For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ షాక్: అంబానీ, అదానీని కొంత ఆదుకున్న స్టాక్స్! టాటాకు TCS దెబ్బ

|

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమనం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. చివరి త్రైమాసికంలో పుట్టుకు వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. మార్కెట్లు కుప్పకూలాయి. రెండు నెలల్లోనే సెన్సెక్స్, నిఫ్టీలు 30 శాతానికి పైగా నష్టపోయాయి. ఒకటి రెండు షేర్లు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. అంబానీలు, అదానీలు, టాటాలు.. ఇలా కార్పోరేట్ దిగ్గజాల ఆదాయం పడిపోయింది. దిగ్గజ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ దిగజారింది. ఇలాంటి పరిస్థితుల్లోను కొన్ని కార్పోరేట్ సంస్థలు మాత్రం మంచి ప్రదర్శన కనబరిచాయి.

షాక్: అమెరికాలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఉడిపోయే అవకాశముందంటే? ఇండియన్స్ ఏమంటున్నారు?షాక్: అమెరికాలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఉడిపోయే అవకాశముందంటే? ఇండియన్స్ ఏమంటున్నారు?

అదానీ పోర్ట్స్ లాస్.. అదానీ గ్రీన్ భారీ లాభాలు

అదానీ పోర్ట్స్ లాస్.. అదానీ గ్రీన్ భారీ లాభాలు

అంబానీ, అదానీలకు చెందిన గ్రూప్‌లలో కొన్ని కంపెనీలు నష్టపోగా, కొన్ని లాభాలు గడించాయి. ఉదాహరణకు అదానీ గ్రూప్‌కు చెందిన మోస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అదానీ ప్రోట్స్ అండ్ సెజ్ గత ఆర్థిక సంవత్సరంలో 33 శాతం మేర నష్టపోయింది. కానీ అదానీ గ్రీన్స్ ఎనర్జీ మాత్రం 312 శాతం ఎగిసింది. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ నష్టాన్ని కొంత తగ్గించింది. అదానీ పోర్ట్స్‌లో ఇన్వెస్టర్లు రూ.27,200 కోట్లు (M-cap రూ.51,000 కోట్లు) నష్టపోయారు. కానీ అదానీ గ్రీన్ మాత్రం రూ.18,200 కోట్లు (M-cap రూ.24,000) జత కలిపింది.

అదానీ గ్రూప్ ఆస్తులు ఎంత తగ్గాయంటే

అదానీ గ్రూప్ ఆస్తులు ఎంత తగ్గాయంటే

అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రాజెస్ 6.65 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్స్ 13 శాతం, అదానీ పవర్ 42 శాతం, అదానీ గ్యాస్ 32 శాతం నష్టపోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా అదానీ గ్రూప్ స్టాక్స్ సగటున 16 శాతం మేర నష్టపోయాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.57 లక్షల కోట్ల నుండి రూ.1.31 లక్షల కోట్లకు తగ్గింది.

ముఖేష్ అంబానీకి భారీ నష్టాలు మిగిల్చినవి..

ముఖేష్ అంబానీకి భారీ నష్టాలు మిగిల్చినవి..

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లో మైక్రోక్యాప్ స్టాక్స్ లాభాల్లో ముగియగా, మిగతా స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. డెన్ నెట్ వర్క్ షేర్లు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 58 శాతం నష్టపోయాయి. హాత్‌వే కేబుల్, RIL షేర్లు వరుసగా 53 శాతం, 36 శాతం దిగజారాయి. చమురు కంపెనీల నుండి టెలికం కంపెనీల వరకు 18.38 శాతం నష్టపోయాయి. దీంతో ఏడాది క్రితం వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.64 లక్షల కోట్లుగా ఉండగా ఇప్పుడు రూ.7.5 లక్షల కోట్లకు తగ్గింది.

ముఖేష్ అంబానీకి కొంతలో కొంత ఉరట ఇదే..

ముఖేష్ అంబానీకి కొంతలో కొంత ఉరట ఇదే..

