For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: అదరగొట్టిన మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, ఎస్కార్ట్ ట్రాక్టర్ సేల్స్

|

ఆటో రంగానికి గుడ్‌న్యూస్! సెప్టెంబర్ 2020లో ఆటో సేల్స్ పుంజుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత ఆరు నెలలుగా వాహనాల సేల్స్ క్షీణించాయి. ఆగస్ట్ నుండి క్రమంగా కోలుకుంటున్నాయి. సెప్టెంబర్ నెలలో మారుతీ సుజుకీ సేల్స్ పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన సేల్స్ 30.8 శాతం పెరిగి 1.60 లక్షల యూనిట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 1.22 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి. డొమెస్టిక్ సేల్స్ 32.2 శాతం పెరిగి 1.52 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.

2019 సెప్టెంబర్ మాసంలో 1.15 లక్షల యూనిట్లుగా ఉంది. ఎగుమతులు 9 శాతం పెరిగాయి. గత ఏడాది 7,188 యూనిట్లు కాగా, ఈసారి 7,834 యూనిట్లుగా ఉంది. డొమెస్టిక్ పాసింజర్స్ వెహికిల్ సేల్స్ 33.9 శాతం పెరిగి గతేడాది 1.10 లక్షలు కాగా, ఈసారి 1.47 లక్షల యూనిట్లుగా ఉంది.

పండుగ చేసుకో! కస్టమర్లకు HDFC అదిరిపోయే ఆఫర్లు, రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్పండుగ చేసుకో! కస్టమర్లకు HDFC అదిరిపోయే ఆఫర్లు, రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్

ఏ సెగ్మెంట్ సేల్స్ ఎంత పెరిగాయంటే?

ఏ సెగ్మెంట్ సేల్స్ ఎంత పెరిగాయంటే?

మారుతీ సుజుకీ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 30 శాతానికి పైగా పెరిగాయి. స్మాల్ కారు సెగ్మెంట్‌లో (ఆల్టో, ఎస్ ప్రెస్సో) సేల్స్ ఏడాది ప్రాతిపదికన 35.7 శాతం పెరిగి 27,246 యూనిట్లకు పెరిగాయి.

కాంపాక్ట్ కార్లు (వాగన్ఆర్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్, టూర్స్ ఎస్) సేల్స్ 47.3 శాతం పెరిగి 84,213 యునిట్లుగా ఉంది.

మిడ్ సైజ్ కార్లు (సియాడ్ సెడాన్) సేల్స్ మాత్రం 10.6 శాతం మేర క్షీణించి 1534కు పరిమితమయ్యాయి.

యుటిలిటీ వెహికిల్ సేల్స్ (జిప్సీ, ఎర్టిగా, ఎస్ క్రాస్, విటారా బ్ర్రెజ్జా, ఎస్ఎల్6) కార్ల సేల్స్ 10.1 శాతం పెరిగి 23,669 యూనిట్లుగా ఉంది.

బజాజ్ ఆటో.. ఎంజీ మోటార్స్ సేల్స్

బజాజ్ ఆటో.. ఎంజీ మోటార్స్ సేల్స్

బజాజ్ ఆటో సేల్స్ ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరిగి, 4,41,306 యూనిట్లుగా ఉంది.

టూవీలర్, త్రీవీలర్ సేల్స్ 6 శాతం పెరిగి 2,28,731 యూనిట్లుగా ఉంది. ఎగుమతులు 14 శాతం ఎగిసి 2,12,575 యూనిట్లుగా ఉంది.

ఇక, ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ సెప్టెంబర్ నెలలో క్షీణించాయి. బ్రిటిష్ కార్ మేకర్ సేల్స్ 2019 సెప్టెంబర్‌లో 2,608 యూనిట్లు కాగా, ఈసారి 2,537 యూనిట్లకు తగ్గాయి.

ఎస్కార్ట్ ట్రాక్టర్లు

ఎస్కార్ట్ ట్రాక్టర్లు

ఎస్కార్ట్ ట్రాక్టర్ సేల్స్ సెప్టెంబర్ నెలలో రికార్డ్ స్థాయికి పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన మొత్తం సేల్స్ 9.2 శాతం పెరిగి 11,851గా నమోదయ్యాయి. ఎస్కార్ట్ ట్రాక్టర్ సేల్స్ ఓ సెప్టెంబర్ మాసంలో అత్యధికంగా అమ్ముడుపోయింది ఈసారే.

డొమెస్టిక్ సేల్స్ 8.09 శాతం పెరిగి 11,453 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఎక్స్‌పోర్ట్స్ 19.2 శాతం పెరిగి ఏడాది ప్రాతిపదిన 398కి పెరిగాయి.

English summary

గుడ్‌న్యూస్: అదరగొట్టిన మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, ఎస్కార్ట్ ట్రాక్టర్ సేల్స్ | Auto Sales In September 2020: Maruti Suzuki Sales up 31 percent

Auto sales continued to rise in September 2020 as companies stocked up dealerships to cater to festive-season demand and on low base, according to three brokerages.
Story first published: Thursday, October 1, 2020, 14:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X