For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోడ్ పతి పన్ను చెల్లింపుదారులు ఎంత పెరిగారో తెలుసా?

|

కోట్లాది రూపాయలు సంపాదిస్తారు కానీ పన్ను చెల్లించమంటే మొహం చాటేస్తారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారు ఆస్తులు కూడబెట్టు కుంటున్నారు తప్ప పన్ను చెల్లించడం లేదు. అయితే ఇలాంటి వారి ఆట కట్టించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు ఫలిస్తున్నాయి. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న వారిలో పన్ను చెల్లించే వారు పెరుగుతున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ వెల్లడించిన తాజా గణాంకాల ద్వారా ఈ విషయం స్పష్టం అవుతోంది.

20 శాతం పెరిగారు

* 2018-19 అసెస్మెంట్ సంవత్సరంలో కరోడ్ పతి పన్ను చెల్లింపుదారుల సంఖ్య 20 శాతం పెరిగి 97,689 కి చేరుకుంది.

* 2017-18 సంవత్సరంలో పన్ను చెల్లించే ఆదాయం కోటి రూపాయలకు పైగా ఉన్న వారి సంఖ్య 81,344గా ఉంది.

* 2018-19 అసెస్మెంట్ సంవత్సరంలో రూ.500 కోట్లకు పైగా స్థూల ఆదాయాన్ని చూపిన వ్యక్తులు ముగ్గురున్నారు. క్రితం సంవత్సరంలో కేవలం ఒక్కరే ఉన్నారు.

* దాదాపు 13.74 లక్షల మంది స్వల్పకాలిక మూలధన పన్ను చెల్లించారు. ఈ మొత్తం 23,000 కోట్ల రూపాయలుగా ఉంది.

IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?

Number of crorepati taxpayers up 20% to 97,689 in 2018-19

* 4.24 లక్షల మంది 67,047 కోట్ల రూపాయల దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ టాక్స్ చెల్లించారు.

* పన్ను చెల్లింపు విషయానికి వస్తే రూ. కోటి లేదా అంతకన్నా ఎక్కువ పన్ను చెల్లించిన వ్యక్తులు 16,700 కు పైగా ఉన్నారు. క్రితం సంవత్సరంలో వీరి సంఖ్య దాదాపు 14,000 గా ఉంది.

* కార్పొరేట్, సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, వ్యక్తులు కలిపితే కోటికిపైగా పన్ను చెల్లింపు ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2017-18 అసెస్మెంట్ సంవత్సరంతో పోల్చితే 19 శాతం పెరిగి దాదాపు 1.67 లక్షలకు చేరుకుంది.

* ఈ ఏడాది ఆగష్టు 15 నాటికి 5.87 కోట్లకు పైగా ఆదాయ పన్ను రిటర్న్ లు దాఖలయ్యాయి.

* రిటర్న్ లు దాఖలు చేసిన వారిలో 5.52 కోట్ల మంది వ్యక్తులు, 11.3 లక్షల హిందూ అవిభాజ్య కుటుంబాలు, 12.69 లక్షల సంస్థలు, 8.41 లక్షల కంపెనీలు ఉన్నాయి.

సున్నా పన్ను

* వ్యాపారాలు సహా అన్ని కేటగిరీల్లో దాదాపు 2.37 కోట్ల మంది అస్సెస్సీలు పన్ను చెల్లింపు సున్నాగా ఉంది. దీనర్థం దాదాపు 40 శాతం మంది అస్సెస్సీలు నయా పైసా పన్ను చెల్లించలేదన్న మాట. 99 కంపెనీలు 1.69 లక్షల కోట్లకు పైగా పన్ను చెల్లించాయి. ఏడాదిలో వసూలైన పన్నులో ఈ మొత్తమే 21 శాతంగా ఉంది.

* కంపెనీల విషయానికి వస్తే 2018-19 అసెస్మెంట్ సంవత్సరంలో 8.41 లక్షలకు పైగా రిటర్న్ లను ఫైల్ చేశాయి. వీటి స్థూల ఆదాయం రూ.14.73 లక్షల కోట్లుగా ఉంది.
* 526 కంపెనీలు రూ.100 కోట్లు అంతకు మించి పన్ను చెల్లించాయి.
* 3.73 లక్షల కంపెనీలు ఎలాంటి పన్ను చెల్లించలేదు.

English summary

కరోడ్ పతి పన్ను చెల్లింపుదారులు ఎంత పెరిగారో తెలుసా? | Number of crorepati taxpayers up 20% to 97,689 in 2018-19

The number of crorepati taxpayers shot up 20 per cent to 97,689 during assessment year (AY) 2018-19, as per tax returns data released by the revenue department. The number such individuals having taxable income of over Rs 1 crore stood at 81,344 during AY 2017-18.
Story first published: Sunday, October 13, 2019, 11:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X