For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంపన్న అమెరికన్లను మించిపోయిన చైనా

|

వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచంలో అగ్రదేశం అంటే అమెరికా గుర్తుకు వస్తుంది. దీనిని పెద్దన్న అని సంబోధిస్తారు. ఈ దేశంలో ఉన్నంతమంది సూపర్ రిచ్ మరే దేశంలోను ఉండరు. కానీ ఈసారి అగ్రదేశాన్ని చైనా దాటేసింది. అత్యధిక మిలియనీర్లు ఉన్న దేశాల్లో ఇప్పటి వరకు అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు చైనా దానిని వెనక్కి నెట్టింది. ఈ మేరకు స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్ నివేదిక సోమవారం తెలిపింది. 2019 హాఫ్ ఇయర్‌కు గాను ఈ రిపోర్ట్ వచ్చింది.

ఈ నివేదిక ప్రకారం 100 మిలియన్ల చైనీయుల వద్ద 10 శాతం సంపదన ఉంది. అదే సమయంలో అమెరికాలో 99 మిలియన్లు ఉంది. గత కొన్నాళ్లుగా అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఓ వైపు గత 12 నెలలుగా వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రెండు దేశాలు కూడా వెల్త్ క్రియేషన్లో ముందున్నాయి. అమెరికా, చైనాలు వరుసగా 3.8 ట్రిలియన్ డాలర్లు, 1.9 ట్రిలియన్ డాలర్లతో ఉన్నట్లుగా ఓ నివేదిక తెలిపింది.

మీకిది తెలుసా? మీ సంపదన రెండింతలు అయింది, ఒక్కో వ్యక్తి వద్ద రూ.10.5 లక్షలుమీకిది తెలుసా? మీ సంపదన రెండింతలు అయింది, ఒక్కో వ్యక్తి వద్ద రూ.10.5 లక్షలు

Rich Chinese outnumber wealthy Americans for first time

ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్ల ర్యాంకులు 1.1 మిలియన్ నుంచి 46.8 మిలియన్లకు పెరిగింది. వీరి వద్ద 158.3 ట్రిలియన్ డాలర్ల నెట్ వర్త్ ఉంది. వీరి వద్ద ఉన్న సంపద అంతర్జాతీయంగా చూసుకుంటే 44 శాతం. ప్రపంచవ్యాప్తంగా 55,920 మంది అడల్ట్స్ వద్ద 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉంది. 4,830 కంటే ఎక్కువ మంది వద్ద 500 మిలియన్ డాలర్లకు పైగా ఉంది.

ప్రపంచ సంపద వృద్ధి అంచనా గత ఏడాదిలో 2.6 శాతం పెరిగింది. ఇది రానున్న అయిదేళ్లలో 27 శాతం పెరుగుతుందని అంచనా. అంటే 2024 నాటికి 459 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. అలాగే మిలియనీర్ల సంఖ్య 63 మిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది. మిలియనీర్లు కాకుండా మిగతా 90 శాతం ప్రజల వద్ద 18 శాతం సంపద ఉంది. 2000లో ఇది కేవలం 11 శాతం. ఇప్పుడు ఏడు శాతం పెరిగింది.

English summary

సంపన్న అమెరికన్లను మించిపోయిన చైనా | Rich Chinese outnumber wealthy Americans for first time

The number of rich Chinese has surpassed the count of wealthy Americans for the first time as both countries keep churning out millionaires, a study by Credit Suisse showed.
Story first published: Tuesday, October 22, 2019, 13:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X