For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీలో ఏ బస్సుకు ఎంత ఛార్జ్ పెరిగింది, ఆ బస్సులో పెరగలేదు: తిరుమలకు ఏకంగా రూ.20 పెంపు

|

అమరావతి: ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. బుధవారం నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. కిలో మీటరుకు 10 పైసల నుంచి 20 పైసల వరకు పెరుగుతోంది. ఛార్జీలు పెంచుతున్నట్లు మంగళవారం ఆర్టీసీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పల్లె వెలుగు బస్సు సహా కొన్ని బస్సుల్లో కిలో మీటరుకు 10 పైసలు, ఇతర బస్సుల్లో కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచుతున్నట్లు తెలిపింది.

నోట్ల రద్దు వల్ల లాభాలిదిగో.. రూ.3,04,605 కోట్లు నగదును తగ్గించింది

ఏ బస్సులో ఎంత ఛార్జీ పెంపు, ఈ బస్సుల్లో ఛార్జీ పెంపు లేదు

ఏ బస్సులో ఎంత ఛార్జీ పెంపు, ఈ బస్సుల్లో ఛార్జీ పెంపు లేదు

పల్లె వెలుగు బస్సులో కిలో మీటరుకు 10 పైసల చొప్పున పెరిగింది. పల్లె వెలుగు బస్సుల్లో మొదటి రెండు స్టేజీలు లేదా 10 కిలో మీటర్ల వరకు ఛార్జీ పెంపు లేదు. అలాగే, సిటీ ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు చార్జీ పెంపు లేదు. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులకు కిలో మీటరుకు 20 పైసలు పెంపు ఉండగా, ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో 10 పైసల చొప్పున పెంచారు. వెన్నెల, స్లీపర్ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదు.

దూర ప్రాంత ప్రయాణీకులపై భారం

దూర ప్రాంత ప్రయాణీకులపై భారం

ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఛార్జీలు కిలో మీటరుకు 20 పైసలు పెంచడం ద్వారా దూర ప్రాంతాల ప్రయాణీకులపై భారం పడుతోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత బస్సు ఛార్జీలు పెరిగాయి.

ఇందుకే ధరల పెంపు

ఇందుకే ధరల పెంపు

2015 నుంచి ఇప్పటి వరకు డీజిల్ ధర లీటరుకు రూ.49 నుంచి రూ.70కి చేరడం వల్ల ఆర్టీసీపై రూ.630 కోట్ల భారం పడుతోంది. దీంతో పాటు విడిభాగాల ధరలతో పాటు సిబ్బంది జీతభత్యాల పెంపుతో మరో రూ.650 కోట్ల భారం పడుతోంది. ఈ రెండు కలిపి రూ.1,280 కోట్లు అవుతోంది. ఇప్పుడు పెంచిన ఛార్జీలతో కొంత సర్దుబాటు కావొచ్చు.

ఏ బస్సుకు ఎంత పెరిగింది?

ఏ బస్సుకు ఎంత పెరిగింది?

- పల్లె వెలుగు కనీస ఛార్జీ రూ.5. కిలో మీటరుకు నిన్నటి వరకు 63 పైసలు ఉంది. పెంచిన తర్వాత 73 పైసలు.

- అల్ట్రా పల్లె వెలుగు కనీస ఛార్జీ రూ.10. కిలో మీటరుకు నిన్నటి వరకు 72 పైసలు ఉంది. పెంచిన తర్వాత 82 పైసలు.

- ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ.15. కిలో మీటరుకు నిన్నటి వరకు 87 పైసలు ఉంది. పెంచిన తర్వాత 1.07 పైసలు.

- డీలక్స్ కనీస ఛార్జీ రూ.20. కిలో మీటరుకు నిన్నటి వరకు 98 పైసలు ఉంది. పెంచిన తర్వాత 1.18 పైసలు.

- అల్ట్రా డీలక్స్ కనీస ఛార్జీ రూ.20. కిలో మీటరుకు నిన్నటి వరకు 1.10 పైసలు ఉంది. పెంచిన తర్వాత 1.30 పైసలు.

- సూపర్ లగ్జరీ కనీస ఛార్జీ రూ.25. కిలో మీటరుకు నిన్నటి వరకు 1.16 పైసలు ఉంది. పెంచిన తర్వాత 1.36 పైసలు.

- సూపర్ లగ్జరీ (ఏసీ) కనీస ఛార్జీ రూ.35. కిలో మీటరుకు నిన్నటి వరకు 1.36 పైసలు ఉంది. పెంచిన తర్వాత 1.46 పైసలు.

- ఇంద్ర కనీస ఛార్జీ రూ.35. కిలో మీటరుకు నిన్నటి వరకు 1.46 పైసలు ఉంది. పెంచిన తర్వాత 1.46 పైసలు.

