For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BMWలో 6,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ ఒప్పందం, యువతకు జాబ్ గ్యారెంటీతో...

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఉద్యోగాల్లో కోత లేదా శాలరీ కోతలు చేపట్టాయి. వేతన పెంపు, కొత్త ఉద్యోగులను తీసుకోవడం అతి కొన్ని సంస్థల్లో తప్ప ఎక్కువ సంస్థలు ఆర్థికంగా చితికిపోయాయి. దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగాల కోత, శాలరీ కోతలు చేపట్టాయి. ప్రముఖ ఆటోమేకర్ బీఎండబ్ల్యు 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.

రూ.300 కోట్ల నుండి రూ.7,000 కోట్లు టార్గెట్.. ఈ స్టార్టప్‌లో ఏకంగా 5,000 కొత్త ఉద్యోగాలురూ.300 కోట్ల నుండి రూ.7,000 కోట్లు టార్గెట్.. ఈ స్టార్టప్‌లో ఏకంగా 5,000 కొత్త ఉద్యోగాలు

కరోనా.. ముందస్తు ఉద్యోగ విరమణ ఒప్పందం

కరోనా.. ముందస్తు ఉద్యోగ విరమణ ఒప్పందం

ఈ జపాన్ దిగ్గజ బీఎండబ్ల్యు ముందస్తు పదవీ విరమణపై ఈ ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వార్షిక టర్నోవర్‌తో పాటు కరోనా కారణంగా సేల్స్ భారీగా పడిపోయాయి. మందగమనం, మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఈ సంస్థ ముందస్తు పదవి విరమణపై ఇప్పటికే ఉద్యోగులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వెల్లడించింది.

యువతకు జాబ్ గ్యారెంటీతో..

యువతకు జాబ్ గ్యారెంటీతో..

బీఎండబ్ల్యు హెడ్ ఆఫీస్ జపాన్‌లోని మ్యూనిచ్‌లో ఉంది. ఇది X5 SUV, 3 సిరీస్ సెడాన్ వంటి అత్యాధునిక కార్లను తయారు చేస్తుంది. ముందస్తు ఉద్యోగ విరమణకు ఉద్యోగ ప్రతినిధులు అంగీకరించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా దాదాపు రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నవారిపై దృష్టి సారించింది. ఇక, యువతకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం అందిస్తుంది. ఉన్నత విద్య అనంతరం జాబ్ గ్యారెంటీ కూడా ఉంటుంది.

5 శాతం ఉద్యోగుల తొలగింత

5 శాతం ఉద్యోగుల తొలగింత

ప్రపంచంలో బీఎండబ్ల్యు ఉద్యోగులు 1,26,000 మంది ఉన్నారు. 6,000 మంది ఉద్యోగుల తొలగింత అంటే 5 శాతం కంటే తక్కువ అని వెల్లడించింది. వైరస్ కారణంగా ఆర్థిక నష్టాలతో పాటు యూరోప్ ప్రాంతంలో కొత్త కార్లకు డిమాండ్ మందగించినట్లు తెలిపింది. కరోనా సహా వివిధ కారణాలతో గత మే నెలలో సేల్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి. యూరోపియన్ యూనియన్‌లో సేల్స్ 52 శాతం పడిపోయాయి. ఏప్రిల్ నెలలో అయితే ఏకంగా 78.3 శాతం క్షీణించాయి.

ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు

ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు

కరోనా నేపథ్యంలో 1,26,000 ఉద్యోగుల్లో 30,000 మంది ఉద్యోగులను గంటల చొప్పున ఉపయోగించుకుంది బీఎండబ్ల్యు. ఉద్యోగులకు జర్మనీ ప్రభుత్వం వేతనంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. కాగా, బీఎండబ్ల్యు తొలగించే ఉద్యోగాలు అన్నీ కూడా దాదాపు జర్మనీలోనే ఉంటాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెండ్‌గా విక్రమ్ పవా నియమితులయ్యారు. బీఎండబ్ల్యు గ్రూప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన ఆగస్ట్ 1వ తేదీ నుండి ఆయన అధనంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

English summary

BMWలో 6,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ ఒప్పందం, యువతకు జాబ్ గ్యారెంటీతో... | BMW to drop 6,000 jobs through turnover, early retirement

Automaker BMW says it will drop 6,000 jobs through early retirements and turnover, as the auto industry adjusts to a sharp drop in demand due to the coronavirus outbreak.
Story first published: Sunday, June 21, 2020, 17:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X