For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI గుడ్‌న్యూస్, IMPS ఛార్జీల ఎత్తివేత

|

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రానిక్ ట్రాన్సుఫర్ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. IMPS ట్రాన్సాక్షన్లపై ఛార్జీలను ఆగస్ట్ 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీఐ స్పష్టం చేసింది. రోజులో ఏ క్షణమైనా డబ్బులు ట్రాన్సుఫర్ చేసేందుకు IMPS ఉపయోగపడుతుంది. వీటిపై ఇప్పటి వరకు వసూలు చేస్తన్న ఛార్జీలు ఆగస్ట్ నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు.

అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు: ట్రంప్ ఏం కోరుకుంటున్నారు?అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు: ట్రంప్ ఏం కోరుకుంటున్నారు?

డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు ప్రోత్సాహం

డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు ప్రోత్సాహం

ఇప్పటికే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్సుఫర్ (NEFT), యోనో బ్యాంక్ యాప్ పైన ఇప్పటికే ఛార్జీలు వసూలును రద్దు చేసింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నెఫ్ట్, ఆర్టీజీఎస్‌పై ఆర్బీఐ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు గత నెల ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనిని ఎస్బీఐ జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తోంది.

IMPSపై ఇక ఈ ఛార్జీలు ఉండవు

IMPSపై ఇక ఈ ఛార్జీలు ఉండవు

ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ వినియోగదారులు ఆగస్ట్్ 1వ తేదీ నుంచి ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీసెస్ (IMPS)పై ఛార్జీలు వసూలు చేయదు. ప్రస్తుతం రూ.1,000 వరకు ట్రాన్సాక్షన్స్ పైన ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడం లేదు. రూ.1000-10,000 వరకు 1+జీఎస్టీ, రూ.10,001-1,00,000 వరకు రూ.2+జీఎస్టీ, రూ.1,00,001-2,00,000 వరకు లావాదేవీలపై రూ.3+జీఎస్టీ వసూలు చేస్తోంది.

6 కోట్ల మంది ఎస్బీఐ ఇంటర్నెట్ యూజర్లు

6 కోట్ల మంది ఎస్బీఐ ఇంటర్నెట్ యూజర్లు

ఎస్బీఐకి 29.7 కోట్ల మంది డెబిట్ కార్డు హోల్డర్స్ ఉండగా, ఇందులో 6 కోట్ల మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్, 1.4 కోట్ మంది మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారు. యోనో యాప్‌ను ఒక కోటిమంది కస్టమర్లు ఉపయోగిస్తున్నారు. ఎస్బీఐ బ్యాంకింగ్ షేర్ 25 శాతంగా ఉంది. బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎస్బీఐ 18 శాతం వాటా కలిగి ఉంది.

English summary

SBI గుడ్‌న్యూస్, IMPS ఛార్జీల ఎత్తివేత | SBI waives IMPS charges from August 1

State Bank of India has waived charges on NEFT and RTGS transactions through Internet and mobile banking from July 1, after the Reserve Bank of India decided to do away with the charges with an aim to move the country towards less cash economy.
Story first published: Saturday, July 13, 2019, 12:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X