For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీజీ సిద్ధార్థ మిస్సింగ్, భారీ నష్టాల్లో కాఫీ డే షేర్లు

|

కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ అదృశ్యం నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు షేర్లు ఇరవై శాతం వరకు నష్టపోయి రూ.153.40 వద్ద ట్రేడ్ అయింది. షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. 2,124,708 షేర్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఎవరూ లేకపోవడం గమనార్హం.

కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ అదృశ్యం కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. సోమవారం మంగళూరులోని నేత్రవతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఆయన నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని లేదా ప్రమాదవశాత్తూ నదిలో పడిపోవచ్చునని భావిస్తున్నారు. అయితే రెండు రోజుల ముందే ఆయన కాఫీడే ఉద్యోగులకు, బోర్డు మెంబర్లకు లేఖ రాశారు. దీనిని బట్టి ఆయన ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆయన కోసం గాలిస్తున్నారు.

ఇక పోరాడలేను: ఉద్యోగులకు కాఫీ డే ఓనర్ సిద్ధార్థ లేఖ, మైండ్‌ట్రీ డీల్ ప్రస్తావనఇక పోరాడలేను: ఉద్యోగులకు కాఫీ డే ఓనర్ సిద్ధార్థ లేఖ, మైండ్‌ట్రీ డీల్ ప్రస్తావన

Coffee Day shares plunge 20 percent as VG Siddhartha goes missing

కాఫీ డే రెస్టారెంట్లు విదేశాల్లోనూ ఉన్నాయి. ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్‌ను నమోదు చేస్తోన్న ఈ రెస్టారెంట్ల అధినేత అదృశ్యం కావడం సంచలనంగా మారింది. సిద్ధార్థ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు. సిద్ధార్థకు కర్ణాటకలోని చిక్ మగళూరు జిల్లాలో కాఫీ ఎస్టేట్ ఉంది. ఆసియాలోనే అతిపెద్ద తేయాకు తోట ఇది.

కాగా, కర్ణాటకలోని మంగళూరు శివార్లలో నేత్రావతి బ్రిడ్జి వద్ద ఆపి ఉంచిన కారు నుంచి పోలీసులు లేఖను దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖ సిద్ధార్థే రాసి ఉండి ఉంటే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వీజీ సిద్దార్థ రాసినట్టుగా అనుమానిస్తోన్న ఈ లేఖ రెండురోజుల కిందటిది. శనివారం నాటి తేదీ దీనిపై రాసి ఉంది.

కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ మిస్సింగ్, బ్రిడ్జిపై కారు ఆపి.. ఏం జరిగిందంటే?కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ మిస్సింగ్, బ్రిడ్జిపై కారు ఆపి.. ఏం జరిగిందంటే?

ఇంగ్లీష్ అక్షరాలతో టైప్ చేసి ఉన్న ఈ లెటర్ కింద వీజీ సిద్ధార్థ సంతకం ఉంది. జీవితంలో నేను విఫలం అయ్యానని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నానని, సంవత్సరాల తరబడి పోరాటం సాగిస్తున్నానని, ఇక పోరాడే శక్తి లేదని, ఓడిపోయానని, మైండ్‌ట్రీతో కుదుర్చుకున్న డీల్‌ను రద్దు చేయడానిక ప్రయత్నాలు సాగాయని, కాఫీ డే రెస్టారెంట్ల షేర్లను అటాచ్ చేయడానికి కొందరు ప్రయత్నించారని, ఇవన్నీ తనను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయని, ఇప్పటిదాకా చోటు చేసుకున్న పొరపాట్లకు తాను మాత్రమే బాధ్యుడినని, ప్రతి లావాదేవీకీ తనదే బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు.

English summary

వీజీ సిద్ధార్థ మిస్సింగ్, భారీ నష్టాల్లో కాఫీ డే షేర్లు | Coffee Day shares plunge 20 percent as VG Siddhartha goes missing

Shares of Coffee Day Enterprises Ltd plunged 20% on Tuesday, July 30, after the company’s founder VG Siddhartha went missing on Monday evening. The Dakshina Kannada police have now launched a massive search operation to locate him.
Story first published: Tuesday, July 30, 2019, 11:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X