For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

womens ipl: ఒకే ఆటలో అంబానీ-అదానీ.. పిచ్ లో నిలిచేదెవరు..? చివరికి గెలిచేదెవరు..?

|

womens ipl: భారత్‌ లో క్రికెట్‌ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అందులోనూ IPL అంటే ఓ రేంజ్‌ లో క్రేజ్ ఉంటుంది. అనధికారికంగా వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. దాదాపు లాభసాటిగా ఉండే ప్రతి వ్యాపారంలోనూ అడుగుపెట్టే అంబానీ, అదానీల కన్ను ఇప్పుడు మహిళల IPL పై పడింది. అంబానీ పురుషుల జట్టు 'ముంబై ఇండియన్స్' ద్వారా ఇప్పటికే క్రికెట్‌ లోకి అడుగుపెట్టారు. తాజాగా అదానీ సైతం ఈ రంగంలోకి కాలు మోపాలని చూస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో జరగనున్న మహిళల IPL ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

అదానీ ఫస్ట్ స్టప్:

అదానీ ఫస్ట్ స్టప్:

ఏప్రిల్ లో పురుషుల IPL ప్రారంభం కానుండగా.. మొత్తం 5 జట్లతో ఓ నెల ముందుగా మార్చిలో మహిళల IPL మొదటి సీజన్ మొదలవబోతోంది. ఇందుకోసం బుధవారం బిడ్డింగ్ జరగనుంది. అదేరోజు BCCI వాటిని తెరవనుంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ద్వారా అంబానీ రంగంలోకి దిగగా.. ఈ అయిదింటిలో ఓ జట్టును దక్కించుకునేందుకు అదానీ గ్రూప్ సైతం పోటీపడనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌ లో పెట్టుబడి పెట్టి రాబడి సాధించడంతో పాటు స్టేటస్ సింబల్‌ గాను IPL ను వ్యాపారవేత్తలు భావిస్తున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పోటీలో ముప్పై సంస్థలు:

పోటీలో ముప్పై సంస్థలు:

మొత్తం 30 సంస్థలు టెండర్ డాక్యుమెంట్స్ తీసుకున్నాయి. వాటిలో ముఖ్యంగా హల్దీరామ్, టొరెంట్ ఫార్మాస్యూటికల్స్, కాప్రి గ్లోబల్ సైతం సోమవారం సాంకేతిక బిడ్‌లను సమర్పించినట్లు BCCI వర్గాలు తెలిపాయి. వాటితో పాటు వేలంలో పాల్గొనేందుకు దేశంలోని పలు పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, డిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు సోమవారం బిడ్లు దాఖలు చేసినట్లు BCCI తెలిపింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లు మాత్రం ఇందుకు దూరంగా ఉన్నాయి.

కుప్పలుతెప్పలుగా ఆదాయం:

కుప్పలుతెప్పలుగా ఆదాయం:

వేలంలో ఒక్కో జట్టు 500 నుంచి 600 కోట్ల రూపాయల మధ్య కొనుగోలయ్యే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా BCCI దాదాపు 4 వేల కోట్ల ఆదాయం ఆర్జించనుందని చెబుతున్నారు. ఈ మ్యాచ్‌ లకు Viacom18 ప్రసార హక్కులను కొనుగోలు చేసింది. మొదటి మూడేళ్లలో జరగనున్న 20 టోర్నమెంట్లలో ఒక్కో జట్టు 22 మ్యాచ్‌ లు ఆడనున్నాయి. పదేళ్ల కాలానికి ఈ బిడ్లు ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.

English summary

womens ipl: ఒకే ఆటలో అంబానీ-అదానీ.. పిచ్ లో నిలిచేదెవరు..? చివరికి గెలిచేదెవరు..? | Ambani and Adani teams fight in womens ipl

Ambani and Adani in women IPL
Story first published: Tuesday, January 24, 2023, 18:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X