For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

41,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్, ఇతర క్రిప్టోలు కూడా అదుర్స్

|

ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ తిరిగి పుంజుకున్నది. సోమవారం 38,547 డాలర్ల వద్ద ఐదు వారాల కనిష్టానికి పడిపోయిన ఈ దిగ్గజ క్రిప్టో 41వేల డాలర్ల పైకి చేరుకుంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం కూడా 3100 డాలర్లను క్రాస్ చేసింది. మోనెరో వంటి ఒకటి రెండు చిన్న క్రిప్టోలు మినహా అన్నీ మంచి లాభాల్లో ఉన్నాయి.

బిట్ కాయిన్ గత 24 గంటల్లో 5.57 శాతం లాభపడి ఈ వార్త రాసే సమయానికి 41,560 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల కనిష్టం 39,074 డాలర్లు, 24 గంటల గరిష్టం 41,690 డాలర్లు. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ గత ఇరవై నాలుగు గంటల్లో 790.29 బిలియన్ డాలర్లు పెరిగింది. 52 వారాల గరిష్టం 28,825.76 డాలర్లు కాగా, ఆల్ టైమ్ గరిష్టం 68,990.90 డాలర్లు. 52 వారాల గరిష్టం కూడా ఇదే.

 Bitcoin price rises above $41,000, other cryptocurrencies gain

ఇతర క్రిప్టోల విషయానికి వస్తే బిట్ కాయిన్ 5.52 శాతం ఎగిసి 41,556 డాలర్లు, ఎథేరియం 6.30 శాతం లాభపడి 3112 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 3.84 శాతం లాభపడి 0.775629 డాలర్లు, టెర్రా 11.61 శాతం లాభపడి 93.51 డాలర్లు, సోలానా 7.98 శాతం ఎగిసి 106.50 డాలర్లు, అవాలాంచె 6.98 శాతం ఎగిసి 79.85 డాలర్లు, కార్డానో 4.67 శాతం ఎగిసి 0.948076 డాలర్లు, పోల్కాడాట్ 6.05 శాతం ఎగిసి 18.69 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్ 3.54 శాతం ఎగిసి 0.141690 డాలర్లు, షిబా ఇను 3.48 శాతం లాభపడి 0.000025 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

41,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్, ఇతర క్రిప్టోలు కూడా అదుర్స్ | Bitcoin price rises above $41,000, other cryptocurrencies gain

Bitcoin price was up by 5.54 per cent at $41,556. Ethereum price was up by 6.28 per cent at $3,112.
Story first published: Tuesday, April 19, 2022, 20:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X