For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చరిత్రలో తొలిసారి: తేజాస్ రైలు ఆలస్యం, ప్రయాణీకులకు రూ.1.62 లక్షల పరిహారం

|

ఢిల్లీ: తొలి ప్రయివేటు రైలు తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకతలెన్నో. ముఖ్యంగా ఈ రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణీకులకు పరిహారం చెల్లిస్తారు. ఇందులో భాగంగా తొలిసారి ఈ రైలు రెండు రోజుల క్రితం ఆలస్యంగా నడిచింది. తేజాస్ రైలు ఆలస్యంగా నడిస్తే పరిహారం చెల్లిస్తామని చెప్పిన IRCTC ఇప్పుడు దానిని నిలబెట్టుకోనుంది. ఆలస్యంగా నడిచినందుకు గాను లక్షన్నర రూపాయలకు పైగా ప్రయాణీకులకు చెల్లించేందుకు సిద్ధమైంది.

ఆలస్యమైనా, ఇంట్లో దొంగలు పడ్డా నష్టపరిహారం... ప్రైవేట్ రైలు బంపరాఫర్లు ఇవే..ఆలస్యమైనా, ఇంట్లో దొంగలు పడ్డా నష్టపరిహారం... ప్రైవేట్ రైలు బంపరాఫర్లు ఇవే..

రైళ్ల చరిత్రలో తొలిసారి...

రైళ్ల చరిత్రలో తొలిసారి...

అక్టోబర్ 19వ తేదీన తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో 950 మంది ప్రయాణీకులకు రూ.1.62 లక్షల పరిహారం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అందిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లు ఆలస్యమైతే పరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే తొలిసారి.

ఏం జరిగింది?

ఏం జరిగింది?

19వ తేదీన లక్నో నుంచి ఉదయం గం.9.55 నిమిషాలకు బయలుదేరిన తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీకి 12.25 నిమిషాలకు చేరుకోవాల్సి ఉంది. కానీ కాన్పూర్ ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రాకపోకలు ఆలస్యం అయ్యాయి. దీంతో తేజాస్ మూడు గంటలకు పైగా ఆలస్యమై మధ్యాహ్నం గం.3.40 నిమిషాలకు చేరుకుంది.

అంతేకాదు, గం.3.35 నిమిషాలకు తిరిగి లక్నోకు బయలుదేరాల్సిన రైలు గం.5.30 నిమిషాలకు బయలుదేరింది. రాత్రి గం.10.05 నిమిషాలకు చేరుకోవాల్సిన రైలు రాత్రి గం.11.30 నిమిషాలకు గానీ చేరుకోలేదు. దీంతో లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లిన 450 మంది ప్రయాణీకులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున, ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లిన 500 మందికి ఒక్కొక్కరికి రూ.100 చొప్పున చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇలా పరిహారం పొందవచ్చు..

ఇలా పరిహారం పొందవచ్చు..

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు టిక్కెట్ పైన ఇచ్చిన బీమా సంస్థ లింక్ ద్వారా పరిహారం పొందవచ్చునని అధికారులు తెలిపారు. కాన్పూర్‌లో రైలు పట్టాలు తప్పడంతో ఆలస్యం జరిగినట్లు తెలిపారు. తేజాస్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 6వ తేదీ నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించింది. అప్పటి నుంచి అక్టోబర్ 19, 20 తేదీల్లో మాత్రమే ఆలస్యంగా నడిచినట్లు తెలిపారు.

ఆలస్యాన్ని బట్టి పరిహారం..

ఆలస్యాన్ని బట్టి పరిహారం..

19న గంటల కొద్ది ఆలస్యమైనా, 20వ తేదీన మాత్రం కేవలం 24 నిమిషాలు మాత్రమే ఆలస్యమైంది. రెండో ట్రిప్ సమయానికి చేరుకుంది. IRCTC నిబంధనల ప్రకారం రైలు నిర్దేశిత సమయాని కంటే గంట ఆలస్యమైతే ఒక్కో ప్రయాణీకుడికి రూ.100 చొప్పున జరిమానా చెల్లిస్తారు. రెండు గంటలకు పైగా ఆలస్యమైతే రూ.250 చెల్లిస్తారు.

English summary

చరిత్రలో తొలిసారి: తేజాస్ రైలు ఆలస్యం, ప్రయాణీకులకు రూ.1.62 లక్షల పరిహారం | IRCTC to pay around Rs 1.62 lakh as compensation for late running of Tejas Express

A delay of more than three hours in the running of Delhi-Lucknow Tejas Express on October 19 has cost IRCTC around Rs 1.62 lakh which the railway subsidiary will pay through its insurance companies as compensation to around 950 passengers, a first in the history of Indian Railways, officials said on Monday.
Story first published: Monday, October 21, 2019, 17:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X