For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2023 వరకు రూ.1,08,000 కోట్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టు రెడీ!

|

న్యూఢిల్లీ: ముంబై - అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైలు (MAHSR) ప్రాజెక్టు 2023 వరకు పూర్తవుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో చెప్పారు. 508 కిలో మీటర్లన పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుతవం ప్రత్యేక ప్రయోజనం కింద నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (NHSRCL) పేరుతో దీనిని చేపడుతున్నామన్నారు.

ఎగుమతుల్లో ముందంజలో తెలంగాణ, 5 ఏళ్లలో రెండింతలుఎగుమతుల్లో ముందంజలో తెలంగాణ, 5 ఏళ్లలో రెండింతలు

జపాన్ ఆర్థిక, టెక్నికల్ సహకారంతో...

జపాన్ ఆర్థిక, టెక్నికల్ సహకారంతో...

ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం ఆర్థికంగా, టెక్నికల్‌గా సహకారం అందిస్తోందని పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,08,000 కోట్లు అన్నారు. ఇందులో రూ.3226.8 కోట్లను ఈ ఏడాది జూన్ వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టుల విస్తరణపై గోయల్ మాట్లాడుతూ.. వీటికి పెద్ద ఎత్తున నిధులు కావాలని, అదే విధంగా భారీ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం కావాలన్నారు. ఇందుకు అనువైన పరిస్థితులు ఏర్పడితే మిగతా చోట్ల ఈ ప్రాజెక్టులు చేపడతామన్నారు.

జపాన్ ప్రధాని అడ్వైజర్‌తో గోయల్ భేటీ

జపాన్ ప్రధాని అడ్వైజర్‌తో గోయల్ భేటీ

ఇదిలా ఉండగా, జపాన్ ప్రధాని షింజో అబే స్పెషల్ అడ్వైజర్ హీరోటో ఇజుమిని పీయూష్ గోయల్ కలిశారు. వీరి మధ్య ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలు విషయమై చర్చ జరిగింది. ఈ మేరకు ఇండియన్ రైల్వే అధికారులు వీరు భేటీ అయి, హైస్పీడ్ రైలుపై చర్చించారని చెప్పారు.

ఏడు గంటల నుంచి రెండు గంటలకు...

ఏడు గంటల నుంచి రెండు గంటలకు...

ఈ ప్రాజెక్టు కోసం NHSRCL గత నెల వరకు 1,380 హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకుంది. అంటే 39 శాతం ల్యాండ్‌ను అక్వైర్ చేసుకుంది. ఈ బుల్లెట్ రైలు గంటకు 320 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుందని అంచనా. ముంబై - అహ్మదాబాద్ మధ్య ఉన్న 508 కిలో మీటర్ల దూరాన్ని ఇది రెండు గంటల్లోపు చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ రూట్లో రైళ్లు అయితే ఏడు గంటలు, విమానాలు అయితే ఒక గంట సమయం తీసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే సెప్టెంబర్ 14, 2017లో రూ.1.08 లక్షల కోట్ల ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు.

English summary

2023 వరకు రూ.1,08,000 కోట్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టు రెడీ! | Mumbai-Ahmedabad high Bullet train project to be completed by 2023

The Mumbai-Ahmedabad High-Speed Rail (MAHSR), also known as Bullet Train Project will be completed by 2023, Railway Minister Piyush Goyal said in the Rajya Sabha today.
Story first published: Friday, July 26, 2019, 18:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X