- గరుడ కనీస ఛార్జీ రూ.35. కిలో మీటరుకు నిన్నటి వరకు 1.71 పైసలు ఉంది. పెంచిన తర్వాత 1.81 పైసలు.

- గరుడ ప్లస్ కనీస ఛార్జీ రూ.35. కిలో మీటరుకు నిన్నటి వరకు 1.82 పైసలు ఉంది. పెంచిన తర్వాత 1.92 పైసలు.

- అమరావతి కనీస ఛార్జీ రూ.35. కిలో మీటరుకు నిన్నటి వరకు 1.99 పైసలు ఉంది. పెంచిన తర్వాత 2.09 పైసలు.

- నైట్ రైడర్ (సీట్) కనీస ఛార్జీ రూ.35. కిలో మీటరుకు నిన్నటి వరకు 1.71 పైసలు ఉంది. పెంచిన తర్వాత 1.71 పైసలు. (మార్పులేదు)

- నైట్ రైడర్ (లోయర్ బెర్త్) కనీస ఛార్జీ రూ.70. కిలో మీటరుకు నిన్నటి వరకు 2.20 పైసలు ఉంది. పెంచిన తర్వాత 2.20 పైసలు. (మార్పులేదు)

- నైట్ రైడర్ (అప్పర్ బెర్త్) కనీస ఛార్జీ రూ.70. కిలో మీటరుకు నిన్నటి వరకు 2.00 పైసలు ఉంది. పెంచిన తర్వాత 2.20 పైసలు.

- వెన్నెల30 కనీస ఛార్జీ రూ.70. కిలో మీటరుకు నిన్నటి వరకు 2.40 పైసలు ఉంది. పెంచిన తర్వాత 2.40 పైసలు. (మార్పులేదు)

- వెన్నెల24 కనీస ఛార్జీ రూ.70. కిలో మీటరుకు నిన్నటి వరకు 2.65 పైసలు ఉంది. పెంచిన తర్వాత 2.65 పైసలు. (మార్పులేదు)

- మెట్రో లగ్జరీ (ఏసీ) కనీస ఛార్జీ రూ.35. కిలో మీటరుకు నిన్నటి వరకు 1.71 పైసలు ఉంది. పెంచిన తర్వాత 1.81 పైసలు.

వీటిల్లో అందుకే పెంచలేదు

వీటిల్లో అందుకే పెంచలేదు

సిటీ ఆర్డినరీ బస్సుల్లో 2 కిలో మీటర్లకు కనీస ఛార్జీ రూ.5 ఉండగా, 22 కిలో మీటర్లు లేదా 11వ స్టేజీ వరకు ఛార్జీలు పెంచలేదు. సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో కనీస ఛార్జీ రూ.10గానే ఉంచారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఆక్యుపెన్సీ రేటు ఎక్కువగా ఉంది. కాబట్టి కిలో మీటరుకు 20 పైసలు ఎక్కువగా వడ్డీంచారు. అలాగే, ఏసీ బస్సుల్లో, ప్రయివేటు ట్రావెల్స్‌లో ఈ బస్సు ఛార్జీలు తక్కువగా ఉండటంతో ఛార్జీలు పెంచలేదు. కొన్నింటికి 10 పైసలు పెంచారు.

తిరుమల నుంచి తిరుపతికి రూ.20 పెంపు

తిరుమల నుంచి తిరుపతికి రూ.20 పెంపు

తిరుమల - తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులో ఛార్జీను రూ.55 నుంచి రూ.65కు పెంచారు. పిల్లలకు రూ.35 నుంచి రూ.40కి పెంచారు. రానుపోను కలిపి టిక్కెట్ తీసుకుంటే పెద్దలకు రూ.100 నుంచి రూ.120కి, పిల్లలకు రూ.60 నుంచి రూ.70కి పెంచారు. ఇక, ఇప్పటికే టిక్కెట్లు తీసుకున్న వారికి కొత్త ఛార్జీలు వర్తించవు. మంగళవారం అర్ధరాత్రి నుంచి తీసుకున్న వారికి కొత్త ఛార్జీలు ఉంటాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల్లో ఏపీ సరిహద్దు వరకు ఏపీలో పెంచిన ఛార్జీలు ఉంటాయి. సంబంధిత రాష్ట్రాల్లో అక్కడి ఆర్టీసీ ఛార్జీలు వర్తిస్తాయి.

English summary

APSRTC bus fare hike come into effect from today

Bus fares in Andhra Pradesh hiked from December 11. APSRTC has decided in this regard. APSRTC has decided to increase the rate of 10 paise per km in rural light buses while 20 paise per kilometre in other services.
Story first published: Wednesday, December 11, 2019, 13:23 [IST]
Company Search