15సీబీని నేరుగా సమర్పించవచ్చునని తెలిపింది. ఐటీ చట్టం 1961 ప్రకారం ఫామ్ 15సీఏ/15సీబీని డిజిటల్ రూపంలో అందించాలి. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు 15సీబీ చార్డర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్‌తో పాటు 15సీఏని, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అవసరమైన చోట అప్ లోడ్ చేస్తారు. ఏదైనా విదేశీ చెల్లింపుల కోసం అధీకృత డీలర్‌కు కాపీని సమర్పించే ముందు దీనిని అప్ లోడ్ చేస్తారు.

 CBDT extends due date to file Form 15CA/15CB manually

పోర్టల్‌లో సమస్యల దృష్ట్యా పన్ను చెల్లింపుదారులు స్వయంగా అధీకృత డీలర్‌కు సమర్పించవచ్చు. ఈ గడువు ఇప్పటి వరకు జూలై 15 వరకు ఉండగా, దీనిని ఆగస్ట్ 15వ తేదీ వరకు పొడిగించింది. విదేశీ చెల్లింపుల ప్రయోజనం కోసం 2021 ఆగస్ట్ 15 వరకు ఇలాంటి ఫామ్స్‌ను అంగీకరించాలని సీబీడీటీ సూచించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+