For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగు సహా 6 ప్రాంతీయ భాషల్లో HDFC, హోంలోన్ బయ్యర్స్ కోసం...

|

ముంబై: ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంకు దిగ్గజం HDFC (హౌసింగ్ ఫైనాన్స్) తమ వెబ్ సైట్‌ను తెలుగు సహా ఆరు భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ భాషల్లోను వెబ్ సైట్లో సమాచారం దొరుకుతుంది. దేశంలో డిజిటల్ ప్లాట్ ఫామ్‌లలో ఎక్కువగా ఇంగ్లీష్‌ను వినియోగిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.

కంటెంట్‌ను తెలుగుతో సహా ఆరు భారతీయ భాషల్లో అందిస్తున్న ఏకైక కార్పోరేట్ ఫైనాన్షియల్ సెక్టార్ హెచ్‌డీఎఫ్‌సీ కావడం గమనార్హం. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. వాటికి అనుగుణంగా ప్రాంతీయభాష వినియోగదారులు కూడా పెరుగుతున్నారు. ముఖ్యంగా చిన్న పట్టణం వంటి ప్రాంతాల్లో స్థానిక భాషల్లో సంబంధిత సమాచారం కోసం వెతుకుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని హెచ్‌డీఎఫ్‌సీ ఆరు భాషల్లో తీసుకు వచ్చింది.

HDFC localises website in six Indian languages

లాంగ్వేజ్ లోకలైజేషన్ టెక్నాలజీలో తాము కూడా పాలుపంచుకున్నందుకు ఆనందంగా ఉందని HDFC లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సూద్ కర్నాడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాను ప్రోత్సహిస్తున్న తరుణంలో.. తమ కస్టమర్లకు వారికి అవసరమైన భాషల్లో డిజిటల్ కంటెంటును ఇవ్వడం ద్వారా డిజిటల్ ఇండియాను ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలోని అన్ని మూలాల్లోకి చేరుకోవడానికి తమ ప్రాంతీయ భాషా వెబ్‌సైట్లు ఉపకరిస్తాయన్నారు.

చదవండి: మోడీ అదుర్స్: రోజుకు రూ.1 కంటే తక్కువ.. రూ.2 లక్షల ప్రయోజనం

మారిన ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ సదుపాయాల్ని, కంటెంట్లను తమ కంపెనీ వినియోగించుకుంటోందన్నారు. ఇప్పటికే తమ కంపెనీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాలకు రుణాల కేటాయింపులో అగ్ర స్థానంలో నిలిచిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి పురస్కారాన్ని అందుకుందన్నారు. అలాగే మధ్యతరగతి ఆదాయ వర్గాల సేవలో రెండో స్థానంలో ఉందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) ద్వారా మొదటిసారి గృహ రుణ సదుపాయం పొందిన లబ్ధిదారులకు గత మే నెలలో ఒక్కొక్కరికి 1.1 లక్షల వంతున మొత్తం రూ. 2,345 కోట్ల సబ్సిడీని పంపిణీ చేసినట్లు చెప్పారు.

ఇంగ్లీష్ మాధ్యమానికి ఇది అదనపు సౌకర్యమని, గృహ కొనుగోలుదారులకు అందుకు సంబంధించిన రుణ సదుపాయాలపై సమాచారం అందుబాటులోకి తీసుకు రావాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని HDFC ఓ ప్రకటనలో తెలిపింది. ఇక నుంచి ఇంగ్లీషుతో పాటు హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ఫైనాన్స్ కంపెనీ వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

English summary

తెలుగు సహా 6 ప్రాంతీయ భాషల్లో HDFC, హోంలోన్ బయ్యర్స్ కోసం... | HDFC localises website in six Indian languages

Housing finance major HDFC Ltd on Sunday said it has localised its website in six Indian languages, in addition to English, to help homebuyers get home loan related information more effectively.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X