For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన పెట్రో ఆదాయం, పెరిగిన మద్యం ఆదాయం

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెల వరకు రూ.31,748 కోట్ల రెవెన్యూ వసూళ్లు లక్ష్యంగా పెట్టుకోగా, రూ.24,982 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, జీఎస్టీ ఆదాయాన్ని రూ.15,253 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా రూ.12,351 కోట్లు వచ్చాయి. జీఎస్టీలో పెట్టుకున్న టార్గెట్‌కు గాను 80 శాతానికి పైగా వసూలు అయ్యాయి. ఏపీ ప్రభుత్వం వివిధ రంగాలపై రెవెన్యూను టార్గెట్‌గా పెట్టుకుంది.

ఆరోగ్యశ్రీకి అర్హతలు ఇవే: కారు, భూమి, ఇల్లుఆరోగ్యశ్రీకి అర్హతలు ఇవే: కారు, భూమి, ఇల్లు

మద్యం, జీఎస్టీ రెవెన్యూలో స్వల్ప పెరుగుదల

మద్యం, జీఎస్టీ రెవెన్యూలో స్వల్ప పెరుగుదల

పెట్రోలియం ఉత్పత్తులపై ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే రూ.525 కోట్లకు పైగా తగ్గింది. జీఎస్టీ, పెట్రోలియం, లిక్కర్, వృత్తి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే రూ.35.39 కోట్లు మాత్రమే పెరిగింది. జీఎస్టీ ఆదాయం 1.91 శాతం, లిక్కర్‌పై 5 శాతం పెరిగింది.

పెట్రో ఆదాయం అందుకే తగ్గింది

పెట్రో ఆదాయం అందుకే తగ్గింది

గత ఏడాది కాలంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. దీంతో వాహనాల సేల్స్ తగ్గిపోయాయి. మరోవైపు వర్షాలు విస్తారంగా పడ్డాయి. ఈ కారణంగా మోటార్ల వాడకం తగ్గింది. దీంతో పెట్రోల్, డీజిల్ విక్రయాలు తగ్గి, పెట్రోలియం ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో తగ్గిపోయింది. మొత్తంగా పన్నురూపంలో వచ్చే పెట్రో ఆదాయం రూ.525 కోట్ల వరకు తగ్గింది.

లక్ష్యం.. వచ్చింది..

లక్ష్యం.. వచ్చింది..

పెట్రోలియం ఉత్పత్తులపై రెవెన్యూ టార్గెట్ రూ.8,358 కోట్లు కాగా రూ.5,965 కోట్లు వచ్చాయి. లిక్కర్ ఆదాయం రూ.8,015 కోట్లు కాగా, రూ.6,540 కోట్లు వచ్చాయి. వృత్తి పన్ను రూ.120 కోట్లు కాగా, ఆదాయం రూ.124 కోట్లు వచ్చింది. అద్దెలు, లీజుల ద్వారా గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గింది. అదే సమయంలో నిర్మాణదారుల నుంచి వచ్చే ఆదాయం పెరిగింది.

వీటి ఆదాయం తగ్గింది

వీటి ఆదాయం తగ్గింది

ఆటో సెక్టార్, ఇనుము, ఉక్కు, సిమెంట్, సిమెంట్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులు, అద్దెలు, లీజులు వంటి ఆదాయం గత ఏడాది కంటే తగ్గింది.

వీటి ఆదాయం పెరిగింది...

వీటి ఆదాయం పెరిగింది...

ఆటోమొబైల్ విడిభాకాలు, యాక్సెసరీస్, సాఫ్టు డ్రింక్స్, బాటిల్ వాటర్, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ఔషధాలు, ఎరువులు, క్రిమి సంహారకాలు, పనులు, కాంట్రాక్టులు, ఇన్సురెన్స్, టెలీ కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ వంటి ఆర్థిక సేవలు, రవాణా, నిర్మాణదారుల ఆదాయం గత ఏడాది కంటే పెరిగింది.

బార్లలో మద్యం మరింత ఖరీదు..

బార్లలో మద్యం మరింత ఖరీదు..

ఏపీలో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేయనుంది. వాటి స్థానంలో కొత్త బార్ల ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. ప్రస్తుతం దాదాపు ఎనిమిది వందల బార్లు ఉండగా, వాటిలో 40 శాతం తగ్గించనుంది. జనవరి 1వ తేదీ నాటికి కొత్త విధానం అమలు చేయనుంది. బార్ల సంఖ్యను ఈ విధానంలో 479కి పరిమితం చేయనుంది. అలాగే, దరఖాస్తు, లైసెన్స్ ఛార్జ్ మొత్తాన్ని పెద్ద మొత్తంలో పెంచనుంది. కొత్త వాటిని లాటరీ ద్వారా కేటాయిస్తారు. దీంతో బార్లలో మద్యం ధరను మరింత ఖరీదు కానున్నాయి.

English summary

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన పెట్రో ఆదాయం, పెరిగిన మద్యం ఆదాయం | AP revenue till october for 2019-20 financial year

Andhra Pradesh revenue till october for 2019-20 financial year. The Revenue Department manages to collect Rs.31,748 crore till october.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X