మైక్రోక్యాప్ హాత్‌వే భవాని షేర్లు ఏడాదిలో ఏకంగా 141 శాతం పెరిగాయి. రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూకు తక్కువ మొత్తమైనా జోడించింది. ఇది కలుపుకుంటే గత ఏడాది రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.8.72 లక్షల కోట్లుగా ఉండగా ఏడాదిలో 18.74 శాతం తగ్గి రూ.7.09 లక్షల కోట్లకు తగ్గింది.

టాటాను దెబ్బతీసిన TCS

టాటాను దెబ్బతీసిన TCS

టాటా గ్రూప్‌లోని 28 స్టాక్స్‌లలో 25 షేర్లు ఏడాదిలో 9 శాతం నుండి 75 శాతం మేర నష్టపోయాయి. ఈ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ రూ.11.1 లక్షల కోట్ల నుండి 16 శాతం మేర పడిపోయి రూ.9.30 లక్షలకు చేరుకుంది. TCS 9 శాతం పతనమై ఈ గ్రూప్ భారీ పతనానికి కారణమైంది. టాటా కన్స్యూమర్ ఉత్పత్తులు, ట్రెంట్, ర్యాలీస్ ఇండియా వరుసగా 45 శాతం, 33 శాతం, 6 శాతం నష్టపోయాయి. టాటా గ్రూప్‌లోని పెద్ద షేర్లు దెబ్బతీశాయి. టాటా పవర్ 55 శాతం, టాటా మోటార్స్ 55 శాతం, టాటా కెమికల్స్ 62 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 62 శాతం పడిపోయాయి.

ఆదిత్య గ్రూప్‌కు ఐడియా సహా ఇవి దెబ్బ

ఆదిత్య గ్రూప్‌కు ఐడియా సహా ఇవి దెబ్బ

ఆదిత్య బిర్లా గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ ఏడాదిలో 41 శాతం మేర పడిపోయింది. ఈ గ్రూప్‌లోని దిగ్విజయ్ సిమెంట్ (11.5 శాతం ఎగిసింది) మినహా మిగతా స్టాక్స్ అన్ని నష్టపోయాయి. వొడాఫోన్ - ఐడియా 82 శాతం, ట్రాన్‌ఫక్ 63 శాతం, ఆదిత్య బిర్లా మనీ 59 శాతం, ఆదిత్య బిర్లా కేపిటల్ 56 శాతం, హిండాల్కో 53 శాతం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 44 శాతం నష్టపోయాయి. అల్ట్రా టెక్ సిమెంట్ 18 శాతం దిగజారింది.

42 శాతం తగ్గిన అనిల్ అంబానీ గ్రూప్ ఎం-క్యాప్

42 శాతం తగ్గిన అనిల్ అంబానీ గ్రూప్ ఎం-క్యాప్

అనిల్ అంబానీకి చెందిన అడాగ్ గ్రూప్ ఏడాదిలో మార్కెట్ వ్యాల్యూను రూ.28,132 కోట్ల నుండి 42 శాతం తగ్గి రూ.16,283 కోట్లకు పడిపోయింది. రిలయన్స్ కేపిటల్ అండ్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 97 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 92 శాతం, రిలయన్స్ పవర్ 89 శాతం, రిలయన్స్ నావల్ 85 శాతం, ఆర్.కామ్ 84 శాతం నష్టపోయాయి. కేవలం నిప్పోన్ లైఫ్ మాత్రమే 18 శాతం ఎగిసింది.

English summary

మార్కెట్ షాక్: అంబానీ, అదానీని కొంత ఆదుకున్న స్టాక్స్! టాటాకు TCS దెబ్బ | Adanis, Ambanis outdid Sensex in painful

No corporate house went unscathed in the challenging FY20, the year that tested investor nerves with one after another major headwind, be it the US-China trade war, deadly coronavirus outbreak, the NBFC crisis or the painful domestic slowdown.
Story first published: Friday, April 3, 2020, 16:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X