For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాహనాలకు భారీ దెబ్బ, అన్నీ 10-11 ఏళ్ల కనిష్టానికి పతనం

|

న్యూఢిల్లీ: గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా వైరస్ కారణంగా వాహనాల సేల్స్ భారీగా పడిపోయాయి. వాహన విక్రయాలు కోలుకున్నట్లే కనిపిస్తున్నా ఆశించిన రికవరీ మాత్రం లేదు. ఈ నేపథ్యంలో ఆటో సేల్స్ ఈ ఆర్థిక ఏడాదిలో దారుణంగా పతనమవుతాయని భావిస్తున్నారు. ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ అయితే 11 ఏళ్ల కనిష్టానికి పడిపోతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సేల్స్ క్షీణించాయి. 2009-10 కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ ఉండవచ్చు.

నరేంద్రమోడీ కల నెరవేరాలంటే..! బ్యాంకులపై CEA వ్యాఖ్యలునరేంద్రమోడీ కల నెరవేరాలంటే..! బ్యాంకులపై CEA వ్యాఖ్యలు

క్వార్టర్ మొత్తం లేని సేల్స్!

క్వార్టర్ మొత్తం లేని సేల్స్!

ఇప్పటికే వివిధ రంగాల్లో డిమాండ్ లేమి, ఇతర రంగాలపై కూడా ప్రభావం చూపుతోంది. దీంతో ఇండస్ట్రీ సామర్థ్య వినియోగం 50 శాతం లేదా 60 శాతంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. 2019 జూలైతో పోలిస్తే కొన్ని వాహన కంపెనీలు ఈ ఏడాది జూలైలో స్వల్పంగా వృద్ధిని నమోదు చేశాయి. కానీ మొత్తంగా చూస్తే సేల్స్ పడిపోయాయి. టూ వీలర్ సేల్స్, కమర్షియల్ వాహనాల సేల్స్, పాసింజర్ వాహనాల సేల్స్, త్రీవీలర్ సేల్స్ కరోనా, లాక్ డౌన్ కారణంగా పడిపోయాయి. ఇప్పుడిప్పుడు కాస్త తేరుకుంటున్నప్పటికీ ఏకంగా ఓ క్వార్టర్ (ఏప్రిల్-జూన్) మొత్తం దాదాపు సేల్స్ లేకుండా పోయాయి.

పదేళ్ల క్రితం కంటే తక్కువ సేల్స్

పదేళ్ల క్రితం కంటే తక్కువ సేల్స్

ఇప్పటికే ఓ త్రైమాసికం మొత్తం సేల్స్ లేకుండా ఉంది. దానికి తోడు రికవరీ చాలా స్లోగా ఉన్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ (SIAM) తెలిపింది. దీంతో ఈ ఆర్థిక వ్యవస్థలో వాహనాల సేల్స్ పైన ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.కార్లు, ఎస్‌యూవీ, యూవీ, వ్యాన్స్ వంటి ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.91 మిలియన్ యూనిట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది 2009-10 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 1.95 మిలియన్ యూనిట్ల కంటే తక్కువ.

టూవీలర్ సేల్స్ 2012 కంటే డౌన్

టూవీలర్ సేల్స్ 2012 కంటే డౌన్

మోటార్ సైకిల్స్, స్కూటర్స్, మోపెడ్స్ వంటి టూవీలర్ సేల్స్ 2011-12 ఆర్థిక సంవత్సరంలో 13.4 మిలియన్ యూనిట్లు కాగా, ఈసారి 12 మిలియన్ యూనిట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్, మెర్సిడెజ్ బెంజ్, ఫోర్స్ మోటర్స్ సహా వివిధ వాహన కంపెనీలకు SIAM ప్రాతినిథ్యం వహిస్తుంది. టూవీలర్ సేల్స్ 2011-12 కంటే, కమర్షియల్ వెహికిల్ సేల్స్ 2009-10 కంటే, పాసింజర్ వెహికిల్ సేల్స్ 2009-10 కంటే, త్రీవీలర్ సేల్స్ 2010-11 కంటే తగ్గుతాయని అంచనా.

English summary

వాహనాలకు భారీ దెబ్బ, అన్నీ 10-11 ఏళ్ల కనిష్టానికి పతనం | Auto News: Passenger vehicle sales in free fall

The auto industry has pressed the panic button and said that sales will be in a free fall this fiscal due to the impact of the coronavirus and the economic slowdown.
Story first published: Monday, August 24, 2020, 15:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X