For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.40 లక్షల టర్నోవర్ వరకు జీఎస్టీ మినహాయింపు, రియల్ ఎస్టేట్‌కు భారీ ఊతం

|

జీఎస్టీ అమలు తర్వాత ప్రజలు చెల్లించాల్సిన పన్ను రేట్లు తగ్గాయని, పన్నుల నిబంధనలను పాటించేవారి సంఖ్య పెరిగింది. అంతకుముందు వ్యాట్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్ వంటివి ఉండగా, అవన్నీ కలిపి ముప్పై ఒక శాతం వరకు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు వివిధ వస్తువులపై ప్రజల మీద భారం తగ్గింది. 2017 జూలై 1వ తేదీ అర్ధరాత్రి నుండి భారత పన్నుల వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు వచ్చింది. భారత్ ఒకే మార్కెట్‌గా ఆవిర్భవించింది.

 రిలయన్స్, అమెజాన్‌కు షాక్: టాటా 'సూపర్ యాప్', ఈ సేవలన్నీ అందుబాటులో.. రిలయన్స్, అమెజాన్‌కు షాక్: టాటా 'సూపర్ యాప్', ఈ సేవలన్నీ అందుబాటులో..

200 వస్తువులపై పన్ను తగ్గింపు, రియల్ రంగానికి ఊతం

200 వస్తువులపై పన్ను తగ్గింపు, రియల్ రంగానికి ఊతం

జీఎస్టీ ప్రారంభంలో 230 వరకు వస్తువులు 28 శాతం స్లాబ్‌లో ఉండగా, ఇప్పుడు కేవలం 29 వస్తువులు మాత్రమే ఉన్నాయి. అంటే 200 వస్తువులను తక్కువ స్లాబ్‌లోకి మార్చారు. గృహ నిర్మాణరంగంపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. అందుబాటు గృహాలకైతే జీఎస్టీ 1 శాతంగానే ఉంది. జీఎస్టీలో ఎలాంటి ప్రక్రియ అయినా పూర్తిస్థాయిలో ఆటోమేటిక్ విధానంలో చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 50 కోట్ల రిటర్న్స్ ఆన్ లైన్ ద్వారా దాఖలయ్యాయి. 141 కోట్ల ఈ-వే బిల్లులు తీసుకున్నారు.

రూ.40 లక్షల టర్నోవర్ వరకు జీఎస్టీ మినహాయింపు

రూ.40 లక్షల టర్నోవర్ వరకు జీఎస్టీ మినహాయింపు

రూ.40 లక్షల వరకు టర్నోవర్ కలిగిన వ్యాపారాలపై జీఎస్టీ మినహాయింపు ఉంది. తొలుత ఇది రూ.20 లక్షలుగా ఉండేది. ఇప్పుడు రెండింతలకు పెంచారు. అలాగే రూ.1.5 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన కంపెనీ కాంపోజిషన్ స్కీమ్ కింద కేవలం 1 శాతం పన్నును మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది.

స్థిరంగా పెరుగుతున్న రెవెన్యూ

స్థిరంగా పెరుగుతున్న రెవెన్యూ

2017 జూలై 1న మన దేశంలో బహుళ పన్నుల వ్యవస్థకు తెరపడింది! జీఎస్టీ సరళీకరిస్తుండటంతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2017-18 (జూలై-మార్చి) 9 నెలల కాలంలో సగటు రెవెన్యూ రూ.89,700 కోట్లు కాగా, 2018-19లో సగటున నెలకు ఆదాయం 10% పెరిగి రూ.97,100 కోట్లకు చేరుకుంది. 2019-20లో రూ.1 లక్ష కోట్లు దాటింది. రేటు తగ్గింపు, కొన్ని సడలింపులు ఇస్తున్నప్పటికీ జీఎస్టీ ఆదాయం స్థిరంగా పెరిగింది. అయితే గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా వల్ల జీఎస్టీ ఆదాయం తగ్గింది.

English summary

రూ.40 లక్షల టర్నోవర్ వరకు జీఎస్టీ మినహాయింపు, రియల్ ఎస్టేట్‌కు భారీ ఊతం | businesses with annual turnover of up to Rs 40 lakh are now GST exempt

Businesses with an annual turnover of up to Rs 40 lakh are GST exempt. Initially, this limit was Rs 20 lakh. Additionally, those with a turnover up to Rs 1.5 crore can opt for the Composition Scheme and pay only 1 per cent tax.
Story first published: Tuesday, August 25, 2020, 10:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X