భారతదేశంలో ఆపిల్ ఆన్లైన్ స్టోర్ ను ప్రారంభించింది. అసలే కరోనా ఎఫెక్ట్ ఉన్న సమయంలో భారతదేశంలో ఆపిల్ ఆన్ లైన్ స్టోర్ ప్రారంభించటం ఆపిల్ ఉనికికి ఇది పరీక్ష సమయం . ఆపిల్ భారతదేశ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. గత కొద్దిరోజులుగా ఇది గతంలో కంటే ఎక్కువగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.

భారత్ లో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తున్న ఆపిల్
ఆపిల్ ఇప్పుడు భారతదేశం పై దృష్టి సారించి మేడ్ ఇన్ ఇండియా ఆపిల్ ఐఫోన్లు, ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ మరియు ఆపిల్ యొక్క అగ్రశ్రేణి తయారీ భాగస్వాములను రాబోయే కొన్నేళ్లలో భారతదేశంలో చాలా డబ్బు పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నామని చెప్తుంది . ఎగుమతుల కోసం అనుమతులు కోరుతోంది. పండుగ సీజన్‌కు ముందే ఆపిల్ స్టోర్ ఇండియాను ప్రారంభించడం సరైన టైమ్ అని చాలా మంది భావిస్తున్నారు. ఆపిల్ వైపు కస్టమర్లను ఆకర్షించడానికి భారతదేశంలో సరైన టైంలో అడుగు పెట్టిందని అంటున్నారు.

ఇండియాలో తొలి ఆన్ లైన్ స్టోర్ ప్రారంభంతో కస్టమర్లు హ్యాపీ
ఇప్పటికే భారతదేశంలో ఆపిల్ ఆన్లైన్ స్టోర్ ప్రారంభించడం పట్ల కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .
ఆపిల్ ఇప్పటికే 37 దేశాలలో ఆన్‌లైన్ స్టోర్లను కలిగి ఉంది . ఇప్పుడు యుఎస్ మరియు యుకెలను కలిగి ఉన్న అగ్రదేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించి ఆన్లైన్ అమ్మకాలను చేస్తోంది. మనకు కావాల్సిన ప్రోడక్ట్ ను ఎంచుకోవడం నుండి, ఆర్డర్, డెలివరీ మరియు కొనుగోలు తర్వాత కస్టమర్ సర్వీస్ తో పాటు అన్ని సేవలను అందిస్తోంది .

దేశ వ్యాప్తంగా కస్టమర్లకు డైరెక్ట్ సపోర్ట్ .. క్యాష్ బ్యాక్ ఆఫర్లు
ఆపిల్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల కోసం తమ సేవలను విస్తరించడానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది. వినియోగదారులతో కనెక్ట్ అవడానికి స్పెషలిస్ట్ లతో సిద్ధంగా ఉంది. కొనుగోలుకు సంబంధించి ఎటువంటి సమాచారమైనా వీరు వినియోగదారులకు అర్థమయ్యేలా చెప్తారు. మొత్తానికి ఆపిల్ భారతదేశంలో తొలి ఆన్ లైన్ స్టోర్ ను ప్రారంభించి తన వ్యాపారాన్ని కొనసాగించనుంది. తన కస్టమర్లను ఆకర్షించటానికి ఆపిల్ డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ తో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కూడా ప్రకటించింది .

ఆపిల్ ఆన్ లైన్ స్టోర్ ద్వారా ఎన్నో ఫెసిలిటీలు
హెచ్డిఎఫ్సి బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది . కొన్ని మోడల్స్ పై ఆరు శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. పదివేల రూపాయలు వరకు క్యాష్ బ్యాక్. ఇచ్చే అవకాశం ఉంది క్యాష్ బ్యాక్ ఇవ్వాలంటే మినిమం ఇరవై ఒక్క వేల రూపాయల పర్చేజ్ చేయాలి . ఆపిల్ నో కాస్ట్ ఇఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. యాపిల్ తన స్టోర్ ద్వారా ఎక్సేంజ్ ఆఫర్ ను కూడా ప్రకటించింది . బ్రాండ్ ,మోడల్, కండీషన్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ఆన్లైన్ ద్వారా సమాధానం ఇస్తుంది. ఆపిల్ ఆన్లైన్ స్టోర్ లో ఐ ఫోన్లు, ఐపాడ్లు మ్యాక్, వాచ్ తోపాటుగా ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్, ఐ ఫోన్ ఐఫోన్ ఎక్స్ ఆర్ తదితరాలను కొనుగోలు చేయొచ్చు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications