For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019 కంటే ఈ ఏడాది 25% పెరిగిన ఆండ్రాయిడ్, జూమ్ యాప్ జూమ్

|

ఆండ్రాయిడ్ యూజర్లు 2019తో పోలిస్తే ఈ సంవత్సరం (2020)లో తమ డివైజ్‌ల పైన 25 శాతం ఎక్కువగా స్పెండ్ చేశారు. ఈ మేరకు మొబైల్ యాప్ అనలిటిక్స్ ఫర్మ్ యాప్ యాన్నీ నివేదిక వెల్లడించింది. ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్లు 3.3 ట్రిలియన్ల గంటల పాటు ఉపయోగించారట. ఆండ్రాయిడ్ యూజర్లు ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్‌ఫాంలు.. మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ వంటి వాటిని ఎక్కువగా వినియోగించారని ఈ నివేదిక తెలిపింది. ఇక ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్స్‌లో భారత్, బ్రెజిల్, ఇండోనేషియా దేశాలు ముందున్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో ఈ ఏడాది యూజర్లు తమ తమ బిజినెస్ నెట్ వర్కింగ్ యాప్స్ పైన గత ఏడాది (2019)తో పోలిస్తే రెండింతలు స్పెండ్ చేశారు. 2021లోను కంపెనీలు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నందున ఈ బిజినెస్ నెట్ వర్కింగ్ యాప్స్ ఉపయోగం ఇలాగే ఉంటుందని తన ఇయర్ ఎండ్ నివేదికలో యాప్ యాన్నీ తెలిపింది.

Android users spent 25 percent more time on their devices this year

ఏడాది ప్రాతిపదికన ఆండ్రాయిడ్ డౌన్ లోడ్స్ 10 శాతం పెరిగి 90 బిలియన్ మార్క్ అందుకున్నాయి. ఇందులో గేమ్స్ వాటా 45 శాతంగా ఉంది. గత ఏడాది ఈ వాటా 40 శాతంగానే ఉంది. ఐవోఎస్‌లో ఈ వాటా 30 శాతంగా ఉంది. ఇక అంతర్జాతీయంగా యాప్ డౌన్ లోడ్స్ పరంగా 2020లో బైట్ డ్యాన్స్‌కు చెందిన టిక్-టాక్ ఉంది. ఇది నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

ఆండ్రాయిడ్, ఐవోఎస్‌.. రెండింటిలోను ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టి 2020లో టిక్-టాక్ ముందు నిలిచింది. వరల్డ్ వైడ్ స్పెండింగ్స్ విషయానికి వస్తే ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ 25 శాతం చొప్పున పెరిగాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ జూమ్ ఏకంగా 219 స్పాట్‌లు ముందుకు వచ్చి 4వ స్థానానికి ఎగబాకింది.

English summary

2019 కంటే ఈ ఏడాది 25% పెరిగిన ఆండ్రాయిడ్, జూమ్ యాప్ జూమ్ | Android users spent 25 percent more time on their devices this year

Android device users spent 3.3 trillion hours glued to their screens which is up 25 per cent from 2019, according to mobile app analytics firm App Annie. The app analytics firm's year-end report shows that Android users spent the most time on video conferencing platforms such as Microsoft Teams and Zoom.
Story first published: Friday, December 11, 2020, 21:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X