For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 రోజుల్లో 85 లక్షల కొత్త ఉద్యోగాలు, 20 నెలల్లో ఇదే గరిష్టం

|

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. డిమాండ్ పుంజకుంటోంది. ఉత్పత్తి పెరుగుతోంది. రికవరీ బాట నేపథ్యంలో జాబ్ మార్కెట్ కూడా మెరుగుపడుతోంది. సెప్టెంబర్ నెలలో మొత్తం ఉద్యోగాలు 85 లక్షలు పెరిగి, నిరుద్యోగిత రేటు 6.9 శాతానికి తగ్గింది. కరోనా ప్రారంభమైన మార్చి 2020లో నిరుద్యోగిత రేటు 20 శాతంగా ఉంది. ఆ తర్వాత లాక్‌డౌన్ సమయంలో మరింత పడిపోయి ఓ సమయంలో 30 శాతం దాటింది. కానీ ఆ తర్వాత ఆర్థిక రికవరీ క్రమంగా పుంజుకొని, నిరుద్యోగిత రేటు తగ్గుతోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోను నిరుద్యోగిత రేటు పెరిగింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో 8.3 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు సెప్టెంబర్ నెలలో మరింత తగ్గుతుంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) విడుదల చేసిన నెలవారీ గణాంకాల ప్రకారం కరోనాకు ముందునాటి ఫిబ్రవరి 2020 తర్వాత అత్యుత్తమ ఉద్యోగ గణాంకాలు ఇవే కావడం గమనార్హం. అంటే ఇరవై నెలల గరిష్టానికి చేరుకుంది.

సెప్టెంబర్ నెలలో వేతన ఉద్యోగాలు ఆగస్ట్ నెలతో పోలిస్తే 70లక్షలు పెరిగి, మొత్తం ఉద్యోగాలు 7.71 కోట్ల నుండి 8.41 కోట్లకు చేరుకున్నాయి. 2019-20 సగటు 8.67 కోట్ల వేతన ఉద్యోగాలు కావడం గమనార్హం. సెప్టెంబర్ నెలలో రైతుల సంఖ్య 25.1 లక్షలు తగ్గి 11.36 కోట్లగా నమోదయింది. ఆగస్ట్ నెలలో ఈ సంఖ్య 11.6 కోట్లుగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారు వ్యవసాయేతర ఉపాధికి వెళ్లడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. చిన్న వ్యాపారాలు, రోజు కూలీ కార్యకలాపాలు ఆగస్ట్ నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 12.85 కోట్ల నుండి 13.40 కోట్లకు చేరుకున్నాయి.

 85 lakh new jobs created in 30 days, Highest in 20 months

గత నెలలో సంఘటిత, అసంఘటిత తయారీరంగ ఉద్యోగాలు 29 లక్షల మేర పెరిగాయి. ఆహార పరిశ్రమ (25 లక్షలు), మెటల్ (15 లక్షలు) రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు జత కలిశాయి. ఫార్మా, పాదరక్షలు, జ్యువెల్లరీ, చేతివృత్తులలో ఉద్యోగాలు వృద్ధి చెందాయి. సెప్టెంబర్ 2021లో ఉపాధి పెరుగుదలలో ఎక్కువగా జీతభత్యాల పెంపు ఉంది. ఆగస్ట్ నెలతో పోలిస్తే 77.1 మిలియన్ల నుండి 6.9 మిలియన్లు పెరిగి సెప్టెంబర్ నెలతో 84.1 మిలియన్లకు పెరిగాయి.

English summary

30 రోజుల్లో 85 లక్షల కొత్త ఉద్యోగాలు, 20 నెలల్లో ఇదే గరిష్టం | 85 lakh new jobs created in 30 days, Highest in 20 months

In September, the number of people employed climbed by 8.5 million to 406.2 million, the highest level since March 2020.
Story first published: Wednesday, October 6, 2021, 21:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X