న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హయాంలోనే పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల (PSB)పరిస్థితి దారుణంగా దిగజారిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. అప్పుడు వాళ్ళు సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తూ, ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థకు జీవం పోసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ మేరకు ఆమె అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ఆర్థిక విధానంపై కొద్ది రోజులుగా మన్మోహన్ సింగ్, రఘురాంలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు.

దారుణం.. ఫోన్ కాల్ ద్వారా రుణాలు
ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మొదటి అయిదేళ్లలో ఆర్థికాభివృద్ధి చర్యలు ఏమీ చేపట్టలేదని విమర్శలు గుప్పించిన రఘురాం రాజన్ వ్యాఖ్యలను ఖండించారు. అసలు బ్యాంకులు విపరీతంగా రుణాలు మంజూరు చేసిందే ఆయన హయాంలో అన్నారు. కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో కేవలం ఫోన్ కాల్స్ ఆధారంగా అప్పులు ఇచ్చారని ఆరోపించారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ మన్మోహన్, రఘురాం రాజన్‌ల హయాంలో సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఇప్పుడు నిధుల కోసం ప్రభుత్వంవైపు చూడాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. అధికారం కొంతమంది నాయకుల వద్దే కేంద్రీకృతమై ఉందన్న రాజన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

అలాంటి రుణాల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి
ప్రభుత్వరంగ బ్యాంకులకు లైఫ్ లైన్ ఇవ్వడం ప్రస్తుతం తమ ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ ఎంతో ఉత్సాహంగా ఉన్న సమయంలో భారత్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్‌గా రాజన్ నియమితులయ్యారని, ఇందుకు ఆయనను తాను గౌరవిస్తానని చెప్పారు. కానీ ఆయన హయాంలో అధిక రుణాలతో బ్యాంకులు సతమతమయ్యాయన్నారు. కేవలం కొందరు నేతల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా రుణాలు మంజూరు చేశారని, ఇలాంటి దారుణాల నేపథ్యంలో బ్యాంకులు ఇప్పుడు ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి వచ్చిందన్నారు.

అప్పుడు బ్యాంకుల పరిస్థితి ఏమిటో చెప్పండి..
నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హయంలో డాక్టర్ సింగ్ భారత్ పట్ల సరైన విజన్‌తో ఉండాలని డాక్టర్ రాజన్ కోరుకుని ఉండాలని ఆమె వ్యాఖ్యానించగా సభలో నవ్వులు విరబూశాయి.తాను ఎవరినీ ఎగతాళి చేసేందుకు మాట్లాడటం లేదని, కానీ అలాగే తనకు వారి పట్ల గౌరవం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అదే సమయంలో రఘురాం రాజన్, మన్మోహన్ సింగ్ నాటి పరిస్థితుల కంటే బ్యాంకులు ఇప్పుడు బాగానే ఉన్నాయన్నారు. మరీ అంత వరస్ట్ పరిస్థితుల్లో లేవన్నారు. బ్యాంకుల సమస్యలు ఎప్పుడైనా మీరు పట్టించుకున్నారా, ఈ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. ప్రస్తుతం గురించి మాట్లాడుతున్న రాజన్... తన హయాంలో కూడా ఎలా ఉందో ప్రజల ముందు ఉంచాలని అభిప్రాయపడ్డారు.

బ్యాడ్ లోన్స్ ఇలా...
RBI నివేదిక ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల బ్యాడ్ లోన్లు 2011-12లో రూ.9,190 కోట్లు ఉంది. 2013-14 సమయానికి ఇవి రూ.2.16 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆ తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 2014లో అధికారంలోకి వచ్చింది. రఘురాం రాజన్ 4 సెప్టెంబర్ 2013 నుంచి 4 సెప్టెంబర్ 2016 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నారు. అంతకుముందు 10 ఆగస్ట్ 2012 నుంచి 4 సెప్టెంబర్ 2013వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్‌గా ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications