For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1 ఏప్రిల్ 2020న గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న ఆనంద్ మహీంద్రా

|

ముంబై: దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. 1 ఏప్రిల్ 2020 నుంచి ఆయన చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆ తర్వాత కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఈ మేరకు M&M కంపెనీ బోర్డు ఆనంద్ మహీంద్రా పాత్రను చైర్మన్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాత్రకు అప్రూవ్ చేసింది.

నాయకత్వ మార్పు ప్రణాళికను తమ కంపెనీ బోర్డు ప్రకటించిందని, ఇందుకు ఆనందంగా ఉందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. బోర్డుకు, నామినేషన్ కమిటీకి ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. M&M మేనేజింగ్ డైరెక్టర్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) పవన్ గోయెంకాను ప్రమోట్ చేస్తున్నట్లు, ఇది 1 ఏప్రిల్ 2020 నుంచి అమలులోకి వస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్చేంజ్‌కు ఇచ్చిన ఫైలింగ్‌లో తెలిపింది.

ఉద్యోగులకు ఓయో షాక్, 2,000 ఉద్యోగాల కోత!ఉద్యోగులకు ఓయో షాక్, 2,000 ఉద్యోగాల కోత!

Anand Mahindra to step down as Group chairman from 1 April 2020

అలాగే, సీపీ గుర్నానీ 15 ఏప్రిల్ 2020 నుంచి అడిషనల్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కంపెనీ మరుసటి ఏజీఎం వరకు ఆయన ఉంటారు. వచ్చే ఏడాది నవంబర్ నెలలో ఆయన టర్మ్ ముగిసిన అనంతరం 1 ఏప్రిల్ 2021 వరకు మళ్లీ అపాయింట్ చేయనున్నారు.

English summary

1 ఏప్రిల్ 2020న గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న ఆనంద్ మహీంద్రా | Anand Mahindra to step down as Group chairman from 1 April 2020

The board has approved the transition of Anand Mahindra's role from chairman to non-executive chairman.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X