For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక మీ ఇష్టం!: ఆదాయపు పన్ను శుభవార్తలో మెలిక.. కొత్త స్లాబ్స్‌లో 70 మినహాయింపులు కట్

|

న్యూఢిల్లీ: 2020-21 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను స్లాబుల్లో భారీ మార్పులు చేసింది. రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను, రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారికి 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల ఆదాయం ఉన్న వారికి 20 శాతం పన్ను, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం ఉన్న వారికి 25 శాతం పన్ను, రూ.15 లక్షల ఆదాయం ఉంటే 30 శాతం పన్ను వర్తిస్తుందని తెలిపింది.

budget 2020: వేతన భారీ జీవులకు ఊరట, కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్స్ ఇవేbudget 2020: వేతన భారీ జీవులకు ఊరట, కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్స్ ఇవే

స్లాబ్ రేటులో 80C మెలిక

స్లాబ్ రేటులో 80C మెలిక

కొత్త ఆదాయపు పన్ను విధానం ఐచ్ఛికం అని కూడా బడ్జెట్‌లో పేర్కొన్నారు. మినహాయింపులు పొందాలా లేక వద్దా అనేది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. దీంతో పాత విధానంతో పాటు కొత్త విధానం కూడా అమలులో ఉండనుంది. కొత్త ట్యాక్స్ విధానాన్ని ఎంచుకుంటే ఓ మెలిక ఉంది. కొత్త ట్యాక్స్ విధానం కావాలనుకుంటే 80C కింద వచ్చే మినహాయింపులు వర్తించవు.

70 మినహాయింపులు కట్

70 మినహాయింపులు కట్

ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం వంద కంటే ఎక్కువ తగ్గింపులు లేదా మినహాయింపులు ఇస్తోంది. కానీ కొత్త పన్ను విధానంలో దాదాపు 70 వరకు మినహాయింపులను కలిగి ఉండదు. రాబోయే సంవత్సరాల్లో ఇతర తగ్గింపులను కూడా హేతుబద్దీకరిస్తామని చెప్పారు.

మినహాయింపులు వదులుకోవడానికి సిద్ధమైతేనే..

మినహాయింపులు వదులుకోవడానికి సిద్ధమైతేనే..

కొత్త ఆదాయపు పన్ను రేట్లు ఐచ్ఛికం. ఎందుకంటే ఇందులో కొన్ని మినహాయింపులు, కొన్ని తగ్గింపులు వదులుకోవాల్సి వస్తుంది. మినహాయింపు ప్రయోజనాలు వదులుకునే వారికి ఈ పన్ను రేట్లు గణనీయంగా తగ్గుతాయని ఆర్థికమంత్రి తెలిపారు.

ఎప్పటి నుంచి.. ప్రభుత్వంపై రూ.40,000 కోట్ల భారం

ఎప్పటి నుంచి.. ప్రభుత్వంపై రూ.40,000 కోట్ల భారం

వచ్చే 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరం లేదా 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రేట్లు అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ సంస్కరణల వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.40,000 కోట్ల భారం పడనుంది.

కొత్త ట్యాక్స్ స్లాబ్ కానీ..

కొత్త ట్యాక్స్ స్లాబ్ కానీ..

పాత పన్ను విధానంలో కొత్త పన్ను విధానం ఆప్షన్ ఇచ్చినప్పటికీ కానీ మినహాయింపులు ఎక్కువగా తగ్గించడం గమనార్హం. కొత్త పన్ను విధానం ట్యాక్స్ రేటును తగ్గిస్తుంది. కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. అదే సమయంలో పన్ను మినహాయింపుల పరిధిని తగ్గిస్తుంది.

ఆదాయ కూర్పు, పెట్టుబడులపై ఆధారపడి ఎంచుకోవాలి

ఆదాయ కూర్పు, పెట్టుబడులపై ఆధారపడి ఎంచుకోవాలి

కొత్త పన్ను విధానమా.. పాత పన్ను విధానంలోకి వస్తారా.. ఏది మీకు ప్రయోజకరం అనిపిస్తే దానిని ఎంచుకునే వెసులుబాటు ఉంది. అంటే కొత్త పన్ను విధానం.. ఆదాయ కూర్పు, పెట్టుబడులపై ఆధారపడి ఎంచుకోవచ్చు. మీకు ఏ పన్ను ప్రయోజనకరంగా అనిపిస్తే దానిని ఎంచుకోవచ్చు.

