For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో 45 రోజులకు సరిపడా సన్‌ఫ్లవర్ నూనె, రైస్ బ్రాన్ దిశగా మార్పు

|

దేశంలో ప్రస్తుతం 45 రోజులకు సరిపడా సన్‌ఫ్లవర్ నూనె ఉత్పత్తుల స్టాక్ ఉందని, సాధారణంగా ఇది 60 రోజులకు ఉంటుందని అదానీ విల్మర్ సీఈవో అంగ్‌షు మాలిక్ అన్నారు. సాధారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్‌తో పోలిస్తే సగం వరకు పామాయిల్, సోయాబీన్ ఆయిల్‌కు డిమాండ్ ఉంటుందని, మొత్తం భారత దేశ ఎడిబుల్ ఆయిల్స్ వినియోగంలో కోర్ సన్ ఫ్లవర్ కన్స్యూమర్లు దాదాపు 5 శాతం ఉంటారని తెలిపారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు సరఫరా చైన్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుందని రష్యా-ఉక్రెయిన్ యుద్ద పరిస్థితులను ఉద్దేశించి ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రౌండ్‌నట్ ఆయిల్‌కు డిమాండ్ పెరుగుతోందని, అదే సమయంలో ఇటీవల రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్యకరమైన నూనెగా మారిందని, కంపెనీలు కూడా రైస్ బ్రాన్ ఆయిల్‌ను ప్రమోట్ చేస్తున్నాయన్నారు. ఈ మేరకు అంగ్‌షు మాలిక్ ఆంగ్ల మీడియా ఈటీ ఇంటర్వ్యూలో మాట్లాడారు

45 రోజులకు సరిపడా నూనెలు

45 రోజులకు సరిపడా నూనెలు

భారత్‌కు 70 శాతం సన్ ఫ్లవర్ నూనె దిగుమతులు ఉక్రెయిన్ నుండి వస్తాయని, అయితే 45 రోజులకు సరిపడా స్టాక్ ఉందని, సాధారణంగా ఇది 60 రోజుల వరకు ఉంటుందని ఇండియా వినియోగం 23 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంటుందని, ఇందులో సన్ ఫ్లవర్ ఆయిల్ మూడు మిలియన్ టన్నులుగా ఉంటుందని, అంటే మొత్తం ఆయిల్స్‌లో 12 శాతం నుండి 13 శాతమని తెలిపారు. ఇలాంటి డిమాండ్ పరిస్థితుల్లో 50 శాతం డిమాండ్ పామాయిల్‌కు, సోయాబీన్‌కు చేరుకుంటుందన్నారు.

 నూనె ధరలు పెరుగుతున్నాయ్ కానీ

నూనె ధరలు పెరుగుతున్నాయ్ కానీ

మనం మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతర్జాతీయంగా ఓ ఆయిల్ ధర పెరిగితే, ఇతర ఆయిల్స్ పైన కూడా ప్రభావం ఉంటుందని చెప్పారు. చాలామంది ఆయిల్ సరఫరాదారులు ఇప్పటికే అర్జెంటీనాతో ఒప్పందం కుదుర్చుకున్నారని, కాబట్టి అర్జెంటీనా నుండి దిగుమతులు పెరగవచ్చునని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో 50 శాతం మంది ఇతర నూనెలకు మారిపోతారని, మరో 50 శాతం కంపెనీలు మేనేజ్ చేయగలుగుతాయని చెప్పారు. ప్రస్తుతం నూనెల ధరలు మేజర్ ఇష్యూ కాకపోవచ్చునని చెప్పారు.

సన్ ఫ్లవర్ నుండి మళ్లింపు

సన్ ఫ్లవర్ నుండి మళ్లింపు

సన్ ఫ్లవర్ ఆయిల్ కొరతను రైస్ బ్రాన్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ వంటివి భర్తీ చేస్తాయని తెలిపారు. రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్యకరమైన నూనెగా వచ్చిందని, కంపెనీలు వీటిని ప్రమోట్ చేస్తున్నాయని, సన్ ఫ్లవర్ ఆయిల్‌తో దాదాపు సరిసమానంగా ఈ ధరలు ఉంటున్నాయని, కాబట్టి రైస్ బ్రాన్ ఆయిల్‌కు మరింత పెరిగే అవకాశముందన్నారు.

English summary

మరో 45 రోజులకు సరిపడా సన్‌ఫ్లవర్ నూనె, రైస్ బ్రాన్ దిశగా మార్పు | Adani Wilmar has enough oil to manage supply chain

The country has around 45 days of stocks while 60 days of stocks is normally carried. Normally, in such a situation, there is a demand shift of almost 50% towards palm oil and soybean oil from sunflower oil.
Story first published: Thursday, March 3, 2022, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X