కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా 30 శాతం ఆదాయాలు కోల్పోతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో(NSE)లో నమోదైన టాప్ 100 కంపెనీల్లో 27 తమ ఉద్యోగుల వేతనాలు భరించలేవట. ఈ మేరకు డెలాయిట్ సర్వేలో వెల్లడైంది. కంపెనీల ఆదాయం తగ్గితే ఉద్యోగుల వేతనాల్లో కోత ఉండవచ్చునని పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాల్లో వినియోగం తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు ఉద్యోగులకు చెల్లించే పరిస్థితులు ఉన్నాయా లేదా అని లెక్కలు వేసుకోవాల్సి వస్తోందని తెలిపింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఎన్ఎస్ఈలోని టాప్ 100 కంపెనీలపై డెలాయిట్ సర్వే నిర్వహించింది.

వేతనాలు చెల్లించలేక.. ఇదీ కంపెనీల పరిస్థితి
'కంపెనీల రెవెన్యూ 30 శాతం తగ్గితే వీటిలో 27 కంపెనీలు లాభాల నుండి వేతన బిల్లులను భరించలేని పరిస్థితులు. వాస్తవానికి ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. ఆదాయం తగ్గడంతో పాటు నగదు నిల్వల రూపంలో నిలిచిపోయింది. ఇది కూడా మరో కారణం. వేతనాలు చెల్లించేందుకు నగదు నిల్వలు ఉపయోగించడం లేదా స్వల్పకాలిక రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి' అని ఈ సర్వే తెలిపింది.

శాలరీలు భరించే స్థోమత 3-6 నెలలు
డెలాయిట్ కంపెనీ పేర్లను వెల్లడించలేదు. ఈ 27 కంపెనీల్లో 11 కంపెనీల రుణం, ఈక్విటీ నిష్పత్తి 1 కంటే తక్కువగా ఉంది. అంటే ఈ కంపెనీలు వేతనాలు చెల్లించేందుకు రుణాలు తీసుకోవడం కూడా కష్టమే. అన్ని కంపెనీల సగటున 5.5 నెలల వరకు కార్యకలాపాలు, వడ్డీలు, శాలరీలు భరించేంత నగదు, నగదు సమాన నిల్వలు కలిగి ఉన్నాయి. 20 కంపెనీలకు మాత్రం మూడు నెలల కంటే తక్కువకే నగదు నిల్వలు ఉన్నాయి.

100 కంపెనీల సగటు 3.25 శాతం
ఇలాంటి పరిస్థితుల్లో వేతన కోతలు తప్పవని ఈ సర్వేలో వెల్లడైంది. కంపెనీలు శాలరీ చెల్లించే సామర్థ్యాన్ని కంపన్సేషన్ కాస్ట్ కవరేజీ రేషియో (CCCR) ద్వారా లెక్కలు వేసుకోవాలని డెలాయిట్ సూచించింది. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే చెల్లించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఆదాయంలో 30 శాతం క్షీణత కనిపిస్తే మాత్రం 1 కంటే తక్కువ CCCR ఉన్న 27 కంపెనీలకు సగటున 4 నెలల వరకు ఖర్చులు భరించే శక్తి ఉంది. వంద కంపెనీల సగటు 3.25 శాతంగా ఉంది. 60 శాతం కంపెనీలకు CCCR 4గా ఉందిత.

ఏ రంగానికి ఎంత సామర్థ్యం
రంగాలవారీగా ఇంధన రంగానికి అధికంగా 6.31 CCCR, సేవల రంగానికి 5.6, ఐటీ కంపెనీలకు 1.51గా ఉంది. టాప్ 100 కంపెనీల్లో 43 కంపెనీలు 3 కంటే తక్కువ, ఆరు కంపెనీలు 10 కంటే ఎక్కువ కలిగి ఉన్నాయి. ఈ ఆరు కంపెనీల ఆస్తులు భారీగా ఉన్నాయి. సేవా రంగంలో ప్రభుత్వ రంగాన్ని పక్కన పెడితే 3.4గా ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications