For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ దక్కించుకున్న అదానీ: మారుతీ సుజుకీ-చైనా ప్రస్తావన

|

బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ మంగళవారం ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును దక్కించుకుంది. 8 గిగావాట్ల విద్యుదుత్పత్తి చేయగల రూ.45,000 కోట్ల (600 కోట్ల డాలర్లు) ఈ ప్రపంచ అతిపెద్ద విలువైన తయారీ ఆధారిత సౌర విద్యుత్ కాంట్రాక్ట్ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి పొందినట్లు అదానీ గ్రీన్.. స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.

ఆ కంపెనీలకు అమెరికా షాక్, చైనాకు ట్రంప్ 'కఠిన' హెచ్చరికఆ కంపెనీలకు అమెరికా షాక్, చైనాకు ట్రంప్ 'కఠిన' హెచ్చరిక

25 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా..

25 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా..

ఈ ఆర్డర్ ప్రకారం మరో 2 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కూడా అదానీ సోలార్ నిర్మిస్తుంది. తాజా కాంట్రాక్టుతో కలిపి అదానీ గ్రీన్‌కు 15 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టలు కాంట్రాక్ట్, నిర్మాణం, నిర్వహణలో ఉన్నట్లు అయింది. 2025 నాటికి రూ.1.12 లక్షల కోట్లతో 25 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతోంది.

2025 నాటికి పూర్తి

2025 నాటికి పూర్తి

రూ.45,000 కోట్లతో వచ్చే అయిదేళ్లలో 8 గిగావాట్ల సామర్థ్యంతో ఇండియాలో సోలార్ ప్లాంటును నిర్మించనుంది అదానీ గ్రీన్. ఒప్పందంలో భాగంగా తొలుత 2 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం 2022 నాటికి పూర్తవుతుందని, మిగిలిన మొత్తం ప్రతి ఏడాదికి 2 గిగావాట్ల చొప్పున 2025 నాటికి పూర్తవుతుందని తెలిపింది. అదే విధంగా ఒప్పందంలో భాగంగా మరో 2 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కూడా నిర్మిస్తుంది.

మారుతీ సుజుకీ వలె...

మారుతీ సుజుకీ వలె...

సోలార్ ఎనర్జీలో తన ప్రయత్నాలను గౌతమ్ అదానీ ఇండియా టాప్ కార్‌మేకర్ మారుతీ సుజుకీతో పోల్చారు. స్థానిక తయారీని ప్రోత్సహించడం ద్వారా సోలార్ సెల్స్, మాడ్యూల్స్ సరఫరా వ్యవస్థను సృష్టించవచ్చునన్నారు. ప్రస్తుతం 90 శాతం సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌ను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. చైనా నుండి వచ్చే తక్కువ ధర మాడ్యూల్స్‌తో పోటీ పడేందుకు దేశీయ తయారీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమికంగా తాము చైనా వలె పోటీ పడుతున్నామని అదానీ చెప్పారు. చిన్న కార్ల తయారీలోకి మారుతీ సుజుకీ వచ్చాక అన్నీ కూడా అదే దారిలో నడిచాయన్నారు.

దూసుకెళ్లిన అదానీ షేర్లు

దూసుకెళ్లిన అదానీ షేర్లు

ఈ సంవత్సరం ప్రారంభం నుండి అదానీ గ్రీన్ షేర్లు దాదాపు రెట్టింపయ్యాయి. మంగళవారం 5 శాతం పెరిగి రూ.312.60 వద్ద ముగిశాయి. ఈ రోజు మధ్యాహ్నం సమయానికి 5 శాతం పెరిగి రూ.328కి చేరుకున్నాయి. స్థానిక (దేశీయ) పెట్టుబడిదారులతో కలిసి పని చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని అదానీ తెలిపారు. అదానీ గ్రీన్‌లో మరో 10 శాతం నుండి 15 శాతం వాటా విక్రయానికి సిద్ధంగా ఉంది.

English summary

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ దక్కించుకున్న అదానీ: మారుతీ సుజుకీ-చైనా ప్రస్తావన | Adani Green wins largest solar project, to invest Rs 45,000 crore

Gautam Adani's renewable energy firm Adani Green Energy on Tuesday said it has won the world's largest solar order to build 8 gigawatts of photovoltaic (PV) power plant along with a domestic solar panel manufacturing unit at an investment of Rs 45,000 crore.
Story first published: Wednesday, June 10, 2020, 13:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X