పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా-చైనా మధ్య ట్రేడ్ ఇష్యూ కారణంగా అంతకుముందు బంగారం వంటి అతివిలువైన లోహాల ధరలు, క్రూడాయిల్ ధరలు అంతకంతకు పెరిగాయి. ఇప్పుడు ఈ అంశాలు కొలిక్కి వస్తుండటంతో ఆయిల్, బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఇందుకే ధరలు తగ్గుతున్నాయి...
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు డాలరు మారకంతో రూపాయి బలపడుతోంది. దీంతో దేశీయంగా కూడా ఇంధన ధరలు వరుసగా తగ్గుతున్నాయి. వరుసగా ఆదివారం నాలుగో రోజు, సోమవారం ఐదో రోజు తగ్గాయి.

సోమవారం నాటి పెట్రోల్ ధరలు
సోమవారం లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.74.98, బెంగళూరులో రూ.77.49, ముంబైలో రూ.80.58, చెన్నైలో రూ.77.89, హైదరాబాదులో రూ.79.73, గురుగ్రామ్‌లో రూ.74.43గా ఉంది.

సోమవారం నాటి డీజిల్ ధరలు
సోమవారం లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.68.26, బెంగళూరులో రూ.70.53, ముంబైలో రూ.71.57, చెన్నైలో రూ.72.13, హైదరాబాదులో రూ.74.43, గురుగ్రామ్‌లో రూ.67.20 గా ఉంది. ఇక, ముందురోజు.. ఆదివారం లీటర్ పెట్రోల్ ధర 17 పైసల నుంచి 19 పైసల వరకు తగ్గింది. డీజిల్ 16 నుంచి 18 పైసలు తగ్గింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.09, ముంబైలో రూ.80.68, కోల్‌కతాలో రూ.77.68, చెన్నైలో రూ.78.01, హైదరాబాద్‌లో రూ.79.85గా ఉంది. డీజిల్ ధర లీటర్ ఢిల్లీలో రూ.68.45, ముంబైలో రూ.71.77, కోల్‌కతాలో రూ.70.81, చెన్నైలో రూ.72.33, హైదరాబాద్‌లో రూ.74.63గా ఉంది.

10 రోజుల్లో ఎంత తగ్గిందంటే?
గత పది రోజుల్లో పెట్రోల్ ధర 98 పైసలు, డీజిల్ ధర రూ.1.85 తగ్గింది. అమెరికా - ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు అమెరికా - చైనా మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో ధరలు తగ్గుతున్నాయి.

ఈ వారమూ తగ్గొచ్చు..
ముడి చమురు ధరలు ఈ వారం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు కనిపించడం లేదు. దీంతో పెరిగే అవకాశాలు లేవని అంటున్నారు. సహజవాయువు ఫిబ్రవరి కాంట్రాక్టు రూ.153 ఎగువన ట్రేడ్ కాకుంటే రూ.134 వరకు పడిపోయే అవకాశముంది. ముడి పామోలిన్ నూనే జనవరి కాంట్రాక్ట్ దిగుమతి సుంకం అంశం భారత్, పంట దిగుబడిపై మలేషియా ప్రభుత్వాలు చేసే ప్రకటనలపై ఆధారపడి ఉంటుంది.
More From GoodReturns

పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications