For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

mobile games 2021: ఈ ఏడాది మొబైల్ గేమ్స్‌ఫై భారీ ఖర్చు స్టార్ట్

|

గూగుల్ ప్లే, ఆపిల్ యాప్ స్టోర్స్ ద్వారా 2021లో అత్యధికంగా మొబైల్ గేమ్స్ డౌన్ లోడ్ చేశారు. గత కొన్నేళ్లుగా మొబైల్ గేమ్స్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అయితే రెవెన్యూ మాత్రం అంతస్థాయిలో ఉండేది కాదు. ఇప్పుడు మొబైల్ గేమ్స్ డౌన్‌లోడ్‌తో పాటు మనీ స్పెండింగ్ కూడా పెరుగుతోంది. 2020 నుండి 2021 మధ్య పెను మార్పు వచ్చిందని, ప్రజలు ఎగ్జిస్టింగ్ గేమ్స్ పైన ఎక్కువ ఖర్చు చేయడం ప్రారంభించారని క్రాఫ్టన్ ఇంక్ హెడ్ అనుజ్ టాండన్ అన్నారు. 2020లో వినియోగదారు ఎంగేజ్‌మెంట్, యూజర్ బేస్డ్ భారీ వృద్ధి నమోదు చేసిందని, ఇది స్థిరంగా వృద్ధి నమోదు చేస్తుందని చెప్పారు. 2022లో యాప్ కొనుగోళ్లకు సంబంధించి మరింత మోనిటైజేషన్ కనిపిస్తుందని టాండన్ అన్నారు.

100 మిలియన్ డాలర్లకు పైగా

100 మిలియన్ డాలర్లకు పైగా

యాప్స్ కొనుగోళ్ల ద్వారా భారత్‌లో కనీసం నాలుగు నుండి ఐదు యాప్స్ 100 మిలియన్ డాలర్లకు పైగా ఆర్జిస్తున్నాయని చెబుతున్నారు. ఇది దేశంలో అభివృద్ధి చెందుతున్న యాప్ కొనుగోలుకు నిదర్శనమని అంటున్నారు. ఇందులో రియల్ మనీ గేమ్స్ లేవని చెబుతున్నారు. గేమింగ్ అండ్ ఇంటరాక్టివ్ మీడియా వెంచర్ ఫండ్ లుమికాయ్ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్ రెడ్‌సీర్ ఇటీవలి నివేదిక ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పరిశ్రమ ఆదాయంలో రియల్ మనీ గేమ్స్ దాదాపు 51 శాతం 1.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

క్రమంగా పెరుగుదల

క్రమంగా పెరుగుదల

2018-19 ఆర్థిక సంవత్సరంలో 0.8 బిలియన్ డాలర్లు, FY20లో 1.8 బిలియన్ డాలర్లు, FY21లో 2.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, FY26 నాటికి 7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో ఆర్ఎంజీ 53 శాతం, యాప్ పర్చేజ్ ద్వారా 31 శాతం, యాడ్ రెవెన్యూ 11 శాతం, ఇతర ఆదాయం 5 శాతంగా ఉండవచ్చు.

ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్

ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్

భారత్‌లో వీడియో గేమ్ మార్కెట్ క్రమంగా వృద్ధి నమోదు చేస్తుందని అంచనా.

- 2021లో పీసీ అండ్ మొబైల్ గేమింగ్ రెవెన్యూ 2021లో 534.1 మిలియన్లు, 2025 నాటికి 1.491 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.

- పీసీ అండ్ మొబైల్ గేమర్స్ 2021లో 339.9 మిలియన్ డాలర్లు, 2025 నాటికి 529 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

- గేమర్స్‌లో భారత్, ఆసియాను పరిశీలిస్తే ప్రస్తుతం చైనాలో 50 శాతం, ఇండియాలో 24 శాతం, మిగతా ఏసియా ప్రాంతంలో 26 శాతం ఉంది.

- ఇక గేమర్స్‌లో ఇండియా, గ్లోబల్ విషయానికి వస్తే చైనా 1 స్థానంలో, భారత్ 2వ స్థానంలో ఉంది.

- ఆసియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ పరంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. ఆర్పులోను ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్‌గా ఉంది.

English summary

mobile games 2021: ఈ ఏడాది మొబైల్ గేమ్స్‌ఫై భారీ ఖర్చు స్టార్ట్ | 2021 was the year people in India started spending money on mobile games

For years, India has been one of the biggest markets for mobile game downloads on Google Play and Apple App Store, but revenue didn’t match the pace. That is now beginning to change.
Story first published: Friday, December 24, 2021, 20:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X