For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ, LIC ఐపీవో

|

న్యూఢిల్లీ: పలు సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఎయిరిండియా, బీపీసీఎల్, ఎస్సీఐ, సీసీఐ, హెచ్‌పీసీఎల్, ఐడీబీఐ, బీఈఎంఎల్ సంస్థల ప్రయివేటీకరణపై ప్రకటన చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఏడాదిలో ఎల్ఐసీ ఐపీవోను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మూలధన సహాయం కింద ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. బీమా రంగంలో 75 శాతం వరకు FDIలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ జనాభా లెక్కింపు కోసం రూ.3.726 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.

 Budget 2021: Divestment target for FY22 at Rs 1.75 lakh crore

పన్ను చెల్లింపు ప్రక్రియ సరళీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెన్షన్ పైన ఆదారపడే సీనియర్ సిటిజన్లకు రిటర్న్ ఫైలింగ్ నుండి మినహాయిస్తున్నట్లు తెలిపారు.

English summary

రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ, LIC ఐపీవో | Budget 2021: Divestment target for FY22 at Rs 1.75 lakh crore

In FY21, the government had budgeted to raise Rs 2.1 lakh crore through divestments but fell short. Some of the big ticket divestments planned last year, like the stake sale in LIC, may conclude this year.
Story first published: Monday, February 1, 2021, 12:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X