For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ అదుర్స్: రోజుకు రూ.1 కంటే తక్కువ.. రూ.2 లక్షల ప్రయోజనం

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్షా యోజన (PMSBY) పేరుతో ఇన్సురెన్స్ స్కీమ్స్ అందిస్తోంది. వీటికి ఏడాది కాలపరిమితి నిర్ణయించింది. ప్రతి ఏడాది రెన్యూవల్ చేయించుకుంటే ఈ పథకానికి అర్హులు. ఇందులో చేరినవారికి అనుకోనివిధంగా ఏదైనా జరిగితే రూ.2,00,000 వస్తాయి.

ప్లాస్టిక్ బదులు.. వెదురు నీళ్ల బాటిల్స్, ధర ఎంతో తెలుసా?ప్లాస్టిక్ బదులు.. వెదురు నీళ్ల బాటిల్స్, ధర ఎంతో తెలుసా?

రూ.330 ప్రీమియం.. రూ.2 లక్షల కవరేజ్

రూ.330 ప్రీమియం.. రూ.2 లక్షల కవరేజ్

PMJJBY వన్ ఇయర్ టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ. ఏడాదికి రూ.330 ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు రూ.1 కంటే తక్కువ. బీమా కవరేజి రూ.2 లక్షలు. ఈ పాలసీ తీసుకున్న వారు మృతి చెందితే పాలసీ మొత్తం నామినీకే వస్తుంది. ఇతర ప్రయోజనాలు ఉండవు. బ్యాంకులలో ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకులు ఎల్ఐసీ తరహా ఇతర ప్రయివేటు లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలు ఈ పాలసీని అందిస్తున్నాయి.

పాలసీ రెన్యూవల్

పాలసీ రెన్యూవల్

ఈ పాలసీని 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు తీసుకోవచ్ుచ. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు పాలసీని తీసుకోవచ్చు. ప్రీమియం మొత్తం ఆటోమేటిక్‌గా బ్యాంకు అకౌంట్ నుంచి కట్ అవుతుంది. పాలసీ గడువు జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉంటుంది. తర్వాత పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి. ప్రీమియం మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాలి. పాలసీ హోల్డర్ ఈ స్కీంలో ఎప్పుడైనా చేరవచ్చు, ఎప్పుడైనా వెలుపలికి రావొచ్చు.

నామినీ అకౌంట్లోకి డబ్బులు

నామినీ అకౌంట్లోకి డబ్బులు

ఒక వ్యక్తి ఒక బ్యాంకు అకౌంట్ ద్వారా ఒక పాలసీని మాత్రం తీసుకోగలడు. పాలసీదారు మృతి చెందితే డెత్ సర్టిఫికెట్‌ను తీసుకొని బ్యాంకుకు వెళ్లి బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పుడు నామినీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. 50 ఏళ్ల లోపు పాలసీని పొందినట్లయితే అతను లేదా ఆమె వార్షిక ప్రీమియం చెల్లిస్తూ 55 ఏళ్ల వరకు రిస్క్ కవరేజీని పొందవచ్చు.

రూ.330లో ఇలా...

రూ.330లో ఇలా...

ఈ స్కీంను లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్, ఇతర ప్రయివేటు ఇన్సురెన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. రూ.330 ప్రీమియంలో రూ.289 ఇన్సూరర్‌కు, రూ.30 ఖర్చుల రీయింబర్సుమెంట్ కింద ఏజెంట్ లేదా బ్యాంకుకు వెళ్తుంది. రూ.11 అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రీయింబర్సుమెంట్ కింద పార్టిసిపేటింగ్ బ్యాంకులకు వెళ్తాయి. PMJJBY కింద దరఖాస్తు అనంతరం 45 రోజులకు రిస్క్ కవర్ వర్తిస్తుంది.

ప్రీమియం అందుబాటులో ఉన్న బ్యాంకులు

ప్రీమియం అందుబాటులో ఉన్న బ్యాంకులు

కొటక్ మహీంద్రా, యస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)

PMSBY పథకంలో 18 నుంచి 70 ఏళ్ల వయస్సు వారు ఎవరైనా చేరవచ్చు. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. ఈ బీమా చేయించుకున్న వారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైన రూ.2 లక్షలు అందిస్తారు. పాక్షిక అంగవైకల్యానికి రూ.1 లక్, రూపాయలు అందిస్తారు.

English summary

మోడీ అదుర్స్: రోజుకు రూ.1 కంటే తక్కువ.. రూ.2 లక్షల ప్రయోజనం | Insurance policy launched by PM Modi offers ₹2 lakh cover at less than Re 1/day

Launched by Narendra Modi government, Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) is a one-year term life insurance policy. This scheme offers a coverage of ₹2 lakh with a yearly premium of ₹330.
Story first published: Sunday, October 20, 2019, 11:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X