For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రిటన్ కేబినెట్లో ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు సహా ముగ్గురు ఇండియన్స్

|

లండన్: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ నేత బోరిస్ జాన్సన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేబినెట్‌ను సిద్ధం చేశారు. ఈ కేబినెట్లో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కింది. ఇందులో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ కూడా ఉన్నారు. అతనికి ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. ఆయనతో పాటు మరో ఇద్దరు చోటు దక్కించుకున్నారు.

రిషి సునక్ (38) కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ. రిచ్‌మండ్ (యార్క్‌షైర్) నుంచి ఎంపీగా ఉన్నారు. ఇటీవలి వరకు ట్రెజరీ చీఫ్ సెక్రటరిగా ఉన్న లిజ్ ట్రస్‌ స్థానంలో రిషి సునక్‌ను నియమించారు. ఈ మేరకు యూకే ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

Infosys Narayana Murthys son in law Rishi Sunak joins Boris Johnsons cabinet

రిషి సునక్ ఇంగ్లాండ్‌లోని హాంప్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూవర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 2014లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. 2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్ నుంచి ఎంపీగా గెలిచారు. గతంలో థెరిసా గవర్నమెంటులో మంత్రిగా పని చేశారు.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో సహ విద్యార్థిని అయిన నారాయణమూర్తి కూతురు అక్షతామూర్తిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.

రిషిసునక్‌తో పాటు భారత సంతతికి చెందిన అలోక్ వర్మ, ప్రీతి పటేల్‌లకు చోటు దక్కింది. ప్రీతి పటేల్ హోం సెక్రటరీగా నియమితులయ్యారు.
మన దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి, మన ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, నేరాలపై పోరాడేందుకు తన శక్తి కొలదీ పని చేస్తానని ప్రీతి పటేల్ అన్నారు. తన ముందున్న సవాళ్లపై పోరాడేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు.

English summary

బ్రిటన్ కేబినెట్లో ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు సహా ముగ్గురు ఇండియన్స్ | Infosys Narayana Murthy's son in law Rishi Sunak joins Boris Johnson's cabinet

Infosys co-founder N.R. Narayana Murthy's son-in-law Rishi Sunak is among the three Indians to have found place in British Prime Minister Boris Johnson's new cabinet team.
Story first published: Thursday, July 25, 2019, 16:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X