For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను ఎగవేస్తే కఠిన చర్యలే, సూపర్ రిచ్‌కు నిర్మల విజ్ఞప్తి

|

న్యూఢిల్లీ: పన్నులు ఎగ్గొట్టి, వ్యవస్థతో ఆడుకునే వారితో కఠినంగా వ్యవహరించాలని, వారి భరతం పట్టాలని, అదే సమయంలో నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారికి అవసరమైన తోడ్పాటును అందించి, తగిన విధంగా గౌరవించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 159వ ఆదాయ పన్ను దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని, ప్రసంగించారు. ఎగవేతదారులను పట్టుకునేందుకు రెవెన్యూ శాఖలోని మూడు కీలక విభాగాలు.. ఆదాయపన్ను, ఈడీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) పరస్పరం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలన్నారు.

రూ.55 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్!: ఈ స్కీంకు అర్హులెవరు?రూ.55 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్!: ఈ స్కీంకు అర్హులెవరు?

టార్గెట్ రూ.13.35 లక్షల కోట్లు

టార్గెట్ రూ.13.35 లక్షల కోట్లు

పన్ను చెల్లింపుదారులను దేశ నిర్మాణానికి తోడ్పాడు అందించేవారిగా పరిగణించాలని నిర్మల చెప్పారు. దానిని పనిష్మెంట్‌గా భావించవద్దని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కోరుకున్నట్లుగా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను 8 కోట్లకు పెంచే ప్రయత్నం చేయాలన్నారు. 2019-20 బడ్జెట్‌లో పెట్టిన రూ.13.35 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ చేరుకోవచ్చుని చెప్పారు. ఇప్పటికే అన్ని ట్యాక్స్ డిపార్టుమెంట్స్‌లలో గత అయిదేళ్లలో వసూళ్లు రెండింతలు అయ్యాయన్నారు. కాబట్టి 11.8 లక్షల కోట్ల నుంచి రూ.13 లక్షల కోట్లు పెంచుకోవడం కష్టమేమీ కాదని చెప్పారు.

ఇలా పన్ను ఎగవేసే వారిని కనిపెట్టండి

ఇలా పన్ను ఎగవేసే వారిని కనిపెట్టండి

పన్నులు ఎగవేసే వారు వాటిని లా ఎగవేస్తున్నారో తెలుసుకునేందుకు డేటా మైనింగ్, బిగ్ డేటాను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. తప్పు ఎక్కడ జరుగుతుందో గుర్తించాలని, కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో అధికారులకు తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. అందుబాటులో ఉండి కూడా పన్ను చెల్లింపుదారులు పన్నులు ఎగవేస్తుంటే వారికి మంచి సేవలు అందించి, పన్నులు రాబట్టాలన్నారు. ఐనా ఎగవేయాలనుకుంటే కఠినంగా వ్యవహరించాలన్నారు. సంపన్నులపై అధిక పన్ను భారం అంశాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. పన్నులు చెల్లించడాన్ని జాతి నిర్మాణంలో భాగంగా చూడాలే తప్ప జరిమానా అనుకోవద్దన్నారు.

అర్థం చేసుకోండి...

అర్థం చేసుకోండి...

ఎక్కువ సంపాదిస్తున్న (సూపర్ రిచ్) వారిని శిక్షించాలన్నది తమ ఉద్దేశం కాదని, ఆదాయాలు, వనరుల్ని మరింత మెరుగ్గా పంచడానికి ఈ ట్యాక్స్ అవసరం అని నిర్మల చెప్పారు. అత్యధికంగా ఆదాయాలు ఆర్జించే వర్గాలు కొంత మేర సామాన్యుల అభ్యున్నతికి కూడా తోడ్పాటు అందించాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. దీనిని అర్థం చేసుకుంటే ఆదాయపన్ను విభాగం అంటే భయం ఉండదన్నారు. సాధారణ ట్యాక్స్ పేయర్స్ కూడా సంతోషంగా పన్ను చెల్లించే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఐటీ శాఖపై ఉందని చెప్పారు.

English summary

పన్ను ఎగవేస్తే కఠిన చర్యలే, సూపర్ రిచ్‌కు నిర్మల విజ్ఞప్తి | Nirmala asks taxmen to deal firmly with evaders

Finance Minister Nirmala Sitharaman on Wednesday asked taxmen to firmly deal with those who try to evade taxes and game the system but act as facilitators to those who want to pay taxes honestly.
Story first published: Thursday, July 25, 2019, 9:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X