బీమా పాలసీ కొంటే మినహాయింపు కోరుకుంటారు.. కన్ఫ్యూజన్

బీమా పాలసీ కొంటే మినహాయింపు కోరుకుంటారు.. కన్ఫ్యూజన్

ఉదాహరణకు దీర్ఘకాలిక జీవిత బీమా పాలసీని కొనుగోలు చేసిన వ్యక్తి ప్రీమియం చెల్లించి, దానిపై ఆదాయపు మినహాయింపు పన్ను పొందాలని భావిస్తారు. అందుకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. అలాగే, మీ ఇన్వెస్ట్‌మెంట్ ఆధారంగా ఇందులో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం... ఎవరికి ఉపశమనం కలిగిస్తుందనే అంశం అనిశ్చితితో కూడుకున్నది. ఈ ప్రతిపాదనలు పార్లమెంటు ఆమోదించిన అనంతరం 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.

కొత్త స్లాబ్స్ రేట్ల ప్రకారం...

కొత్త స్లాబ్స్ రేట్ల ప్రకారం...

- రూ.5 లక్షల వరకు - No tax

- రూ.5-7.5 లక్షలు - 10%

- రూ.7.5-10 లక్షలు - 15%

- రూ.10-12.5 లక్షలు - 20%

- రూ.12.5-15 లక్షలు- 25%

- రూ.15 లక్షలు - 30%

పాత ట్యాక్స్ స్లాబ్ రేటు

పాత ట్యాక్స్ స్లాబ్ రేటు

- ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయం ఉంటే పన్ను మినహాయింపు ఉంది.

- రూ.2,50,001 నుండి రూ. 5,00,000 - 5% (Total income minus Rs 2.5 lakh) + 4 శాతం సెస్.

- రూ.5,00,001 నుండి రూ.10,00,000 - 12,500 + 20% (Total income minus Rs 5 lakh) + 4% సెస్.

- రూ. 10,00,001 నుండి అంతకు మించి - 1,12,500 + 30% (Total income minus Rs 10,00,000) + 4% cess

కోల్పోయే మినహాయింపుల్లో కొన్ని..

కోల్పోయే మినహాయింపుల్లో కొన్ని..

కొత్త ట్యాక్స్ స్లాబ్ ఎంచుకుంటే పలు మినహాయింపులు కోల్పోతారు. అందులో..

- వేతనాలు పొందుతున్న ఉద్యోగస్తులకు నాలుగేళ్లలో రెండుసార్లు వచ్చే లీవ్ ట్రావెల్ అలవెన్స్ మినహాయింపు కోల్పోతారు.

- శాలరైడ్‌కు జీతంతో హౌజ్ రెంటల్ అలవెన్స్ (HRA) ఉంటుంది. దీనికి మినహాయింపు కొంత పరిమితి వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.

- ట్యాక్స్ పేయర్స్‌కు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలు కోల్పోయే ఛాన్స్

- సెక్షన్ 16 ప్రకారం ఎంటర్‌టెయిన్‌మెంట్ అలవెన్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్షన్స్‌లో కోత.

- హౌజింగ్ లోన్‌ తీసుకున్న వారు దానిపై వడ్డీ కడుతున్నట్లు ఇప్పటి వరకు ట్యాక్స్ మినహాయింపులో చూపేవారు. కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే ఈ ఆప్షన్ కోల్పోతారు.

- ఫ్యామిలీ పెన్షన్‌లో భాగంగా రూ.15000 డిడక్ట్ అయ్యేది. ఇప్పుడు కొత్త ట్యాక్స్ విధానంలో ఇది ఉండదు.

- సెక్షన్ 80(సీ) కింద పన్ను మినహాయింపు వచ్చే ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసీ ప్రీమియం, పిల్లల ట్యూషన్ ఫీజు, ఇతర పెట్టుబడులు అంటే ఎన్‌పీఎస్, పీపీఎఫ్‌లాంటివి కొత్త విధానంలో ఉండవు.

- సెక్షన్ 80E కింద విద్యా రుణంపై చెల్లించే వడ్డీ పన్ను మినహాయింపు ఉండదు.

- సెక్షన్లు 80DD, 80DDB కింద ట్యాక్స్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోలేరు.

- సెక్షన్ 80G కింద లభించే స్వచ్చంధ సంస్థలకు విరాళాలపై పన్ను మినహాయింపు అందుబాటులో ఉండదు.

- చాప్టర్ VIA కింద వచ్చే అన్ని డిడక్షన్స్‌ను క్లెయిమ్ చేసుకోలేరు. ఉదాహరణకు... 80C, 80CCC, 80CCD, 80D, 80DD, 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GGA, 80GGC, 80IA, 80-IAB, 80-IAC, 80-IB, 80-IBA తదితర సెక్షన్లు.

English summary

ఇక మీ ఇష్టం!: ఆదాయపు పన్ను శుభవార్తలో మెలిక.. కొత్త స్లాబ్స్‌లో 70 మినహాయింపులు కట్ | Budget gives option of lower income tax rates, new tax slabs minus 70 exemptions

Budget 2020 has proposed a new tax regime slashing income tax rates and rejigging income tax slabs to reduce total tax payable by individuals.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X