For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైళ్లో ప్రయాణిస్తున్నారా.. అక్టోబర్ 2 నుంచి ఇది గుర్తుంచుకోండి

|

న్యూఢిల్లీ: రైళ్లో ప్రయాణిస్తున్నారా? అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే అన్ని జోన్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండో తేదీ నుంచి దీనిని అమలులోకి తేనున్నారు. పర్యావరణంపై ప్లాస్టిక్ వినియోగం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేయాలని నిర్ణయించింది.

<strong>ఆదాయపన్నును రద్దు చేయండి: మోడీకి బీజేపీ ఎంపీ!</strong>ఆదాయపన్నును రద్దు చేయండి: మోడీకి బీజేపీ ఎంపీ!

360 స్టేషన్లలో ప్లాస్టిక్ వాటర్ క్రషింగ్ యంత్రాలు

360 స్టేషన్లలో ప్లాస్టిక్ వాటర్ క్రషింగ్ యంత్రాలు

తొలి దశలో రైళ్లలోని ప్రయాణీకుల నుంచి, బోగీలలో పడి ఉన్న వాటర్ బాటిల్స్ సేకరించి సురక్షితంగా డిస్పోజల్ చేయాలని IRCTCకి సూచించింది. ఇందుకోసం 360 ప్రధాన రైల్వే స్టేషన్లలో 1,853 ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అణచివేత యంత్రాలను ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు అధికారులకు సూచించింది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను తిరిగి తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలిపింది.

నో క్యారీ బ్యాగ్స్

నో క్యారీ బ్యాగ్స్

రైల్వే స్టేషన్లలోని వెండర్స్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడకుండా ఉండేలా ప్రోత్సహించాలని జోనల్ రైల్వేస్ జనరల్ మేనేజర్లకు లేఖలు రాసింది. రైల్వే ఉద్యోగులకు కూడా సూచనలు చేశారు. ఉద్యోగులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, రీయూజ్ చేయాలని, అలాగే ప్లాస్టిక్ ఉత్పత్తులను తిరస్కరించాలని కోరింది. ప్లాస్టిక్ వేస్ట్ తగ్గింపు కోసం, అలాగే ఎక్ ఫ్రెండ్లీ డిస్పోజల్ ఉపయోగం కోసం చర్యలు తీసుకుంటోంది.

రైల్వే పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధం

రైల్వే పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధం

రైల్వే పరిసరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టింగ్ నిషేధాన్ని అందరూ కచ్చితంగా అమలు చేయాలని రైల్వే బోర్డు చైర్మన్.. అందరు జనరల్ మేనేజర్లు, డివిజన్ రైల్వే మేనేజర్లకు సందేశాలు పంపించారని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉంటుంది.

English summary

రైళ్లో ప్రయాణిస్తున్నారా.. అక్టోబర్ 2 నుంచి ఇది గుర్తుంచుకోండి | Indian Railways to ban single use plastics from October 2

The Indian Railways has decided to enforce a ban on single-use plastic materials on its premises, including trains, with effect from October 2, 2019.
Story first published: Sunday, August 25, 2019, 14:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X