For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విమాన ప్రయాణీకులకు గుడ్‌న్యూస్, ఛార్జీలు 40 శాతం తగ్గే ఛాన్స్

|

కరోనా నేపథ్యంలో ఆంతర్జాతీయంగా పరిమిత సర్వీసులు నడిపేందుకు అనుమతి ఉండటంతో విమాన ప్రయాణ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఇటీవల విమాన ఇంధనం ధర ATF ధర పెరిగింది. ఇది మరింత భారమైంది. కరోనా ముందుస్థాయి ధరలతో పోలిస్తే ప్రస్తుతం 100 శాతం ఛార్జీలు అంటే రెండింతలు ఉన్నాయి. అయితే ఈ నెల 27వ తేదీ నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సర్వీసులను పునరుద్ధరిస్తే ఛార్జీలకు సంబంధించి విమాన ప్రయాణీకులకు భారీ ఊరట దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇది ట్రావెలర్స్‌కు గుడ్ న్యూస్.

ప్రభుత్వం విమాన సర్వీసులకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో విమాన ప్రయాణ ధరలు 40 శాతం వరకు దిగి రావొచ్చు. విమాన సర్వీసులు పెంచడం వల్ల వారికి విమాన అద్దె భారం తగ్గుతుంది. కరోనా సమయంలో అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేశారు. రెండేళ్ల తర్వాత వీటిని పునరుద్ధరిస్తున్నారు.

Air Fare: Flight tickets can be up to 40% cheaper

లుఫ్తాన్సా, గ్రూప్ క్యారియర్ స్విస్ వచ్చే కొద్ది నెలల్లో తమ సర్వీసులను రెట్టింపు చేయాలని చూస్తున్నాయి. మరోవైపు, సింగపూర్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులను 17 శాతం పెంచాయి. డొమెస్టిక్ క్యారియర్ ఇండిగో వచ్చే కొద్ది నెలల్లో 100 గ్లోబల్ ఫ్లైట్స్ నడిపే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఆయా దేశాలతో ఉన్న ఎయిర్ బబుల్ ఒప్పందం మేరకు పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను నడిపిస్తున్నారు. సర్వీసుల పునరుద్ధరణతో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు తిరిగి కరోనా ముందుస్థాయి సమీపానికి వస్తాయని భావిస్తున్నారు.

English summary

విమాన ప్రయాణీకులకు గుడ్‌న్యూస్, ఛార్జీలు 40 శాతం తగ్గే ఛాన్స్ | Air Fare: Flight tickets can be up to 40% cheaper

Air travel fares may drop by up to 40 percent. Industry executives say that the government’s decision to resume regular international travel from March 27 could lead to an increase in the number of flights.
Story first published: Friday, March 11, 2022, 12:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X