For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగళూరు సార్.. బెంగళూరు అంతే: ఐటీ పెట్టుబడుల్లో టాప్.. రెండో స్థానంలో లండన్

|

బెంగళూరు: దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరు నగరం మరో కొత్త రికార్డు సృష్టించింది. 10 మిలియన్ జనాభా ఉన్న బెంగళూరు నగరం ఐటీ రంగంలో అత్యంత వేగవంతంగా పెరుగుతున్న నగరంగా రికార్డుకెక్కింది. రెండో స్థానంలో లండన్ నగరం నిలిచింది. 2016 నుంచి తీసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఐటీ రంగంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో మూడో స్థానంలో మ్యూనిక్, ఆ తర్వాత బెర్లిన్, మరియు పారిస్ నగరాలు నిలిచాయి. ఇదిలా ఉంటే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం ఐటీ రంగంలో ఆరో స్థానంలో నిలిచింది. డీల్‌రూమ్.కో అనే సంస్థ లండన్ & పార్ట్‌నర్స్‌ పర్యవేక్షణలో ఐటీ రంగంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరాల సమాచారంను సేకరించి విశ్లేషించి రిపోర్టును తయారు చేసి విడుదల చేసింది.

 టాప్ ప్లేస్‌లో బెంగళూరు

టాప్ ప్లేస్‌లో బెంగళూరు

కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో ఐటీ రంగ సంబంధిత పెట్టుబడులు ఒకేసారి 5 రెట్లు ఎక్కువగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 2016లో పెట్టుబడులు 1.3 బిలియన్ డాలర్లు ఉండగా 2020 నాటికి 7.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఐటీ పెట్టుబడులు 1.7 రెట్లు పెరిగాయి. 2016లో 0.7 బిలియన్ డాలర్లు పెట్టుబడులు ముంబైకి రాగా... 2020 నాటికి 1.2 బిలియన్ డాలర్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయి. ఇదిలా ఉంటే లండన్ నగరంలో మాత్రం 2016తో పోలిస్తే ఐటీ రంగంలో ఇన్వెస్ట్‌మెంట్స్ మూడు రెట్లు పెరిగాయి.

 రెండో స్థానంలో లండన్

రెండో స్థానంలో లండన్

లండన్‌ నగరంలో 2016లో 3.5 బిలియన్ డాలర్లు మేరా ఇన్వెస్ట్‌మెంట్స్ రాగా 2020 నాటికి 10.5 బిలియన్ డాలర్లకు పెట్టుబడులు పెరిగాయి. దీంతో లండన్ రెండో స్థానంలో నిలిచింది. భారత్‌లో ఉన్న పలు నగరాలతో లండన్ నగరం వాణిజ్య పరమైన సంబంధాలు కలిగి ఉందని చెప్పారు భారత్‌లోని లండన్ & పార్ట్‌నర్స్ చీఫ్ రిప్రజెంటేటివ్ హేమిన్ భరూచా. ఈ రోజు వచ్చిన నివేదికతో భవిష్యత్తులో ఈ భారత్-యూకేల మధ్య సాంకేతికపరమైన ఒప్పందాలు మరింత జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కష్టసమయంలో కూడా లండన్ మరియు భారత దేశాలు ఐటీ రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించాయని చెప్పారు. ముఖ్యంగా ఆర్థిక రంగం, విద్యారంగంలో గణనీయమైన పెరుగుదల నమోదైందని చెప్పారు.

 బెంగళూరు నగరం మరో ఘనత

బెంగళూరు నగరం మరో ఘనత

ఇదిలా ఉంటే ఐటీ రంగంలోనే కాకుండా మరో రంగంలో కూడా బెంగళూరు నగరం ప్రపంచంలో ఆరోస్థానంలో నిలిచింది. వరల్డ్ టెక్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో బెంగళూరు ఆరవ స్థానంలో నిలిచింది. ఈ రంగంలో అగ్రస్థానంలో బీజింగ్ మరియు శాన్‌ఫ్రాన్సిస్కోలు ఉండగా... న్యూయార్క్, షాంఘై, లండన్ నగరాలు టాప్‌ ఫైవ్‌లో ఉన్నాయి. ఈ కోవలో ముంబై నగరం 21వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత బోస్టన్, సింగపూర్ నగరాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో దాదాపు 1252 కంపెనీలు ఒక్క లండన్ నగరంలోనే ఉన్నట్లు రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

English summary

బెంగళూరు సార్.. బెంగళూరు అంతే: ఐటీ పెట్టుబడుల్లో టాప్.. రెండో స్థానంలో లండన్ | Bengaluru city tops the list in IT investments pushing London to second place

Bengaluru, India’s IT capital with a population of about 10 million, has emerged as the fastest-growing mature technology ecosystem in the world since 2016, followed by the European cities of London, Munich, Berlin and Paris.
Story first published: Saturday, January 16, 2021, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X