For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా సహా వైరస్, బ్యాక్టీరియా 30 సెకండ్లలో విచ్ఛిన్నం!

|

క్రిమిసంహారక పరిష్కారం కోసం మైక్రోవేవ్ టెక్నాలజీపై పని చేస్తున్న ఏకైక భారతీయ వైద్య MSME మాసర్, కరోనా వ్యాప్తి సమయంలో ఉపరితలాలు, పరిసరాలు మరియు ఏరోసోల్‌లను క్రిమిరహితం చేయటానికి అతుల్యా అనే కొత్త ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ ఎంపీ వికాస్ మహాత్మే, బీజేవైఎం నాగపూర్ అధ్యక్షులు శివాని డాని వఖ్రే ఆధ్వర్యంలో దీనిని ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఉత్పత్తిని ప్రారంభించినట్లు నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ కంపెనీ తెలిపింది. వైరస్, బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేయడానికి మైక్రోవేవ్ టెక్నాలజీపై అతుల్యా పని చేస్తోందన్నారు.

పూణేలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ(DIAT) అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంపై అతుల్యా నడుస్తుంది. స్టెరిలైజర్ హ్యాండ్‌హెల్డ్ పరికరంగా పని చేస్తుంది. ఆకారం, పరిమాణాన్ని బట్టి పేటెంట్ పొందిన స్మార్ట్ టెక్నాలజీతో 30 సెకన్ల నుండి 1 నిమిషం లోపల వస్తువులు, ఉపరితలాలు, పరిసరాలు మరియు ఏరోసోల్‌లను క్రిమిరహితం చేసే సామర్ధ్యం ఉంటుంది. ఇది 56-60 పరిధిలో చల్లని స్టెరిలైజేషన్‌ను అనుమతిస్తుంది. ఉత్పత్తి యొక్క 4.5 కిలోల మోడల్ 5 amp అనుసంధాన విద్యుత్ సరఫరాపై నడుస్తుంది. పోర్టబుల్ బ్యాటరీ వెర్షన్‌ను అభివృద్ధి చేయడానికి కూడా కంపెనీ కృషి చేస్తోంది.

2022 నాటికి కరోనా వైరస్ పూర్తిగా అంతం: బిల్ గేట్స్2022 నాటికి కరోనా వైరస్ పూర్తిగా అంతం: బిల్ గేట్స్

Atulya steriliser to combat Corona unveiled by Union Minister Gadkari

తాము ఎల్లప్పుడూ క్రిమిసంహారక, క్రిమిరహితం ద్వారా ప్రజల భద్రతను నిర్ధారించే పరిష్కారాలపై పని చేస్తున్నామని, ఇందుకు DIAT((DRDO)తో అనుబంధానికి దారితీసి, ఆ తర్వాత సురక్షిత పరిసరాన్ని అందించే అతుల్య స్టెరిలైజర్‌ను పరిచయం చేసిందని మాసర్ టెక్నాలజీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ మోనిష్ భండారీ అన్నారు. మైక్రోవేవ్ టెక్నాలజీ కరోనా సమయంలో వైరస్‌ను విచ్ఛిన్నం చేస్తుందన్నారు. అతుల్య చేసిన అర నిమిషంలో సాధారణ స్కాన్ 5 మీటర్ల లోతు వరకు ఏదైనా ఉపరితలాన్ని క్రిమిరహితం చేస్తుందని, తద్వారా కరోనా వంటి వైరస్, ఇతర బ్యాక్టీరియాలను తొలగిస్తుందన్నారు. దీనికి 5 మీటర్ల వరకు చొచ్చుకుపోయే సామర్థ్యం ఉంది.

మనమంతా కరోనాతో పోరాడుతున్నామని, ఇలాంటి సమయంలో వోకల్ ఫర్ లోకల్ పేరుతో సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రభుత్వ ఈ-మార్కెట్ సేకరణ పోర్టల్ (https://gem.gov.in/), ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.12,700. పన్నులు అదనం.

English summary

కరోనా సహా వైరస్, బ్యాక్టీరియా 30 సెకండ్లలో విచ్ఛిన్నం! | Atulya steriliser to combat Corona unveiled by Union Minister Gadkari

Atulya, a DRDO technology, enables for the first time in the world, sterilization of surface and aerosol up to a depth of 5 meters within 30 seconds.
Story first published: Tuesday, August 11, 2020, 20:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X