For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన మహీంద్రా సేల్స్, ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం జంప్

|

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్(FES) సేల్స్ భారీగా పెరిగాయి. దసరా, దీపావళి పండుగ సీజన్ కావడంతో ఆటో సేల్స్ పెరిగాయి. గత కొద్ది నెలలుగా కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో సేల్స్ పడిపోయాయి. అయితే అన్-లాక్ తర్వాత అక్టోబర్ నెలలో పండుగ సీజన్ రావడంతో కొనుగోళ్లు ఎగిశాయి. దసరాకు తోడు కరోనా కారణంగా వ్యక్తిగత లేదా కుటుంబ ప్రయాణానికి మొగ్గు చూపేవారు పెరుగుతున్నారు. మరోవైపు, ఈసారి వ్యవసాయం కూడా బాగుంది. దీంతో వ్యవసాయ రంగ వాహనాల సేల్స్ కూడా పెరిగాయి.

పండుగ జోష్: మారుతీ సహా వాహనాల సేల్స్ భారీగా జంప్, ఆటోకు 'డబుల్' బొనాంజాపండుగ జోష్: మారుతీ సహా వాహనాల సేల్స్ భారీగా జంప్, ఆటోకు 'డబుల్' బొనాంజా

మహీంద్రా డల్.. ట్రాక్టర్లు మాత్రం హిట్

మహీంద్రా డల్.. ట్రాక్టర్లు మాత్రం హిట్

మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ మాత్రం 14.5 శాతం క్షీణించాయి. డొమెస్టిక్ పాసింజర్ వెహికిల్ సేల్స్ గత ఏడాది కంటే 1 శాతం పెరిగాయి. యుటిలిటీ వెహికిల్ సేల్స్ 3 శాతం పెరిగి 18,317 యూనిట్లుగా ఉన్నాయి. కారు, ఎస్‌యూవీ సేల్స్ మాత్రం క్షీణించాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ 23.5 శాతం క్షీణించి 23,716 యూనిట్లకు, ఎగుమతులు 25 శాతం పడిపోయి 2,021 యూనిట్లకు తగ్గాయి.

మహీంద్రా వ్యవసాయ వాహనాల్లో 2 శాతం పెరిగి 46,558 యూనిట్లుగా ఉన్నాయి. డొమెస్టిక్ సేల్స్ 2 శాతం పెరి 45,588 యూనిట్లు కాగా, ఎగుమతులు 23 శాతం పెరిగి 970 యూనిట్లుగా ఉన్నాయి.

ట్రాక్టర్ సేల్స్ అదే ఒరవడి

ట్రాక్టర్ సేల్స్ అదే ఒరవడి

తాము అపూర్వమైన రిటైల్ డిమాండ్ చూస్తూనే ఉన్నామని, అధిక ఖరీఫ్ ఉత్పత్తి, మార్కెట్ నుండి మంచి నగదు ప్రవాహం వంటి కారణాలు డిమాండ్ పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. దసరా, దీపావళి పర్వదినాలు, ఖరీఫ్ పట కోత, రాబోయే రబీ విత్తనాల సీజన్ కోసం యాంత్రీకరణ అవసరాలు పరిశ్రమకు ఎంతో ఉపయోగపడతాయని మహీంద్రా ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా అన్నారు. తద్వారా ఈ నెలలోను ట్రాక్టర్ సేల్స్ ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు.

ఎస్కార్ట్ ట్రాక్టర్ సేల్స్ జంప్

ఎస్కార్ట్ ట్రాక్టర్ సేల్స్ జంప్

ఎస్కార్ట్ ట్రాక్టర్ సేల్స్ 2.3 శాతం పెరిగి 13,664 యూనిట్లు నమోదయ్యాయి. ఓ అక్టోబర్ నెలలో రికార్డ్ సేల్స్ ఈసారి నమోదయినట్లు తెలిపింది. పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నప్పటికీ డిమాండ్ సరఫరాను మించిందని కంపెనీ తెలిపింది. డిమాండ్ మరికొంతకాలం ఇలాగే కొనసాగుతుందని చెబుతున్నారు. అధిక పంట ఉత్పత్తి, మంచి పంట ధర, తగినంత నీటి లభ్యత, సులభమైన ఫైనాన్సింగ్ కారణంగా డిమాండ్ పెరిగినట్లు చెప్పారు. డొమెస్టిక్ సేల్స్ 1.1 శాతం పెరిగి 13,180 యూనిట్లుగా, ఎగుమతులు 51.7 శాతం పెరిగి 484 యూనిట్లుగా ఉన్నాయి.

English summary

తగ్గిన మహీంద్రా సేల్స్, ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం జంప్ | AutoOctober 2020: Mahindra's Farm Equipment Sector Sells 45,588 Units

Mahindra & Mahindra Ltd.'s Farm Equipment Sector (FES), a part of the USD 19.4 billion Mahindra Group, today announced its tractor sales numbers for October 2020. The company consolidated its leadership of the top two positions in the domestic tractor market between its Mahindra & Swaraj brands.
Story first published: Monday, November 2, 2020, 8:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X