For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, HRA ఎలా లెక్కిస్తారంటే?

|

న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం, గృహ అద్దె భత్యానికి (HRA) సంబంధించిన భత్యం విషయమై కొంత గందరగోళం నెలకొంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల HRA పెరుగుతుందని తెలిపింది.

ఉద్యోగి లేదా ఉద్యోగిని జీవించే సిటీ ప్రాతిపదికన ఇంటి అద్దె భత్యం మారుతుందని తెలిపింది. జనాభా ప్రాతిపదికన పట్టణం అప్‌గ్రేడ్ అయితే అప్పుడు సదరు ఉద్యోగికి హెచ్ఆర్ఏ పెరుగుతుంది.

X, Y, Z ఆధారంగా

X, Y, Z ఆధారంగా

X, Y, Z ఆధారంగా ఒక నగరాన్ని వర్గీకరిస్తారు. X కేటగిరీ నగరాల్లో, జనాభా 50 లక్షలకు పైన, HRA నెలకు 24 శాతం, Y, Z కేటగిరీ నగరాలకు HRA వరుసగా 16 శాతం, 8 శాతంగా ఉంటుంది. Y కేటగిరీలో 5 లక్షలకు పైగా జనాభా, Z కేటగిరీలో 5 లక్షల లోపు జనాభా ఉంటుంది.

ప్రభుత్వ సంస్థల నివేదిక

ప్రభుత్వ సంస్థల నివేదిక

జనాభా ఆధారంగా ఒక నగరాన్ని అప్‌గ్రేడ్ చేస్తే అక్కడ నివసిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హెచ్‌ఆర్‌ఏ మెరుగుపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సర్క్యులర్ పేర్కొంది. ప్రభుత్వ సంస్థల నివేదిక ఆధారంగా నగరాలను అప్‌గ్రేడ్ చేసిన అనంతరం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సర్క్యులర్ జారీ చేసింది.

సర్క్యులర్ అన్ని సందేహాలను తొలగిస్తుంది

సర్క్యులర్ అన్ని సందేహాలను తొలగిస్తుంది

HRAకి సంబంధించి కొంత గందరగోళం నెలకొని ఉంది. తాజా సర్క్యులర్ అన్ని సందేహాలను తొలగిస్తుంది. ప్రాథమిక కనీస వేతనంపై కూడా7వ వేతన సంఘం సిఫార్సు చేసింది. కనీస వేతనం రూ.26 వేల వరకు ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

English summary

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, HRA ఎలా లెక్కిస్తారంటే? | 7th Pay Commission: HRA latest news and how it will now be calculated

There was some confusion with regard to the 7th Pay Commission and the allowance relating to House Rent Allowance. The Centre has said that the HRA of a Central Government employee would be increased if the city in which he or she is living has been upgraded on the basis of the population.
Story first published: Thursday, July 25, 2019, 15:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X