For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్‌గా ఉన్నారా: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇవి మారిపోయాయ్!

|

సాధారణంగా బడ్జెట్‌లోని మార్పులు చేర్పులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2019-20 పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూలై నెలలో ప్రవేశపెట్టారు. దీంతో పలు మార్పులు చేర్పులు సెప్టెంబర్ 1, 2019నుంచి అమలులోకి వస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్, ఐఆర్‌సీటీసీ సర్వీస్ ఛార్జ్ నుంచి ట్యాక్స్ వరకు పలు మార్పులు 1-8-2019 నుంచి చోటు చేసుకోనున్నాయి...

<strong>మీ ఇన్‌కం ట్యాక్స్ మారనుందా? పన్ను కట్టే వారికి భారీ ఊరట?</strong>మీ ఇన్‌కం ట్యాక్స్ మారనుందా? పన్ను కట్టే వారికి భారీ ఊరట?

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే తలనొప్పి

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే తలనొప్పి

ఆగస్ట్ 31వ తేదీలోపు మీరు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా... అయితే ఫరవాలేదు. పైల్ చేయకుంటే మాత్రం రూ.5,000 నుంచి రూ.10,000 వరకు జరిమానాతో పైల్ చేయవలసి ఉంటుంది. అంతేకాదు రీఫండ్ పైన ఇంట్రెస్ట్ పొందలేరు... మీ నష్టాన్ని క్యారీఫార్వార్డ్ చేసుకోలేరు. ముఖ్యంగా బడ్జెట్‌లో ఐటీ సంబంధ మార్పులు, ఇతర మార్పులు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రావడం పెద్ద తలనొప్పిగా మారుతుంది.

TDSలో ఇవి అదనం

TDSలో ఇవి అదనం

ఇక నుంచి మీరు ఇంటిని కొనుగోలు చేస్తే అదనపు సౌకర్యాలకు సంబంధించిన అంశాలు పొందుపర్చాలి. క్లబ్ మెంబర్‌షిప్ ఫీజు, కారు పార్కింగ్ ఫీజు, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ ఫీజు వంటి వివిధ సదుపాయాల కోసం చేసిన చెల్లింపును చేర్చవలసి ఉంటుంది. దీంతో ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు టీడీఎస్ మొత్తం పెరుగుతుంది. గతంలో ఆస్తి కొనుగోలుపై మాత్రమే పన్ను డిడక్షన్ ఉంది. ఇతర క్లబ్ సభ్యత్వం వంటి సదుపాయాలకు టీడీఎస్ నుంచి మినహాయించారు. ఆదాయపన్ను చట్టంలో స్థిర ఆస్తి పరిశీలన సరిగ్గా నిర్వచించబడలేదని, ఆస్తి విలువ రూ.50 లక్షలకు మించితే టీడీఎస్ ఒక శాతం తగ్గిస్తారని చెబుతున్నారు.

వెడ్డింగ్ ఫంక్షన్స్ వంటి కాంట్రాక్ట్స్ లేదా ప్రొఫెషనల్ పేమెంట్స్ రూ.50 లక్షలు దాటితే 5 శాతం టీడీఎస్ డిడక్ట్ అవుతుంది.

రూ.1 కోటికి పైగా విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్

రూ.1 కోటికి పైగా విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్

ఇక నుంచి రూ.1 కోటికి పైగా మొత్తాన్ని బ్యాంకు నుంచి విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. బ్యాంకు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీస్ నుంచి తీస్తే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి టీడీఎస్ వర్తిస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహిస్తూ, క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ను తగ్గించేందుకు దీనిని అమలు చేస్తున్నారు. ఇందుకోసం కొత్త సెక్షన్ 194N ను పొందుపర్చారు.

పాన్ - ఆధార్ లింక్ చేయకుంటే...

పాన్ - ఆధార్ లింక్ చేయకుంటే...

పాన్ కార్డు - ఆధార్ కార్డును లింక్ చేయకుంటే ఆదాయపన్ను శాఖ మీకు కొత్త పాన్ కార్డును ఇష్యూ చేయవచ్చు. పాత పాన్ కార్డులు రద్దు చేయబడతాయి. కాబట్టి లింక్ చేసుకోవడం మంచిది.

IRCTC టిక్కెట్స్ బుకింగ్స్

IRCTC టిక్కెట్స్ బుకింగ్స్

ఇండియన్ రైల్వే ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ పోర్టల్ ద్వారా ఇక నుంచి సర్వీస్ చార్జీ చెల్లింపు విధానాన్ని తిరిగి ప్రారంభించారు.

ట్రాఫిక్ చలాన్లు

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త వాహన చట్టం నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. అయితే తెలంగాణ, బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు దీనిని ప్రస్తుతం అమలు చేయడం లేదు. ఈ కొత్త వాహన చట్టం అమలు చేసిన రాష్ట్రాల్లో భారీ ఫైన్ వసూలు చేస్తారు.

ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త...

ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త...

ఇప్పటి వరకు బ్యాంకులు రూ.50వేల ట్రాన్సాక్షన్స్ దాటిన తమ కస్టమర్ల వివరాలను ఆదాయపన్ను శాఖకు ఇవ్వాలి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పన్ను రాబడిని అంచనా వేసేందుకు ఐటీ శాఖ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ వివరాలను కూడా బ్యాంకులను కోరవచ్చు.

English summary

అలర్ట్‌గా ఉన్నారా: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇవి మారిపోయాయ్! | Things that will change from september 1

Income tax related changes announced in the Budget usually come into effect from April 1. However, since the full Budget for FY 2019-20 was presented in July this year after the general elections, there are certain tax changes that will come into effect from September 1, 2019.
Story first published: Monday, September 2, 2019, 9:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X