For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 కారణాలతో పెరిగిన ఆటో సేల్స్: పెరిగిన PV సేల్స్, తగ్గిన కార్ల అమ్మకాలు

|

న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆటోరంగం మెల్లిగా కుదురుకుంటోంది. దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో అక్టోబర్ నెలలో పలు మోడల్ కాల్స్ విక్రయాలు స్వల్పంగా పెరిగాయి. అయితే పాసింజర్ వెహికిల్ (PV) సేల్స్ మాత్రమే పెరిగాయి. ఇతర విభాగాల సేల్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. అక్టోబర్ నెలలో కొత్త వాహనాలు మార్కెట్లోకి రావడానికి తోడు పండుగ సెంటిమెంట్ తోడవడంతో అమ్మకాల్లో వృద్ధి నమోదు చేసిందని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) తెలిపింది.

మూడేళ్లలో ఓ వారంలో తొలిసారి భారీగా బంగారం తగ్గుదలమూడేళ్లలో ఓ వారంలో తొలిసారి భారీగా బంగారం తగ్గుదల

ప్యాసింజర్ వాహనాల సేల్స్‌లో స్వల్ప పెరుగుదల

ప్యాసింజర్ వాహనాల సేల్స్‌లో స్వల్ప పెరుగుదల

ఏడాది కాలంగా సేల్స్ తగ్గి ఆటో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. అక్టోబర్ నెలలో 0.28 శాతం పెరుగుదల నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశం. సియామ్ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం గత నెలలో 2,85,027 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే సమయంలో 2,84,223 సేల్ అయ్యాయి. 2018 నవంబర్ నెల నుంచి 2019 సెప్టెంబర్ వరకు ఆటో సేల్స్ పడిపోయాయి. గత నెలలో మొత్తంగా వాహన విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 12.76 శాతం పడిపోయి 21,76,136లకు తగ్గాయి. ఇదే అక్టోబర్ నెలలో గత ఏడాది (2018) 24,94,345 యూనిట్లు సేల్ అయ్యాయి.

ప్యాసింజర్ వెహికిల్స్ పెరుగుదల, తగ్గిన కార్ల అమ్మకాలు

ప్యాసింజర్ వెహికిల్స్ పెరుగుదల, తగ్గిన కార్ల అమ్మకాలు

ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు అక్టోబర్ నెలలో 0.28 శాతం పెరిగాయి. గత అక్టోబర్ నెలలో 2,84,223 యూనిట్లు అమ్ముడు పోగా, ఈసారి 2,85,027 యూనిట్లు అమ్ముడు అయ్యాయి. కార్ల అమ్మకాలు 6.34 శాతం క్షీణించాయి. 2018 అక్టోబర్ నెలలో 1,85,400 యూనిట్లు సేల్ కాగా, ఈ అక్టోబర్ నెలలో 1,73,549 అమ్ముడు పోయాయి.

తగ్గిన బైక్ అమ్మకాలు

తగ్గిన బైక్ అమ్మకాలు

మోటార్ సైకిల్ విక్రయాలు 15.88 శాతం తగ్గాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో 13,27,758 యూనిట్లు సేల్ కాగా, ఈ ఏడాది 11,16,970 యూనిట్లు అమ్ముడయ్యాయి. బైక్స్ గత ఏడాది 20,53,497 యూనిట్లు సేల్ కాగా, ఈ ఏడాది 17,57,264 యూనిట్లు అమ్ముడు అయ్యాయి. 14.43 శాతం క్షీణత నమోదు చేసింది. హీరో మోటో కార్ప్ సేల్స్ 18.03 శాతం తగ్గగా, హోండా మోటర్ సైకిల్, టీవీఎస్ సేల్స్ 25.46 శాతం తగ్గాయి.

కమర్షియల్ వెహికిల్స్ సేల్స్

కమర్షియల్ వెహికిల్స్ సేల్స్

కమర్షియల్ వెహికిల్స్ అమ్మకాలు 23.31 శాతం తగ్గాయి. ఈ అక్టోబర్ నెలలో 66,773 యూనిట్లు సేల్ అయ్యాయి. యుటిలిటీ వాహనాల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 22.22 శాతం పెరిగి 1,00,725లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాది 82,413లు ఉన్నాయి.

పెరిగిన మారుతీ సుజుకీ సేల్స్

పెరిగిన మారుతీ సుజుకీ సేల్స్

ప్యాసింజర్ వెహికిల్ సేల్స్‌లో మారుతీ సుజుకీ సేల్స్ 2.33 శాతం పెరిగాయి. హ్యుండాయ్ మోటార్ సేల్స్ 3.82 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 23.33 శాతం తగ్గాయి. గత ఏడాదికాలంగా సేల్స్ తగ్గడంతో గత నెలలో ప్యాసింజర్ వెహికిల్ ఉత్పత్తి 21.14 శాతం తగ్గింది. ఎగుమతులు 2.18 శాతం తగ్గినట్లు SIAM డేటా తెలియజేస్తోంది.

English summary

2 కారణాలతో పెరిగిన ఆటో సేల్స్: పెరిగిన PV సేల్స్, తగ్గిన కార్ల అమ్మకాలు | Auto industry in reverse gear despite marginal rise in October passenger vehicle sales

Total passenger vehicle sales in the domestic market increased 0.28 per cent last month, data from industry body SIAM or Society of Indian Automobile Manufacturers showed on Monday.
Story first published: Tuesday, November 12, 2019, 8:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X