For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌కు ఉపకారం ఏమీకాదు: భారీ ఆఫర్లపై జెఫ్ బెజోస్‌కు గోయల్ ఝలక్

|

న్యూఢిల్లీ: ఇండియాలో 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,100 కోట్లు) పెట్టుబడులు పెడతామని అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై చిన్న వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు భారత ఈ-కామర్స్ నిబంధనలు ఉల్లంఘించి భారీ ఆఫర్లతో చిరు సంస్థలను దెబ్బతీస్తున్నాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ పెట్టుబడులపై స్పందించారు.

మేం మీతో పోటీ పడలేం.. గో బ్యాక్ జెఫ్ బెజోస్: రూ.7,100 కోట్ల పెట్టుబడిపై అమెజాన్ సీఈవోకు షాక్మేం మీతో పోటీ పడలేం.. గో బ్యాక్ జెఫ్ బెజోస్: రూ.7,100 కోట్ల పెట్టుబడిపై అమెజాన్ సీఈవోకు షాక్

భారీ ఆఫర్లు ఇస్తే నష్టం రాదా..?

భారీ ఆఫర్లు ఇస్తే నష్టం రాదా..?

రూ.7,100 కోట్ల భారీ పెట్టుబడుల ద్వారా అమెజాన్ భారత్‌కు పెద్ద ఉపకారం ఏమీ చేయడంలేదని పీయుష్ గోయల్ అన్నారు. పోటీ సంస్థల్ని దెబ్బతీసేందుకు భారీ ఆఫర్ల పేరుతో తక్కువ ధరలకు విక్రయిస్తుంటే నష్టాలు రాకుండా లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

అది కుదరదు..

అది కుదరదు..

ఈ-కామర్స్ కంపెనీలు భారత చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టాలలోని లొసుగులను అడ్డు పెట్టుకొని మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి దొడ్డదారిన చొరబడదామని భావిస్తే అది కుదరదని స్పష్టం చేశారు.

గొప్ప సాయం ఏమీ చేయడం లేదు

గొప్ప సాయం ఏమీ చేయడం లేదు

పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్‌కు అమెజాన్ గొప్ప సాయం చేయడం లేదని దయచేసి లేఖ, మరియు చట్టస్ఫూర్తిని అనుసరించాలని, లొసుగులను కనుగొనేందుకు ప్రయత్నాలు చేయవద్దని తాను పెట్టుబడిదారులకు సూచించానని గోయల్ చెప్పారు.

ప్రతి ఏడాది బిలియన్ డాలర్లు కోల్పోతుంటే..

ప్రతి ఏడాది బిలియన్ డాలర్లు కోల్పోతుంటే..

వారు ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టవచ్చునని, కానీ వారు ప్రతి ఏడాది ఓ బిలియన్ డాలర్లను కోల్పోతుంటే వారు సరదాగా బిలియన్ డాలర్లకు ఫైనాన్స్ (ఆర్థిక సాయం) చేయవచ్చునని, కానీ వారు పెట్టుబడులు పెడుతున్నారని, అలాంటప్పుడు భారత్‌కు సాయం చేస్తున్నట్లు ఏమీ కాదని చెప్పారు. కాగా, ఇండియాలో పర్యటిస్తున్న జెఫ్ బెజోస్ ప్రభుత్వ వర్గాలతో కూడా సమావేశం కానున్న నేపథ్యంలో పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యంగా మారాయి.

'ఈ-కామర్స్ మార్కెట్

'ఈ-కామర్స్ మార్కెట్

'ఈ-కామర్స్ మార్కెట్ కొనుగోలుదారులు, విక్రేతల్ని అనుసంధానం చేసే ఐటీ ప్లాట్ ఫాం మాత్రమేనని, ఇలాంటి ప్లాట్ ఫాం అందించే సంస్థకు ఎందుకు భారీ నష్టాలు వస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరముందని, ఇండియాలో ఆ సంస్థ బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉండవచ్చునని, ఆ క్రమంలో బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టాలు వస్తే వాటిని కూడా భరించక తప్పదని, పెట్టుబడుల ద్వారా భారత్‌కు ఆ సంస్థ ఏదో సహకరిస్తుందని అనుకోవద్దు' అన్నారు.

సందేహాలు కలుగుతాయి..

సందేహాలు కలుగుతాయి..

సరైన విధానాలు పాటిస్తూ పది బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన కంపెనీ బిలియన్ డాలర్ల కొద్ది నష్టాలు నమోదు చేస్తుందంటే సందేహాలు కలుగుతాయని, అనుచిత వ్యాపార విధానాలో లేదా పోటీ సంస్థల్ని దెబ్బతీసేటువంటి రేట్లతో అమ్మడం వల్లనే భారీ నష్టాలు వస్తాయని గోయల్ అన్నారు. అధికారుల విచారణలో ఈ సందేహాలన్నింటికీ సమాధానం దొరకగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారీ డిస్కౌంట్స్, విక్రేతలతో ఒప్పందాలు వంటి అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయనే ఆరోపణలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మీద CCI విచారణకు ఆదేశించింది.

English summary

భారత్‌కు ఉపకారం ఏమీకాదు: భారీ ఆఫర్లపై జెఫ్ బెజోస్‌కు గోయల్ ఝలక్ | Amazon’s $1 bn investment not a favour for India: Piyush Goyal

Amazon is not doing India a favour by investing a billion dollars, said Piyush Goyal, Minister of Commerce and Industry, a day after the e-commerce giant's founder and CEO Jeff Bezos announced the incremental investment in the country.
Story first published: Friday, January 17, 2020, 8:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X