భారతీ ఎయిర్‌టెల్ 2019-20 డిసెంబర్ త్రైమాసికానికి గాను రూ.1,035 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్‌లో రూ.86 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం రూ.20,231 కోట్ల నుంచి 8.5 శాతం వృద్ధి చెంది రూ.21,947 కోట్లకు చేరుకుంది. ఈ మేరకు బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది.

మరోసారి ధరలు పెంచడంపై హింట్
గత ఏడాది డిసెంబర్ నెలలో టారిఫ్స్ సవరణ (పెంపు) స్వాగతించదగ్గ అంశమని, ఈ కారణంగా టెలికం సంస్థలు ఆర్థికంగా నిలదిక్కుకోవడానికి దోహదం చేస్తుందని భారతీ ఎయిర్‌టెల్ ఇండియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. సవరణ టెలికం పరిశ్రమ ఆర్థిక పరిస్థితులను మెరుగు పరుస్తుందన్నారు. ఈ సందర్భంగా మరో దఫా పెంచాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడటం గమనార్హం.

అందుకే మరోసారి పెంచే ఛాన్స్
అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా టారిఫ్స్ పెంచాల్సిన అవసరం ఉందని గోపాల్ విఠల్ అన్నారు.టెలికం రంగంలో వస్తున్న టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా కొత్త టెక్నాలజీలోకి మారేందుకు మరిన్ని పెట్టుబడులు అవసరం ఉందని, దీంతో ధరలు మరోసారి పెంచక తప్పదని సంకేతాలు ఇచ్చారు.

ఆదాయం పెరిగింది.
డిసెంబర్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఆదాయం 7 శాతం పెరిగి రూ.15,797 కోట్లకు చేరుకుందని కంపెనీ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే 7 శాతం ఎక్కువ. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.23,045 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

కేంద్రానికి రూ.28,450 కోట్లు కేటాయింపు
ఏజీఆర్ సహా బకాయిలు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో.. ఎయిర్‌టెల్ కేంద్రానికి రూ.28,450 కోట్లను కేటాయించింది. దీంతో సంస్థకు భారీగా నష్టం వచ్చింది. ఇందుకు తీసుకున్న రుణాలపై వడ్డీల రూపంలో అధికంగా చెల్లించడంతో లాభాల్లో గండిపడిందని గోపాల్ విఠల్ చెప్పారు. మొబైల్ డాటా వాడకంలో వృద్ధి 73% నమోదు కాగా, వీరిలో 4G డాటా కస్టమర్లు 60.6% ఎగిసి 12.38 కోట్లకు చేరుకందన్నారు.

రూ.128 నుంచి రూ.135కు పెరిగిన ఆర్పు
గత త్రైమాసికంలో కొత్తగా 2.1 కోట్ల మంది 4G సబ్‌స్క్రైబర్లు ఎయిర్‌టెల్ నెట్ వర్క్‌ను ఎంచుకున్నారు. ఒక్కో కస్టమర్ నుంచి సరాసరి ఆదాయం-ARPU రూ.128 నుంచి రూ.135కి పెరిగినట్లు గోపాల్ విఠల్ చెప్పారు. కాగా, డిసెంబర్ క్వార్టర్‌లో రిలయన్స్ జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) రూ.128.4కు చేరుకుంది.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications