For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికాకు కోవాగ్జిన్ టీకా: ఆక్యుజెన్ సంస్థతో ఒప్పందం, లాభాల్లో 55 శాతం వాటా

|

న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఇప్పటికే మన దేశంలో ఉత్పత్తైన కరోనా వ్యాక్సిన్లు పొరుగు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్రికా దేశాలకు కూడా మన కరోనా వ్యాక్సిన్ చేరుకుంది. తాజాగా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా అమెరికా మార్కెట్లోకి కూడా ప్రవేశించనుంది. ఇందుకోసం అమెరికా 'నాస్‌డాక్'లో నమోదైన ఆక్యుజెన్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్.

అమెరికాలో కోవాగ్జిన్ విక్రయించనున్న ఆక్యుజెన్

అమెరికాలో కోవాగ్జిన్ విక్రయించనున్న ఆక్యుజెన్

ఆక్యుజెన్‌తో కలిసి ముందుకు సాగనున్నట్లు ఇప్పటికే ప్రకటించినప్పటికీ.. తాజాగా కమర్షియలైజేషన్ డీల్‌ను కుదుర్చుకున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఆక్యుజెన్ సంస్థ అమెరికాలో కోవాగ్జిన్ టీకాపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడమే కాకుండా, అవసరమైన అనుమతులు తీసుకుని విక్రయాలు కూడా చేపడుతుంది.

భారత్ బయోటెక్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ..

భారత్ బయోటెక్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ..

తొలిదశలో కోవాగ్జిన్ టీకా డోసులను భారత్ బయోటెక్ సరఫరా చేస్తుంది. ఆ తర్వాత టీకాను అమెరికాలో తయారు చేయడానికి వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆక్యుజెన్‌కు బదిలీ చేస్తుంది. కోవాగ్జిన్ టీకాపై క్లినికల్ ట్రయల్న్ నిర్వహణ, తయారీ అనుమతుల కోసం ఆక్యుజెన్ శాస్త్రవేత్తల బృందం ఇప్పటికే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్-ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) , బయోమెడికల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీలతో సంప్రదింపులు జరిపింది.

కోవాగ్జిన్ విక్రయాల లాభాల్లో 55 శాతం వాటా

కోవాగ్జిన్ విక్రయాల లాభాల్లో 55 శాతం వాటా

కాగా, అమెరికాలో నిర్వహిస్తున్న టీకాల పంపిణీ కార్యక్రమానికి కోవాగ్జిన్ సరఫరా చేయాలనే ఆలోచన కూడా ఆక్యుజెన్‌కు ఉందని సంస్థ తెలిపింది. దీనికి అనుగుణంగానే పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయడానికి అక్కడి కాంట్రాక్ట్ తయారీ కంపెనీలతో ఆక్యుజెన్ సంస్థ సంప్రదింపులు చేపట్టింది. కాగా, ఈ ఒప్పందం ద్వారా అమెరికాలో కోవాగ్జిన్ విక్రయాలపై వచ్చిన లాభాల్లో 45 శాతం వాటా ఆక్యుజెన్‌కు, మిగిలిన మొత్తం లాభాలు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్‌కే కావడం గమనార్హం.

మనదేశంలో కోవాగ్జిన్ వినియోగం

మనదేశంలో కోవాగ్జిన్ వినియోగం

మనదేశంలో సీరమ్-ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్త అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ తోపాటు కోవాగ్జిన్ కూడా అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోని ఆరోగ్య సిబ్బందికి కోవిసీల్డ్, కోవాగ్జిన్ టీకాలను తొలి దశలో ఇచ్చారు. ఇప్పుడు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఈ టీకాలను పంపిణీ చేస్తున్నారు. కాగా, కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికాలోని పలు దేశాలకు సరఫరా చేస్తున్నారు.

English summary

అమెరికాకు కోవాగ్జిన్ టీకా: ఆక్యుజెన్ సంస్థతో ఒప్పందం, లాభాల్లో 55 శాతం వాటా | Bharat Biotech inks pact with Ocugen for development, sale of Covaxin in US

Bharat Biotech inks pact with Ocugen for development, sale of Covaxin in US.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X